Jump to content

బర్గెన్

అక్షాంశ రేఖాంశాలు: 60°23′22″N 5°19′48″E / 60.38944°N 5.33000°E / 60.38944; 5.33000
వికీపీడియా నుండి
బర్గెన్
నగరం, మునిసిపాలిటీ
Flag of బర్గెన్
Coat of arms of బర్గెన్
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Vestland" does not exist.
Coordinates: 60°23′22″N 5°19′48″E / 60.38944°N 5.33000°E / 60.38944; 5.33000
దేశం Norway
ప్రాంతంపశ్చిమ నార్వే
కౌంటీవెస్ట్‌లాండ్
జిల్లామిడ్‌హోర్డ్‌లాండ్
మునిసిపాలిటీబెర్గెన్
స్థాపన1070 కి ముందు
విస్తీర్ణం
 • నగరం, మునిసిపాలిటీ
464.71 కి.మీ2 (179.43 చ. మై)
 • నేల444.99 కి.మీ2 (171.81 చ. మై)
 • Water19.72 కి.మీ2 (7.61 చ. మై)  4.2%
 • పట్టణపు
94.03 కి.మీ2 (36.31 చ. మై)
 • Metro
2,755 కి.మీ2 (1,064 చ. మై)
Highest elevation
987 మీ (3,238 అ.)
Lowest elevation
0 మీ (0 అ.)
జనాభా
 (2024 జనవరి 1)
 • నగరం, మునిసిపాలిటీ
2,91,940
 • సాంద్రత630/కి.మీ2 (1,600/చ. మై.)
 • Metro
4,69,238
 • Metro density170/కి.మీ2 (440/చ. మై.)
DemonymBergenser/Bergensar
GDP
 • City and municipality€36.569 billion (2021)
Postal code
5003–5268 (P.O.box 5802–5899)
Area code(+47) 5556

బర్గెన్, నార్వే పశ్చిమ తీరంలో వెస్ట్‌ల్యాండ్ కౌంటీలోని నగరం, మునిసిపాలిటీ. 2022 నాటికి దాని జనాభా దాదాపు 2,89,330. [2] రాజధాని ఓస్లో తర్వాత బర్గెన్ నార్వేలో రెండవ అతిపెద్ద నగరం. ఈ మునిసిపాలిటీ విస్తీర్ణం 465 చదరపు కిలోమీటర్లు (180 చ. మై.). ఇది బర్గెన్‌షాల్వోయెన్ ద్వీపకల్పంలో ఉంది. నగర కేంద్రం, ఉత్తర పొరుగు ప్రాంతాలు 'సిటీ ఫ్యోర్డ్' అయిన బైఫ్‌జోర్డెన్‌లో ఉన్నాయి. ఈ నగరం చుట్టూ పర్వతాలు ఉండడంతో బర్గెన్‌ను "ఏడు పర్వతాల నగరం" అంటారు. అనేక అదనపు మునిసిపల్ శివారు ప్రాంతాలు ద్వీపాలలో ఉన్నాయి. బర్గెన్ వెస్ట్‌ల్యాండ్ కౌంటీకి పరిపాలనా కేంద్రం. ఈ నగరంలో ఎనిమిది బారోగ్‌లున్నాయి. అవి: అర్నా, బర్గెన్‌హస్, ఫనా, ఫిల్లింగ్స్‌డాలెన్, లక్సేవాగ్, ఇట్రెబిగ్డా, అర్స్టాడ్, అసానే .

