Jump to content

బద్రీనాథ్ టాండన్

వికీపీడియా నుండి
బద్రీనాథ్ టాండన్
జననం(1931-08-01)1931 ఆగస్టు 1
భారతదేశం
మరణం2018 మార్చి 5(2018-03-05) (వయసు: 86)
వృత్తిగ్యాస్ట్రోఎంటెరాలజిస్టు
హెపటాలజిస్ట్
మెడికల్ ఎకడమిక్
క్రియాశీలక సంవత్సరాలు1962 నుండి
పేరుపడ్డదిగ్యాస్ట్రోఎంటెరాలజీ
హెపటాలజిఈ
పిల్లల పోషకాహారం
పురస్కారాలుపద్మభూషణ
ససకావా WHO హెల్త్ ప్రైజ్
రష్యన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూబిలీ మెడల్
కెంట్ మెమోరియల్ అవార్డ్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డ్
ISG లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డ్

బద్రీనాథ్ టాండన్ (1931 ఆగస్టు 1 - 2018 మార్చి 5) భారతీయ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్, వైద్య పరిశోధకుడు, విద్యావేత్త, నోయిడాలోని మెట్రో హాస్పిటల్స్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్, సీనియర్ కన్సల్టెంట్. ఆయన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో గ్యాస్ట్రోఎంటరాలజీ, హ్యూమన్ న్యూట్రిషన్ యూనిట్ విభాగాధిపతి, మాజీ ప్రొఫెసర్, న్యూఢిల్లీలోని పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ లివర్, రీనల్ అండ్ డైజెస్టివ్ డిసీజెస్‌లో హెపటాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీకి మాజీ డైరెక్టరు, సీనియర్ కన్సల్టెంట్. [1] ఆయన ససకావా WHO హెల్త్ ప్రైజ్, RAMS జూబ్లీ మెడల్‌తో సహా అనేక అవార్డులను అందుకున్నాడు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1986లో పద్మభూషణ్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. [2]

జీవిత చరిత్ర

[మార్చు]

బద్రీ నాథ్ టాండన్, 1931 ఆగస్టు 1 న ఖత్రి కుటుంబంలో జన్మించాడు.[3][4] లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ (MBBS)లో పట్టభద్రుడయ్యాడు. అదే సంస్థ నుండి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD) పొందాడు. [1] తదనంతరం, అతను బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీలో అధునాతన శిక్షణ కోసం చేరాడు. తరువాత కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో న్యూట్రిషన్ సైన్స్‌లో శిక్షణ పొందాడు.[1] ఆయన 1962లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో అధ్యాపక సభ్యుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి, 1991 వరకు అక్కడే ఉన్నాడు. ఈ కాలంలోనే ఆయన AIIMSలో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాన్ని స్థాపించాడు. ఆ విభాగ అధిపతిగా, హ్యూమన్ న్యూట్రిషన్ యూనిట్‌లో ప్రొఫెసర్‌గా 1991 ఆగస్టు 31 న AIIMS సేవ నుండి పదవీ విరమణ చేసే వరకు సేవలందించాడు.[5] 1993లో ఆయన న్యూఢిల్లీలోని పుష్పవతి సింఘానియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లివర్, రీనల్ అండ్ డైజెస్టివ్ డిసీజెస్‌కు డైరెక్టరుగా, సీనియర్ కన్సల్టెంటుగా పనిచేసాడు. 2000 వరకు ఆ సంస్థకు సేవలందించాడు. ఆ తర్వాత ఆయన నోయిడాలోని మెట్రో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు ఛైర్మన్‌గా చేరాడు.[1]

టాండన్‌కు అనేక వైద్య, సామాజిక-వైద్య కార్యక్రమాలతో సంబంధం ఉంది. 1975లో యునిసెఫ్ సహాయంతో భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (అంగన్‌వాడీ) పథకం ప్రవేశపెట్టినప్పుడు, ఆయన ఆ కార్యక్రమం ప్రారంభం నుండి 1995 వరకు దాని సాంకేతిక కమిటీకి అధ్యక్షత వహించాడు.[6] ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రారంభించిన టాస్క్ ఫోర్స్ ఆఫ్ లివర్ డిసీజెస్‌కు ఛైర్మన్‌గా పనిచేశాడు. డైజెస్టివ్ డిసీజెస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, డైజెస్టివ్ డిసీజెస్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ఉన్నాడు.[3] ఆయన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లివర్ డిసీజెస్, ఆసియన్ పసిఫిక్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లివర్, ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ,[7] న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (1995–99) [8] వంటి సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేసాడు. వరల్డ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.

