బయ్యారం మండలం (మహబూబాబాద్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బయ్యారం
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, బయ్యారం స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, బయ్యారం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°40′13″N 80°09′46″E / 17.670194°N 80.162888°E / 17.670194; 80.162888
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబాబాదు జిల్లా
మండల కేంద్రం బయ్యారం (మహబూబాబాద్ జిల్లా)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 309 km² (119.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 42,587
 - పురుషులు 21,275
 - స్త్రీలు 21,312
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.09%
 - పురుషులు 56.75%
 - స్త్రీలు 35.12%
పిన్‌కోడ్ 507211

బయ్యారం మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం బయ్యారం.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల  జనాభా 42,587, పురుషులు 21,275, స్త్రీలు 21,312

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 309 చ.కి.మీ. కాగా, జనాభా 42,587. జనాభాలో పురుషులు 21,275 కాగా, స్త్రీల సంఖ్య 21,312. మండలంలో 11,779 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి మహబూబాబాద్ జిల్లాకు మార్పు[మార్చు]

లోగడ బయ్యారం మండలం ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బయ్యారం మండలాన్ని వరంగల్ జిల్లా పరిధిలో కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి ఈ (బయ్యారం) మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. గరిమెళ్ల
  2. మోట్ల తిమ్మాపురం
  3. జగత్రావుపేట
  4. వెంకటాపురం
  5. కొమ్మవరం
  6. కంబాలపల్లి
  7. కాచనపల్లి
  8. లింగగిరి 
  9. ఇర్సులాపురం
  10. రామచంద్రపురం
  11. గౌరారం
  12. ఉప్పలపాడు
  13. బయ్యారం
  14. సింగారం
  15. గంధంపల్లి
  16. కొత్తపేట
  17. ధర్మపురం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]