బయ్యారం మైన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బయ్యారం మైన్స్
ప్రదేశం
రాష్ట్రంతెలంగాణ
దేశంభారతదేశం
Production
ఉత్పత్తులుఇనుప ఖనిజం

బయ్యారం మైన్స్, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గూడూరు మండలాల్లో ఉన్న ఇనుప ఖనిజం గనులు.[1]

గనులు

[మార్చు]

బయ్యారం, గూడూరు, గార్ల (మహబూబాబాద్ జిల్లా), నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) మండలాల్లో 5,342 హెక్టార్లలో[2] ఈ ఇనుప ఖనిజం గనులు విస్తరించి ఉన్నాయి.[3] ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అంచనా ప్రకారం ఈ ఖనిజం విలువ రూ. 16 లక్షల కోట్లు.[4] [5]

చరిత్ర

[మార్చు]

2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 63 ఎకరాల బయ్యారం గనుల లీజులను స్థానిక గిరిజనులకు అప్పగించబడింది.[6] కానీ అప్పుడు ఎలాంటి తవ్వకాలూ జరగలేదు. 2004 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ లీజులను రద్దుచేసి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ (ఎపీఎండీసీ)తోపాటు రక్షణ ప్రైవేట్ సంస్థతో జాయింట్ వెంచ్‌ర్‌తో బయ్యారం గనుల తవ్వకాలకు జీవోలు ద్వారా అనుమతులు ఇచ్చారు.[7] అప్పుడు కూడా పనులు జరగలేదు. ఆ తరువాత కె. రోశయ్య అధికారం చేపట్టినప్పటికీ బయ్యారంపై ఇచ్చిన జీవోలు రద్దుచేయలేదు, కొత్త ఉత్తర్వులు ఇవ్వలేదు. నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి బయ్యారం గనులపై ఇచ్చిన జీవోలను రద్దుచేసి, గనుల నుంచి ఇనుప ఖనిజంను విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు సరఫరా చేయాలని జీవో జారీ చేశాడు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై 2009లో 69 జీఓ, 2010లో మరో జీఓ ఇవ్వబడగా, ప్రైవేటుకు అప్పగించేందుకు రాష్ట్రం తరఫున ఒప్పుకోకపోవడంతో ఆ జీఓలు రద్దు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ పున‌ర్ వ్యవ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం-2014లో పేర్కొన్న ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సినవసరం ఉంది.[8]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు 2014 మే నెలలో కేంద్రబృందం వచ్చి బయ్యారం ప్రాంతాన్ని పరిశీలించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యలో నిర్మించతలపెట్టిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముడి ఇనుము నిక్షేపాల అన్వేషణ చేయాలని 2015 డిసెంబరులో తెలంగాణ ప్రభుత్వం జీవో జారీచేసింది.

బయ్యారంలో ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావుల పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి, 180 కిలోమీటర్ల స్వల్పదూరంలో ఉన్న ఛత్తీస్‌ ఘడ్‌లోని భైలాడిల్లలో గనులు కేటాయిస్తే, రవాణ ఏర్పాటుకు అవసరమయ్యే వ్యయాన్ని పంచుకుంనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.[9]

వైసిపి కేటాయింపు వివాదం

[మార్చు]

ఇనుప ఖనిజాన్ని ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ (విఎస్‌పి)కి కేటాయించడంతో కొత్త వివాదం ప్రారంభమైంది.[10] తెలంగాణ అనుకూల పార్టీలు, కాంగ్రెస్ నాయకులు ఒక ప్రాంతంలోని వనరులను మరొక ప్రాంతంలో ఉన్న ఉత్పాదక కేంద్రానికి కేటాయించడాన్ని అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.[11] దశాబ్దాల క్రితం ఆంధ్ర ప్రాంతంలో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదం ఉండేది, ఇప్పుడు తెలంగాణలో బయ్యారం ఉక్కు, తెలంగాణ హక్కు (బయ్యారం ఇనుము, తెలంగాణా ప్రజల హక్కు) గా మారింది.[12]

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 2013-04-20. Retrieved 2022-06-30.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Andhra Pradesh allots captive iron ore mines to Vizag Steel". timesofindia-economictimes.
  3. "Archive News". The Hindu. 2010-08-27. Archived from the original on 2010-08-31.
  4. Special Correspondent (12 June 2012). "Decision on Bayyaram mines hailed". The Hindu.
  5. "TDP, CPI, TRS, BJP welcome Bayyaram nine lease cancellation | Siasat". www.siasat.com. Archived from the original on 2015-01-09.
  6. "YSR Son In Law Has No Link With Bayyaram Mines: PCC | Siasat". www.siasat.com. Archived from the original on 2015-01-09.
  7. "Andhra govt cancels Bayyaram mining lease". The Times of India. Archived from the original on 2013-06-29.
  8. "బ‌య్యారం ఉక్కు తెలంగాణ హక్కు.. విభ‌జ‌న చ‌ట్టంలో హామీ ఇచ్చారు, ఇవ్వాల్సిందే: టీఆర్ఎస్". Prabha News. 2022-02-22. Archived from the original on 2022-03-06. Retrieved 2022-06-30.
  9. "బయ్యారం ఉక్కు రాష్ట్రం హక్కు కాదా?". EENADU. 2022-02-21. Archived from the original on 2022-03-27. Retrieved 2022-06-30.
  10. Special Correspondent (19 April 2013). "CPI, TRS oppose diversion of Bayyaram iron ore to RINL". The Hindu.
  11. "Archived copy". Archived from the original on 2013-04-20. Retrieved 2022-06-30.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  12. "Bayyaram ukku, Telangana hakku: Harish". The New Indian Express. Archived from the original on 2016-06-01. Retrieved 2022-06-30.