బయ్యాజీ అప్పాజీ పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బయ్యాజీ అప్పాజీ పాటిల్

బయ్యాజీ అప్పాజీ పాటిల్ షిర్డీ సాయిబాబా ను జీవితాంతమూ సేవించుకో గలిగిన భాగ్యశాలి. [1]

జీవిత విశేషాలు[మార్చు]

బయ్యాజీ 1889 లో జన్మిచాడు. ఇతడు శిరిడీ లోనే పుట్టి పెరిగి సాయితో పాటే శిరిడీలోనే నివసిస్తూ ఆ సద్గురువును సేవించుకోగలిగిన అదృష్టవంతుడు. బయ్యాజీ పాటిల్ కు చిన్నతనం నుంచే బాబా తెలుసు. బాబా జీవితాంతమూ వీరింట్లో భిక్ష చేశారు. బాబా మూడు సంవత్సరాలపాటు వీరింటికి రోజుకు 8 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు . తరువాత మూడు సంవత్సరాలు రోజుకు 4 సార్లు వీరింట్లో భిక్ష చేసేవారు. ఆ తర్వాత 12 సం. లు పాటు ప్రతి రోజూ ఒక్కసారి భిక్ష స్వీకరించేవారు. బాబాను సేవించడం మొదలు పెట్టేటప్పటికి బయ్యాజీ అప్పాజీ పాటిల్ కు 11 సంవత్సరాలు.[2]

బాబా మహాసమాధి చెందక ముందు 14 సం. లు పాటు ప్రతిరోజూ బయ్యాజీ పాటిల్ కు నాలుగు రూపాయలిచ్చి, "నేనిచ్చిన ఈ ధనాన్ని ఎవ్వరికీ దానం చేయవద్దు. దీనిని ఖర్చు పెట్టకు. ఎవ్వరికీ అప్పుగా కూడా ఇవ్వకు" అన్నారు. అందుకని అతడు ఆ ధనాన్ని దాచుకున్నాడు. తర్వాత ఆ పైకంతో సుమారు 84 ఎకరాల భూమిని కొన్నాడు.[3]

ఒకసారి శిరిడీలోని రైతులందరూ తమ పొలాలలో చెరుకు పంట వేస్తూ ఉన్నారు . తానూ కూడా చెరుకు పంట వేయాలని తలచాడు పాటిల్ . కానీ బాబా వద్దన్నారు . ఆయన ఆజ్ఞను పాటించి అతడు చెరుకు పండించలేదు . కానీ ఒక సంవత్సరం మాత్రం బాబా మాట వినకుండా చెరుకు పంట వేశాడు . అతడికి తీవ్రమైన నష్టమొచ్చింది . బాబా ఆజ్ఞను పాటిస్తే భక్తులకు మేలు జరుగుతుందని పాటిల్ గ్రహించాడు .

బయ్యాజీ పాటిల్ బాబాకు పాదసేవ చేసుకుంటూ ఉండేవాడు . అతనికి చాలా బలం . ఎన్నోసార్లు అతడు బాబాను తన చేతులతో ఎత్తుకుని ధుని దగ్గర దించేవాడు. క్రమంగా అతడు తానెంతో బలవంతుడినని గర్వించసాగాడు. ఒకరోజు సాటివారితో, "నాకు భీముడంత బలం నాకు బలంలో ఎవరూ సాటిరారు" అని గర్వంగా చెప్పాడు . ఆ రోజు కూడా బాబాను తన చేతులతో ఎత్తడానికి ప్రయత్నించాడు . కానీ ఎంత ప్రయత్నించినా బాబాను లేపలేకపోయాడు. బాబా అతడిని చూసి నవ్వారు . బయ్యాజీ తన తప్పు తెలుసుకున్నాడు . అలా అతని గర్వాన్ని తొలగించారు బాబా.

1913 లో బయ్యజీ పాటిల్ తండ్రి మరణించాడు. ఆయనకు 70 సం. లు. బాబా బయ్యాజీ పాటిల్ తో, "నీ తండ్రి ఐదు నెలలలో మళ్ళీ వస్తాడు. నువ్వు బాధపడడమెందుకు?" అన్నారు. బాబా చెప్పినట్లే బయ్యాజీ పాటిల్ కు ఒక కుమారుడు జన్మించాడు. బాబా అలా తమ భక్తుల నిత్యజీవితంలోని కష్టాలను, కోరికలను తీర్చడమే గాక వారికి తమ సేవ, సాన్నిధ్యమూ యిచ్చి ఉద్ధరిస్తారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]