బద్రుద్దీన్ అజ్మల్
| మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ | |||
2016లో అజ్మల్ | |||
| పదవీ కాలం 2009 మే 16 – 2024 జూన్ 4 | |||
| ముందు | అన్వర్ హుస్సేన్ | ||
|---|---|---|---|
| తరువాత | రకీబుల్ హుస్సేన్ | ||
| నియోజకవర్గం | ధుబ్రి | ||
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2005 అక్టోబర్ 2 | |||
| ముందు | స్థానం స్థాపించబడింది | ||
| పదవీ కాలం 2006 – 2009 | |||
| ముందు | వాజెద్ అలీ చౌదరి | ||
| తరువాత | వాజెద్ అలీ చౌదరి | ||
| నియోజకవర్గం | సల్మారా సౌత్ | ||
| పదవీ కాలం 2006 – 2006 | |||
| ముందు | ఖలీలుర్ రెహమాన్ చౌదరి | ||
| తరువాత | సిరాజుద్దీన్ అజ్మల్ | ||
| నియోజకవర్గం | జమునముఖ్ | ||
జమియత్ ఉలామా-ఎ-హింద్ అస్సాం యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు | |||
అజ్మల్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2005 | |||
| ముందు | స్థానం స్థాపించబడింది | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1950 ఫిబ్రవరి 12 హోజాయ్, అస్సాం , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (2005 నుండి ప్రస్తుతం) | ||
| జీవిత భాగస్వామి | రెహానా బద్రుద్దీన్ అజ్మల్ | ||
| బంధువులు | సిరాజుద్దీన్ అజ్మల్ (సోదరుడు) | ||
| సంతానం |
| ||
| పూర్వ విద్యార్థి | దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
బద్రుద్దీన్ అజ్మల్ (జననం 12 ఫిబ్రవరి 1950) అసోం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]
మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ కుటుంబ సభ్యులతో కలిసి అజ్మల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను కలిగి ఉన్నాడు, వీటిలో అజ్మల్ ఫ్రాగ్రాన్సెస్ అండ్ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అజ్మల్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెల్లెజా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, హ్యాపీ నెస్ట్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-మాజిద్ డిస్టిలేషన్ అండ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ & అజ్మల్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.[4]
రాజకీయ జీవితం
[మార్చు]బద్రుద్దీన్ అజ్మల్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 2006 అసోం శాసనసభ ఎన్నికలలో జమునముఖ్ & సల్మారా సౌత్ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అన్వర్ హుస్సేన్‌పై 1,84,419 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
బద్రుద్దీన్ అజ్మల్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి వాజెద్ అలీ చౌదరిపై 2,29,730 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలలో ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అబూ తాహెర్ బెపారిపై 2,26,258 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
బద్రుద్దీన్ అజ్మల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ చేతిలో 2,29,730 ఓట్లతో ఓడిపోయాడు.[5][6]
బద్రుద్దీన్ అజ్మల్ 2026 అస్సాం శాసనసభ ఎన్నికలలో బిన్నకండి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Badruddin Ajmal MP" (in ఇంగ్లీష్). The Indian Express. 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "Badruddin Ajmal" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "Bengali-speaking Assamese Muslim, businessman, politician, theologian, loose cannon: The many identities of Badruddin Ajmal" (in ఇంగ్లీష్). The Indian Express. 6 December 2022. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "The business interests of Maulana Badruddin Ajmal". Mint. 6 May 2014. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Dhubri" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "Dhubri Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "Badruddin Ajmal Takes Oath As MLA, Returns To Assam Assembly After 2 Decades" (in ఇంగ్లీష్). NDTV. 22 June 2026. Archived from the original on 22 June 2026. Retrieved 22 June 2026.
- ↑ "AIUDF chief Badruddin Ajmal takes oath as Assam MLA". The Print. 22 June 2026. Archived from the original on 22 June 2026. Retrieved 22 June 2026.