బనగానపల్లె సంస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బనగానపల్లె సంస్థానం
బనగానపల్లె
సంస్థానం
1665–1948

Flag of బనగానపల్లె

Flag

Location of బనగానపల్లె
Location of బనగానపల్లె
Map of the princely state of Banganapalle, 1893
చరిత్ర
 -  Established 1665
 -  Accession to the Union of India 1948
విస్తీర్ణం
 -  1901 712 km2 (275 sq mi)
జనాభా
 -  1901 32,279 
Density సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. /km2  (సమాసంలో (Expression) లోపం: "," అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. /sq mi)
Today part of ఆంధ్రప్రదేశ్
1913 మద్రాస్ ప్రెసిడెన్సీ పటంలో బనగానపల్లె సంస్థానం స్థానం

బ్రిటిష్ రాజ్ కాలంలో భారతదేశంలోని సంస్థానాల్లో బనగానపల్లె సంస్థానం ఒకటి. ఈ సంస్థానాన్ని 1665 లో స్థాపించారు. దాని రాజధాని బనగానపల్లె. దీని పాలకులు షియా ముస్లింలు. చివరి పాలకుడు ఫిబ్రవరి 23, 1948 న ఇండియన్ యూనియన్‌లో ప్రవేశానికి సంతకం చేశాడు. [1]

చరిత్ర[మార్చు]

1601 లో బీజపూర్‌ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా మునుపటి పాలకుడు రాజా నంద చక్రవర్తిని తొలగించి, కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు, బనగానపల్లె గ్రామం వెలుగు లోకి వచ్చింది. ఒక పెద్ద ప్రావిన్స్‌లో భాగంగా బనగానపల్లెను, బీజాపూర్ సుల్తాను తన విశ్వసనీయ జనరల్ సిద్ది సంబల్ నియంత్రణలో ఉంచాడు. ఆఫ్రికాకు చెందిన సిద్ది, బనగానపల్లె కోటను గణనీయంగా బలపరచాడు.

1665 లో, బీజాపూర్‌కు చెందిన సుల్తాన్ ఆదిల్ షా II అందించిన సేవలకు ప్రతిఫలంగా బనగానపల్లెను, దాని పరిసర ప్రాంతాలతో జాగీరుగా మహమ్మద్ బేగ్ ఖాన్-ఎ-రోజ్‌బహానీకి మంజూరు చేశాడు. రోజ్‌బహానీ మగ వారసులు లేకుండా మరణించాడు. అతడి దత్తపుత్రుడైన ముహమ్మద్ బేగ్ ఖాన్ నజ్మ్-ఇ-సాని, ఫైజ్ అలీ ఖాన్ బహదూర్ పేరుతో ఈ ఎస్టేట్‌ను చేపట్టాడు. ఫైజ్ అలీ, అతని సోదరుడు ఫజల్ అలీ బీజాపూర్ సుల్తాన్ క్రింద ఉన్న అధికారులు. ఆ హోదాలోనే రోజ్‌బహానీతో పరిచయం కలిగింది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, ఫైజ్ అలీ రోజ్‌బహానీ మనుమడు -కుమార్తెకు కుమారుడు. ఈ రెండు విధాలు గానూ వారసత్వం ఖచ్చితంగా చట్టబద్ధమైనది కాదు. కానీ రోజులు చాలా అస్థిరంగా ఉన్న కాలమది. చట్టపరమైన మంచి చెడుల కంటే, నియంత్రణ చాలా ముఖ్యం. 1686 లో ఔరంగజేబు నేతృత్వం లోని మొఘలుల చేతిలో ఓడిపోయాక బీజాపూర్ సుల్తానేట్ అస్తమించింది. అదృష్టవశాత్తూ, ఔరంగజేబు యొక్క దక్కను ప్రతినిధి, ముబారిజ్ ఖాన్ మరెవరో కాదు, ఫైజ్ అలీ ఖాన్ మామగారు. ముబారిజ్ ఖాన్ జోక్యంతో బనగానపల్లె ఫైఫ్ ఫైజ్ అలీ ఖాన్‌కు దక్కింది.

