బర్ఖ్ కడపవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బర్ఖ్ కడపవి : (జననం- , మరణం 19 మే 2005) అసలు పేరు షేఖ్ ఖాదర్ బాషా, కలం పేరు బర్ఖ్, కడపకు చెందినవారు కాబట్టి కడపవి. ఆంధ్రప్రదేశ్ కు చెందినా ప్రముఖ ఉర్దూ కవి. ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ పండితునిగా సేవలందించారు. బర్ఖ్ హజ్రత్ గా ప్రసిద్ధి. ఉర్దూ కవిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇతని కవితలు ప్రభుత్వ పాఠ్యాంశాలలోనూ స్థానం పొందాయి. మంచి గొంతునుకూడా పొందిన బర్ఖ్ సాహెబ్ ఉర్దూ సాహితీ రంగంలో కడపకు ఖ్యాతి తెచ్చి పెట్టారు.

రచనలు[మార్చు]

  • తొహఫయే నాట్ (హమ్ద్నాత్) - Tohfa-e-Naat (Hamd-O-Naat)
  • నూర్ - ఒ - నగ్మా (హమ్ద్నాత్) - Noor-O-Nagma (Hamd-O-Naat)
  • కష్కోల్ -ఎ - రహ్మత్ (హమ్ద్నాత్) - Kaskool-e-Rehmath (Hamd-O-Naat)
  • తజల్లి - ఎ - బర్ఖ్ (మెరుపుల కాంతి) - గజళ్ళు - Tajali-e-Barq (Ghazals)
  • దిల్ కే జక్మ్ (హృదయ గాయాలు) - గజళ్ళు - Dil Kay Zakham (Ghazals)
  • లెహర్ లెహర్ గీత్ (అలలపై గీతాలు) నజమ్, గీతాలు - Lehar Lehar Geet (Nazams and Geets)
  • అందాజ్ - ఎ - బర్ఖ్ (హమ్ద్నాత్ ఒ గజల్) - Andaaz-e-Barq (Hamd-O-Naat-O-Ghazal)

అవార్డులు[మార్చు]

  • రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు
  • ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు (రెండు సార్లు)

మూలాలు[మార్చు]