బర్గెన్‌లో 1020 ల నాటికే వ్యాపారం ప్రారంభమై ఉండవచ్చు. సంప్రదాయం ప్రకారం, ఈ నగరాన్ని 1070 లో రాజు ఒలావ్ కైర్ స్థాపించాడు. దీనికి జోర్గ్‌విన్ (అంటే 'పర్వతాల మధ్య పచ్చని గడ్డి మైదానం') అని పేరు పెట్టారు. 13వ శతాబ్దంలో ఇది నార్వేకు రాజధానిగా ఉండేది. 13వ శతాబ్దం చివరి నుండి హాన్సియాటిక్ లీగ్‌లో బ్యూరో నగరంగా మారింది. 1789 వరకు బర్గెన్ ఉత్తర నార్వే, విదేశాల మధ్య వాణిజ్యానికి మధ్యవర్తిత్వం వహించే ప్రత్యేక హక్కులను అనుభవించింది. 1830 ల వరకు రాజధాని క్రిస్టియానియా (ఇదే ఇప్పటి ఓస్లో) దానిని అధిగమించే వరకు ఇది నార్వేలో అతిపెద్ద నగరంగా ఉంది. రేవుల్లో మిగిలి ఉన్న బ్రైగెన్ ఇప్పుడు ప్రపంచ వారసత్వ ప్రదేశం.

ఆ నగరం చరిత్రలో అనేక అగ్నిప్రమాదాలకు గురైంది. బర్గెన్ స్కూల్ ఆఫ్ మెటియోరాలజీ 1917 లో జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్‌లో నెలకొల్పారు. నార్వేజియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 1936 లోను, బర్గెన్ విశ్వవిద్యాలయాన్ని 1946 లోనూ స్థాపించారు. 1831 నుండి 1972 వరకు, బర్గెన్ స్వయంగా ఒక కౌంటీగా ఉండేది. 1972లో మునిసిపాలిటీ చుట్టుపక్కల ఉన్న నాలుగు మునిసిపాలిటీలను విలీనం చేసుకుని హోర్డాలాండ్ కౌంటీలో భాగమైంది.

ఈ నగరం ఆక్వాకల్చర్, షిప్పింగ్, ఆఫ్‌షోర్ పెట్రోలియం పరిశ్రమ, సబ్‌సీ టెక్నాలజీకి అంతర్జాతీయ కేంద్రం. ఉన్నత విద్య, మీడియా, పర్యాటకం, ఆర్థిక రంగానికి జాతీయ కేంద్రం. బర్గెన్ ఓడరేవు నార్వేలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. సరుకు రవాణా, ప్రయాణీకుల పరంగా ఇది అత్యంత రద్దీగా ఉంటుంది. సంవత్సరానికి 300 కి పైగా క్రూయిజ్ నౌకల్లో దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు బర్గెన్‌కు వస్తారు.[3] ఈ సంఖ్య 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది.[4] ప్రయాణీకులలో దాదాపు సగం మంది జర్మన్ లేదా బ్రిటిష్ వారు.[4]

నగరం లోని ప్రధాన ఫుట్‌బాల్ జట్టు SK బ్రాన్. స్థానికులు బర్గెన్స్క్ అని పేరున్న ఒక ప్రత్యేకమైన మాండలికాన్ని మాట్లాడతారు. ఈ నగరంలో బర్గెన్ విమానాశ్రయం, ఫ్లెస్లాండ్, బర్గెన్ లైట్ రైల్ ఉన్నాయి. ఇది బర్గెన్ లైన్ కు టెర్మినస్. నాలుగు పెద్ద వంతెనలు బర్గెన్‌ను దాని శివారు మునిసిపాలిటీలకు కలుపుతాయి.

బర్గెన్‌లో తేలికపాటి శీతాకాల వాతావరణం ఉంటుంది, అయితే గణనీయమైన అవపాతం ఉంటుంది. డిసెంబరు నుండి మార్చి వరకు, బర్గెన్ అరుదైన సందర్భాల్లో, ఓస్లో కంటే 20 °C (36 °F) వెచ్చగా ఉంటుంది. రెండు నగరాలు దాదాపు 60° ఉత్తరాన ఉన్నప్పటికీ, ఓస్లో కంటే బర్గెన్ వెచ్చగా ఉంటుంది. అయితే, వేసవిలో, బర్గెన్ అదే సముద్ర ప్రభావాల కారణంగా ఓస్లో కంటే చాలా డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అక్షాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే గల్ఫ్ ప్రవాహం సముద్రాన్ని సాపేక్షంగా వెచ్చగా ఉంచుతుంది. పర్వతాలు ఉత్తరం, ఈశాన్య, తూర్పు నుండి వీచే చల్లని గాలుల నుండి నగరాన్ని రక్షిస్తాయి.

