Jump to content

బర్ఖా శుక్లా సింగ్

వికీపీడియా నుండి
బర్ఖా శుక్లా సింగ్

ముందు అశోక్ సింగ్
తరువాత అనిల్ కుమార్ శర్మ
నియోజకవర్గం ఆర్.కె. పురం

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
నివాసం ఢిల్లీ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాలు

బర్ఖా శుక్లా సింగ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఢిల్లీ శాసనసభకు ఆర్.కె. పురం శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

బర్ఖా శుక్లా సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2003 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆర్.కె. పురం శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ పై 5,585 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1] ఆమె 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాధే శ్యామ్ శర్మపై 9,317 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2]

బర్ఖా సింగ్ 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆర్.కె. పురం శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 5,585 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.[3][4] ఆమె ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ యూనిట్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితురాలైంది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో 2017 ఏప్రిల్ 21న కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. బర్ఖా సింగ్ ఏప్రిల్ 22న బిజెపి ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, క్రీడా మంత్రి విజయ్ గోయెల్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Delhi Assembly Election Results 2003". Election Commission of India. Retrieved 15 December 2024.
  2. "Delhi Assembly Election Results 2008". Election Commission of India. Retrieved 15 December 2024.
  3. "Delhi Assembly Election Results 2013". Election Commission of India. Retrieved 15 December 2024.
  4. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  5. "Former Congress leader Barkha Singh Shukla joins BJP". The Economic Times. 22 April 2017. Archived from the original on 24 February 2025. Retrieved 24 February 2025.
  6. "Expelled from Congress, Barkha Singh joins BJP a day ahead of MCD election". Hindustan Times. 22 April 2017. Archived from the original on 22 April 2017. Retrieved 24 February 2025.