Jump to content

బన్వారీ లాల్ శర్మ

వికీపీడియా నుండి
బన్వారీ లాల్ శర్మ

పదవీ కాలం
2018 – 2020
ముందు సుబేదార్ సింగ్ రాజోధ
తరువాత సుబేదార్ సింగ్ రాజోధ
నియోజకవర్గం జౌరా

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం మధ్యప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

బన్వారీ లాల్ శర్మ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు జౌరా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బన్వారీ లాల్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2013 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి సుబేదార్ సింగ్ రాజోధ చేతిలో 2,498 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మనీరం ధకడ్ పై 15,173 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] బన్వారీ లాల్ శర్మ 56187 ఓట్లతో విజేతగా నిలవగా, మనీరం ధకడ్ కి 41014 ఓట్లు వచ్చాయి.

మరణం

[మార్చు]

బన్వారీ లాల్ శర్మ 66 సంవత్సరాల వయసులో తీవ్ర అనారోగ్యంతో భోపాల్‌లో 2019 డిసెంబర్ 21న మరణించాడు.[3] ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన జపతప్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Jaura Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 2023. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
  2. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. "मुरैना की जौरा विधानसभा सीट से कांग्रेस विधायक बनवारी लाल शर्मा का निधन". Nai Dunia. 21 December 2019. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
  4. "पूर्व विधायक ने बनवारी लाल शर्मा के निधन पर जताया शोक, पार्टी के लिए बताया अपूरणीय क्षति". ETV Bharat News. 21 December 2019. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.