చరిత్ర

[మార్చు]
బర్గెన్ గురించి హిరోనిమస్ స్కోలియస్ అభిప్రాయం. డ్రాయింగ్ సుమారు 1580 నాటిది. అనేక నగరాల డ్రాయింగ్‌లతో అట్లాస్‌లో ప్రచురించబడింది.[5]

స్టాంఫోర్డ్ బ్రిడ్జి యుద్ధంతో ఇంగ్లాండ్‌లో వైకింగ్ యుగం ముగిసిన నాలుగు సంవత్సరాల తర్వాత, 1070 లో హరాల్డ్ హార్డ్రేడ్ కుమారుడు రాజు ఓలావ్ కిర్రే బర్గెన్ నగరాన్ని స్థాపించాడని భావిస్తారు.[6] అయితే, ఆధునిక పరిశోధనల్లో 1020 లు లేదా 1030 లలో అప్పటికే ఒక వాణిజ్య ఒప్పందం ఏర్పడిందని తేలింది.[7]

13వ శతాబ్దం ప్రారంభంలో బర్గెన్ నార్వే రాజధానిగా బాధ్యతలు చేపట్టింది. ప్రాథమిక కేంద్ర పరిపాలన స్థాపించబడిన మొదటి నగరంగా ఇది నిలిచింది. నగరం లోని కేథడ్రల్ 1150 లలో నార్వేలో మొట్టమొదటి రాజ పట్టాభిషేక ప్రదేశం. 13వ శతాబ్దం అంతటా రాజ పట్టాభిషేకాలు ఇక్కడే జరిగాయి. బర్గెన్‌హస్ కోట 1240 ల నాటిది. ఇది బర్గెన్‌లోని నౌకాశ్రయానికి ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా ఉన్నట్టు ఉంటుంది. కింగ్ హాకోన్ V (1299–1319) పాలనలో రాజధాని నగరం ఓస్లోకు మారింది.

14వ శతాబ్దం మధ్యలో, 13వ శతాబ్దం నుండి గణనీయమైన సంఖ్యలో ఉన్న ఉత్తర జర్మన్ వ్యాపారులు, హాన్సియాటిక్ లీగ్‌ కు చెందిన నాలుగు వాణిజ్య స్థావరాల్లో ఒకదాన్ని బర్గెన్‌లోని బ్రైగెన్‌లో స్థాపించారు. బర్గెన్ నుండి ఎగుమతి అయిన ప్రధాన వస్తువు ఉత్తర నార్వేజియన్ తీరం నుండి వచ్చే ఎండిన కాడ్ చేప.[8] ఇది సుమారు 1100 లో మొదలైంది. రాజు హకోన్ హకోన్సన్ (1217–1263), ఉత్తర నార్వే నుండి వాణిజ్యంపై ఈ నగరానికి గుత్తాధిపత్యాన్ని మంజూరు చేశాడు.[9] ఈ నగరం ఉత్తర ఐరోపాలో అతిపెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా మారడానికి స్టాక్ ఫిష్ ప్రధాన కారణం.[9] 14 వ శతాబ్దం చివరి నాటికి బర్గెన్, నార్వేలో వాణిజ్య కేంద్రంగా స్థిరపడింది. హాన్సియాటిక్ వ్యాపారులు పట్టణంలోని వారి స్వంత ప్రత్యేక భాగంలో నివసించేవారు. వారక్కడ మిడిల్ లో జర్మన్ భాషను వాడేవారు. ప్రతి వేసవిలోను బర్గెన్‌కు వచ్చే ఉత్తరాది జాలర్లతో వ్యాపారం చేయడానికి వారు ప్రత్యేక హక్కులను పొందారు.[10] బర్గెన్‌లో స్థిరపడిన స్కాటిష్ వ్యాపారులపై హన్సా సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. 1523 నవంబరు 9 న జర్మన్ నివాసులు అనేక స్కాటిష్ గృహాలను లక్ష్యంగా చేసుకున్నారు.[11] నేడు, బర్గెన్ యొక్క పాత క్వేసైడ్, బ్రైగెన్, యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. [12]