టాండన్ ప్రేగు వ్యాధులు, పేగు, ప్యాంక్రియాస్, కాలేయంపై పోషకాహార లోపం యొక్క ప్రభావాలు వివిధ వ్యాధులలో వ్యాధికారకాలు, ఆహార విషాల పాత్రపై మార్గదర్శక పరిశోధనలు చేసినట్లు తెలిసింది.[1] కాలేయం యొక్క వెనో-ఆక్లూజివ్ వ్యాధిపై ఆయన చేసిన కృషి జున్‌జునియా విత్తనాలలో ఉన్న పైరోలిజిడిన్ ఆల్కలాయిడ్లు ఈ వ్యాధికి కారణమవుతాయని కనుగొనడంలో సహాయపడింది.[9] హెపటైటిస్ E వైరస్‌ను వేరుచేయడం, హెపటైటిస్ E కి, అలాగే హెపటైటిస్ C కీ మూలికలను ఉపయోగించి కొత్త చికిత్స ప్రోటోకాల్‌ను ప్రవేశపెట్టడంలో కూడా ఆయన ఘనత పొందాడు.[1] ఆయన పరిశోధనలు 225 కి పైగా వైద్య పత్రాలు, నాలుగు మోనోగ్రాఫ్‌లలో నమోదు చేయబడ్డాయి. [10] [11] [12] ఆయన రెండు పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్‌బుక్ ఆఫ్ ట్రాపికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ,[13] ట్రాపికల్ హెపాటో-గ్యాస్ట్రోఎంటరాలజీ, [14] కూడా ప్రచురించాడు. ఇతరులు రాసిన పాఠ్య పుస్తకాలకు 13 అధ్యాయాలను అందించాడు.[1] ట్రాపికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్ వ్యవస్థాపక సంపాదకుడిగా ఉండటంతో పాటు, [15] అతను అనేక జాతీయ, అంతర్జాతీయ పత్రికల సంపాదకీయ బోర్డులలో కూడా ఉన్నాడు; నేషనల్ మెడికల్ జర్నల్, సిలోన్ మెడికల్ జర్నల్, ఆసియన్ పసిఫిక్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ, హెపటాలజీ కమ్యూనికేషన్, యూరోపియన్ జర్నల్ ఆఫ్ హెపటాలజీ, జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ ఇంటర్నేషనల్ వాటిలో ఉన్నాయి.[1]


బద్రీ నాథ్ టాండన్ 86 సంవత్సరాల వయసులో 2018 మార్చి 5న న్యూఢిల్లీలో మరణించారు. [16]

అవార్డులు, గౌరవాలు

[మార్చు]

టాండన్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫెలోగా ఉన్నాడు. 1974లో ఆ పదవికి ఎన్నికయ్యాడు.[17] ఆయన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్స్, ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్‌లలో కూడా ఫెలోగా ఉన్నాడు.[18] భారత ప్రభుత్వం 1986 లో ఆయనకు పద్మ భూషణ్ అనే పౌర గౌరవాన్ని ప్రదానం చేసింది.[2] ఆయన 1990 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ససకావా WHO ఆరోగ్య బహుమతిని, 1995 లో రష్యన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి జూబ్లీ పతకాన్ని అందుకున్నాడు.[19] ఆయన నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క డాక్టర్ RV రాజమ్ ఓరేషన్ (1983–84) వంటి అనేక అవార్డు ప్రసంగాలు చేశాడు.[17] నేషనల్ హోమియోపతిక్ అసోసియేషన్ వారి కెంట్ మెమోరియల్ అవార్డు (1998), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ న్యూఢిల్లీ చాప్టర్ వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు (2004), ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వారి ప్రారంభ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు (2007) అందుకున్నాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 7 8 9 "Indian Fellow". Indian National Science Academy. 2016. Archived from the original on 13 August 2016. Retrieved 7 May 2016.
  2. 1 2 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.
  3. 1 2 "Brief Profile". Purple Health. 2016. Retrieved 7 May 2016.
  4. "Eminent khatri personalities". Khatri Sabha. 2016. Archived from the original on 9 September 2017. Retrieved 7 May 2016.
  5. "Introduction". All India Institute of Medical Sciences, Delhi. 2016. Retrieved 7 May 2016.
  6. . "Integrated Child Development Services (ICDS): An Assessment". Archived 2016-06-02 at the Wayback Machine
  7. "Archive History". Indian Society of Gastroenterology. 2016. Archived from the original on 3 June 2016. Retrieved 7 May 2016.
  8. "NSI Presidents". Nutrition Society of India. 2016. Archived from the original on 17 October 2015. Retrieved 7 May 2016.
  9. Jame Abraham (10 March 2016). "Nuns Work Where None Work". Asco Post. Retrieved 7 May 2016.
  10. "Badri Nath Tandon on Microsoft Academic Search". Microsoft Academic Search. 2016. Archived from the original on 3 June 2016. Retrieved 7 May 2016.
  11. "Badri Nath Tandon on Aminer". Aminer. 2016. Retrieved 7 May 2016.
  12. "Publications of Dr. B.M. Gandhi". Neobiomed Services. 2016. Retrieved 7 May 2016.
  13. B. N. Tandon; Samiran Nundy (January 1988). Textbook Of Tropical Gastroenterology. Oxford University Press. p. 350. ISBN 9780195620993.
  14. B. N. Tandon (November 2010). Tropical Hepato-Gastroenterology. Elsevier India. p. 804. ISBN 978-8131203132.
  15. "About Us". Tropical Gastroenterology. 2016. Archived from the original on 30 April 2016. Retrieved 7 May 2016.
  16. "Badri Nath Tandon (1 August 1931 – 5 March 2018)". The National Medical Journal of India. Retrieved 30 November 2023.
  17. 1 2 "List of NAMS Fellows" (PDF). National Academy of Medical Sciences. 2016. Retrieved 8 May 2016.
  18. "B N Tandon on CrediHealth". CrediHealth. 2016. Retrieved 7 May 2016.[permanent dead link]
  19. "Dr. B N Tandon — Doctor Babu". Doctor Babu. 2016. Archived from the original on 2 June 2016. Retrieved 7 May 2016.

మూలాలు

[మార్చు]
  • Bao-En Wang (July 2002). "Demographic, clinical, and virological characteristics of hepatocellular carcinoma in Asia: Survey of 414 patients from four countries".
  • Hema Gupta (February 1993). "Localization of a new enteric non-A, non-B [HEV] virus in target organ liver".
  • Dinesh K. Bhargava (April 1985). "Diagnosis of ileocecal and colonic tuberculosis by colonoscopy".