అయితే, ఫైజ్ అలీ ఖాన్ కూడా మగ వారసుడు లేకుండానే మరణించాడు

బనగానపల్లెను ఫైజ్ ఆలీ ఖాన్ వారసులు, మొఘల్ సామ్రాజ్యానికి సామంతులుగా పాలించారు. హైదరాబాదు నిజాం 1724 లో మొఘలుల నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాక, బనగానపల్లె హైదరాబాదుకు సామంత రాజ్యంగా మారింది. ఫైజ్ అలీ ఖాన్ కూడా మగ వారసుడు లేకుండానే మరణించాడు. బనగానపల్లెకు అతని మనవడు హుస్సేన్ అలీ ఖాన్ వారసత్వంగా వచ్చాడు. హుస్సేన్ అలీ ఖాన్ పాలన ముగిసే సమయానికి, మైసూర్‌కు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని విస్తరిస్తున్నాడు. హుస్సేన్ అలీ ఖాన్ హైదర్ అలీకి తన విధేయతను మార్చుకున్నాడు. హుస్సేన్ అలీ ఖాన్ 1783 లో మరణించాడు. అతని చిన్న కుమారుడు గులాం ముహమ్మద్ అలీ రాజ్యానికివచ్చాడు. అతడు చిన్నవాడు కావడం చేత అతడి మామ రాజ ప్రతినిధిగా ఉండేవాడు. ఒక సంవత్సరం వ్యవధిలో, హైదర్ వారసుడు టిప్పు సుల్తాన్ వారిని బనగానపల్లె నుండి తరిమివేసాడు. వారు హైదరాబాదులో ఆశ్రయం పొందారు. 1789 లో బనగానపల్లెను తిరిగి పొందటానికి తిరిగి వచ్చారు. కొంతకాలం తర్వాత, సమీపంలోని చెంచెలిమల జాగీర్‌ను బనగానపల్లె నవాబు వివాహం ద్వారా పొందాడు.

19 వ శతాబ్దం ప్రారంభంలో బనగానపల్లె బ్రిటిష్ ఇండియాలో సంస్థానంగా మారింది. మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు, ఆర్థిక దుర్వ్యవహారాల కారణంగా రెండుసార్లు సంస్థాన పరిపాలనను తన చేతుల్లోకి తీసుకున్నాడు - మొదటిసారి 1832 నుండి 1848 వరకు, రెండవసారి 1905 లో కొన్ని నెలల పాటు.

1901 లో బనగానపల్లె సంస్థానం 660 చ.కి.మీ. విస్తీర్ణంతో, 32,264 జనాభా కలిగి ఉండేది.

1948 లో, బనగానపల్లె పాలకుడు స్వతంత్ర భారతదేశంలో చేరాడు. బనగానపల్లెను అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కర్నూలు జిల్లాలో చేర్చారు. 1953 లో, కర్నూలు జిల్లాతో సహా మద్రాస్ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలు ఆంధ్రరాష్ట్రంలో చేరింది. ఆ తరువాత, 1956 లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది.

పాలకులు[మార్చు]

1665 - 1876 మధ్య బనగానపల్లె రాష్ట్ర పాలకులకు "కిలాదార్" అనే బిరుదు ఉండేది. [2]

కిలాదార్లు[మార్చు]

  • 1665 - 1686 ముహమ్మద్ బేగ్ ఖాన్ (dc1686)
  • 1686 - 1725 ముహమ్మద్ బేగ్ ఖాన్-ఇ- లుంగ్ (మ .1725)
  • 1725 - 1728 అటా ఖాన్ (మ .1728)
  • 1728 - 1737 ఫాజిల్ `అలీ ఖాన్ I (మ .1737)
  • 1737 - 1769 ఫాజిల్ `అలీ ఖాన్ II (మ .1769)
  • 7 ఏప్రిల్ 1769 - 26 ఆగస్టు 1783 సయ్యద్ హుస్సేన్ అలీ ఖాన్ (మ .1783) (వ్యక్తిగత శైలి ఖాన్ బహదూర్)
  • 1784 - 1790 ముహమ్మద్ యూసుఫ్-మైసూర్ అడ్మినిస్ట్రేటర్
  • 1790 - 1814 మొజాఫర్ అల్-మోల్క్ అసద్ `అలీ ఖాన్ - సంయుక్తంగా ఈ క్రిందివారితో:
    • 1790 - 8 సెప్టెంబర్ 1822 ఘోలం `అలీ ఖాన్ I (మ .1825)
    • 8 సెప్టెంబర్ 1822 - 1831 హోసైన్ `అలీ ఖాన్ (1 వ సారి) (మ .1848)
    • 12 జూలై 1848 - 1848 హోసైన్ `అలీ ఖాన్ (2 వ సారి) (సా )
    • 1848 - 7 అక్టోబర్ 1868 ఘోలం మొహమ్మద్ `అలీ ఖాన్ II (మ .1868)
    • 7 అక్టోబర్ 1868 - 24 జనవరి 1876 ఫాత్ `అలీ ఖాన్ (జ .1849 - డి. 1905)

నవాబులు[మార్చు]

  • 24 జనవరి 1876 - 21 ఏప్రిల్ 1905 ఫత్ `అలీ ఖాన్ (సా )
  • 21 ఏప్రిల్ 1905 - 22 జనవరి 1922 ఘోలం `అలీ ఖాన్ III (జ .1874 - డి. 1922)
  • 21 ఏప్రిల్ 1905 - 12 డిసెంబర్ 1908 జాన్ చార్ట్రెస్ మోలోనీ -రెజెంట్ (జ .1877 - డి. 1948)
  • 22 జనవరి 1922 - 15 ఆగస్టు 1947 ఫడ్లీ `అలీ ఖాన్ III (జ .1901 - డి. 1948) (1939-1947 బహిష్కరణకు గురయ్యాడు)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Banganapalle Princely State (9 gun salute)". Archived from the original on 2017-04-01. Retrieved 2020-05-03.
  2. Princely States of India A-J