19వ శతాబ్దం చివరిలో బర్గెన్ చారిత్రిక ఫోటోక్రోమ్. దిగువ ఎడమ మూలలో బర్గెన్ కేథడ్రల్ (డోమ్‌కిర్కెన్), మధ్యలో హోలీ క్రాస్ చర్చి, అనేక పడవలతో కూడిన బే (వాగెన్), వాగెన్ ప్రారంభానికి కుడి వైపున బర్గెన్‌హస్ కోట వగైరాలను చూడవచ్చు.

1349 లో బర్గెన్‌కు చేరుకున్న ఇంగ్లీష్ ఓడ ద్వారా బ్లాక్ డెత్‌ వ్యాధి నార్వేకు వచ్చింది.[13] తరువాత 1618, 1629, 1637 లలో ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ప్రతి సందర్భంలోనూ దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు.[14] 15 వ శతాబ్దంలో, నగరంపై విక్చువల్ బ్రదర్స్ అనేకసార్లు దాడి చేశారు.[15] 1429 లో వారు రాజ కోటను, నగరంలోని చాలా భాగాన్ని తగలబెట్టారు. 1665 లో నగరం లోని నౌకాశ్రయం వద్ద వాగెన్ యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఒక ఆంగ్ల నావికా దళం నగరం లోని దండు మద్దతుతో, డచ్ వ్యాపారి పైన, అతని ఖజానా నౌకపైనా దాడి చేసింది. ప్రమాదవశాత్తు మంటలు కొన్నిసార్లు అదుపు తప్పేవి. 1702 లో జరిగిన అలాంటి ఒక సంఘటనలో పట్టణంలోని చాలా భాగం బూడిదైంది.[16]

15 వ, 16వ శతాబ్దాలలో, బర్గెన్ స్కాండినేవియాలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా నిలిచింది. 1830 ల వరకు ఇది నార్వేలో అతిపెద్ద నగరంగా ఉండేది.[17] దీనిని రాజధాని నగరం ఓస్లో అధిగమించింది. 1600 నుండి నగర వాణిజ్యంలో హాన్సియాటిక్ ఆధిపత్యం క్రమంగా తగ్గి, నార్వేజియన్ వ్యాపారులు (తరచుగా హాన్సియాటిక్ వంశానికి చెందినవారు) పుంజుకున్నారు. 1750 లలో హాన్సియాటిక్ లీగ్ కు చెందిన ప్రధాన వాణిజ్య స్థావరాన్ని చివరకు మూసివేసారు. 17వ,18వ శతాబ్దాలలో బర్గెన్, అట్లాంటిక్ బానిస వ్యాపారంలో భాగమైంది. నార్వేలో అతిపెద్ద ఓడ యజమాని అయిన బర్గెన్‌కు చెందిన బానిస వ్యాపారి జోర్గెన్ థోర్మోహ్లెన్, బానిస ఓడ కార్నెలియాకు యజమాని. ఇది 1673, 1674లో రెండు బానిస-వాణిజ్య ప్రయాణాలు చేసింది. అతను నగరంలో పారిశ్రామిక రంగాన్ని కూడా అభివృద్ధి చేశాడు -ముఖ్యంగా అతని పేరు పెట్టబడిన మోహ్లెన్‌ప్రిస్ పరిసరాల్లో. బర్గెన్ 1789 వరకు ఉత్తర నార్వే వాణిజ్యంలో తన గుత్తాధిపత్యాన్ని నిలుపుకుంది. [18] 1813 లో బర్గెన్ స్టాక్ ఎక్స్ఛేంజిని స్థాపించారు.

