బద్దు చౌహాన్
Jump to navigation
Jump to search
బద్దు చౌహాన్ | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1985 నుండి 1999 | |||
నియోజకవర్గం | దేవరకొండ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | సీపీఐ | ||
సంతానం | గౌతమ్ చౌహాన్, ఝాన్సీ లక్ష్మీ | ||
నివాసం | లక్ష్మీనగర్ కాలనీ, కొత్తపేట, ఎల్‌బీనగర్, హైదరాబాద్ |
ముడావత్ బద్దు చౌహాన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేవరకొండ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]బద్దు చౌహాన్ వరంగల్ జిల్లా, కొరివి మండలం, కంచర్లగూడెం గ్రామంలో 1951లో తుపియా చౌహాన్, చోమ్లీ దంపతులకు జన్మించాడు.[3] ఆయన ఎంఏ, బీఈడీ వరకు చదివాడు. ఆయన విద్యార్థి దశలో అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్)లో పనిచేశాడు.
ఇతర పదవులు
[మార్చు]ఆయన అనంతరం సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా, రాష్ట్ర గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, వ్యవసాయ సంఘం నాయకుడిగా పనిచేశాడు.
పోటీ చేసిన నియోజకవర్గాలు
[మార్చు]సంవత్సరం | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|
1985 | దేవరకొండ | ఎస్టీ రిజర్వుడు | ముడావత్ బద్దు చౌహాన్ | సి.పి.ఐ | 46525 | విజయలక్ష్మి | భారత జాతీయ కాంగ్రెస్ | 21404 | గెలుపు |
1989 | దేవరకొండ | ఎస్టీ రిజర్వుడు | ముడావత్ బద్దు చౌహాన్ | సి.పి.ఐ | 49414 | డి.రాగ్యానాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ | 44214 | గెలుపు |
1994 | దేవరకొండ | ఎస్.సి రిజర్వడ్ | ముడావత్ బద్దు చౌహాన్ | సి.పి.ఐ | 56630 | డి.రాగ్యానాయక్ | స్వతంత్ర అభ్యర్థి | 33557 | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 November 2018). "హ్యాట్రిక్.. వీరులు!". Sakshi. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
- ↑ Sakshi (11 November 2013). "సీపీఐ మాజీ ఎమ్మెల్యే బద్దు చౌహాన్ కన్నుమూత". Sakshi. Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.
- ↑ Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.