ఆధునిక చరిత్ర

[మార్చు]
1909 లో బర్గెన్
1909 లో బర్గెన్

1831లో బర్గెన్ హోర్డాలాండ్ నుండి విడిపోయి దాని స్వంత కౌంటీగా ఏర్పడింది. [19] ఇది 1838 జనవరి 1 న మునిసిపాలిటీ హోదా అందుకుంది. బర్గెన్ గ్రామీణ మునిసిపాలిటీని 1877 జనవరి 1 న బర్గెన్‌తో విలీనం చేసారు. 1915 జూలై 1 నఆర్స్టాడ్ గ్రామీణ మునిసిపాలిటీని బర్గెన్‌తో విలీనం చేసారు.[20]

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జర్మన్ నౌకలకు, నార్వేజియన్ తీరప్రాంత ఫిరంగిదళాలకూ మధ్య జరిగిన పోరాటం తర్వాత, 1940 ఏప్రిల్ 9 న జర్మన్ దండయాత్ర మొదలైన రోజున బర్గెన్‌ను జర్మన్లు ఆక్రమించుకున్నారు. సబోర్గ్, మిలోర్గ్, తీటా గ్రుప్పెన్, సివోర్గ్, స్టైన్ ఆర్గనైజాసోనెన్, కమ్యూనిస్ట్ పార్టీలు బర్గెన్‌లోని నార్వేజియన్ నిరోధక ఉద్యమ సమూహాలు.[21] 1944 ఏప్రిల్ 20 న జర్మన్ ఆక్రమణ సమయంలో, డచ్ కార్గో షిప్ వూర్‌బోడ్ 120 టన్నులకు పైగా పేలుడు పదార్థాలతో నిండిన బర్గెన్‌హస్ కోట దగ్గర లంగరు వేసి ఉండగా, పేలిపోయి, కనీసం 150 మంది మృతి చెందారు. చారిత్రిక భవనాలు దెబ్బతిన్నాయి. నౌకాశ్రయంలోని జర్మన్ నావికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, నగరం కొన్ని మిత్రరాజ్యాల బాంబు దాడులకు గురైంది. వీటిలో కొన్ని నార్వేజియన్ పౌరుల మరణాలకు కారణమయ్యాయి, వీరి సంఖ్య దాదాపు 100.

బర్గెన్ ఇస్డాల్ మహిళకి కూడా ప్రసిద్ధి చెందింది. 1970 నవంబరు 29 న ఇస్డాలెన్ ("ఐస్ వ్యాలీ") వద్ద అనుమానస్పదంగా చనిపోయి కనిపించిన మహిళ ఆమె.[22] ఈ పరిష్కారం కాని కేసు కొన్ని సంవత్సరాల పాటు అంతర్జాతీయంగా ఊహాగానాలు రేకెత్తించింది. ఇది ఇటీవలి నార్వేజియన్ చరిత్రలో అత్యంత లోతైన రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.[23][24]

ఆర్నా, ఫానా, లక్సేవాగ్, అసానే గ్రామీణ మునిసిపాలిటీలు 1971 జనవరి 1 న బర్గెన్‌తో విలీనమయ్యాయి. అదే తేదీన ఆ నగరం ప్రత్యేక కౌంటీ హోదాను కోల్పోయి,[25] వెస్ట్‌ల్యాండ్ కౌంటీలో ఒక మునిసిపాలిటీగా మారింది.

మంటలు

[మార్చు]

ఈ నగర చరిత్రలో అనేక పెద్ద అగ్నిప్రమాదాలు జరిగాయి. 1198 లో అంతర్యుద్ధంలో భాగంగా బాగ్లర్ వర్గం, బిర్కెబీనర్‌తో జరిగిన యుద్ధంలో భాగంగా నగరానికి నిప్పంటించింది. 1248లో, హోల్మెన్‌, స్వెర్రెస్‌బర్గ్‌లు దహనం కాగా, 11 చర్చిలు ధ్వంసమయ్యాయి. 1413 లో నగరంలో మరో అగ్నిప్రమాదం సంభవించి, 14 చర్చిలు ధ్వంసమయ్యాయి. 1428 లో నగరాన్ని విక్చువల్ బ్రదర్స్ దోచుకున్నారు. 1455లో హాన్సియాటిక్ వ్యాపారులు ముంకెలివ్ అబ్బేను తగలబెట్టారు. 1476 లో ఒక తప్పతాగిన వ్యాపారి పెట్టిన మంటలో బ్రిగ్గెన్ కాలిపోయింది. 1582 లో నగర కేంద్రం, స్ట్రాండ్‌సైడెన్‌లు తగలబడ్డాయి. 1675లో, ఓవ్రెగటెన్‌లో 105 భవనాలు కాలిపోయాయి. 1686లో స్ట్రాండ్‌సైడెన్‌లో మరో పెద్ద అగ్నిప్రమాదం సంభవించి, 231 నగర బ్లాక్‌లు, 218 బోట్‌హౌస్‌లను నాశనమయ్యాయి.

చరిత్రలో అతిపెద్ద అగ్నిప్రమాదం 1702 లో జరిగింది, ఆ సమయంలో నగరం 90% బూడిదైపోయింది. 1751 లో వాగ్స్‌బన్నెన్‌లో గొప్ప అగ్నిప్రమాదం జరిగింది. 1756 లో స్ట్రాండ్‌సైడెన్‌లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. 1,500 భవనాలు కాలిపోయాయి. 1771, 1901 లలో స్ట్రాండ్‌సైడెన్‌ మళ్ళీ తగలబడింది. 1916లో, నగర కేంద్రంలో 300 భవనాలు కాలిపోగా, వాటిలో నార్వేలోని పురాతన ఫార్మసీ అయిన స్వాన్ ఫార్మసీ కూడా ఉంది. 1955లో బ్రిగ్గెన్ లోని కొన్ని భాగాలు కాలిపోయాయి.

Office buildings in Bergen

జనాభా

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
176918,827—    
180124,136+28.2%
181523,123−4.2%
182528,195+21.9%
183531,525+11.8%
184533,145+5.1%
185537,015+11.7%
186542,994+16.2%
187554,436+26.6%
189072,879+33.9%
190094,485+29.6%
19101,04,224+10.3%
19201,18,490+13.7%
19301,29,118+9.0%
19461,53,446+18.8%
19501,62,381+5.8%
19601,85,822+14.4%
19702,09,066+12.5%
19802,07,674−0.7%
19902,12,944+2.5%
20012,32,989+9.4%
20112,60,392+11.8%
20212,85,601+9.7%

2022 నాటికి, మునిసిపాలిటీ జనాభా 2,86,930.[26] జనసాంద్రత చకిమీ కి 599 మంది. స్టాటిస్టిక్స్ నార్వే నిర్వచించిన విధంగా నగర పరిమితికి వెలుపల ఉన్న పట్టణ ప్రాంతాలు: ఇంద్రే అర్నా (2012 జనవరి 1 నాటికి 6,536 మంది), ఫనాహమ్మెరెన్ (3,690), య్ట్రే అర్నా (2,626), హైల్క్జే (2,277), ఎస్పెలాండ్ (2,182).[27]

2007 నాటికి, బర్గెన్ నివాసులలో నార్వేజియన్ మూలానికి చెందినవారు (ఇద్దరు తల్లిదండ్రులిద్దరూ నార్వేలో జన్మించిన వారు) 84.5% ఉన్నారు. అదనంగా, 8.1% మంది పాశ్చాత్య నేపథ్యం నుండి వచ్చిన మొదటి లేదా రెండవ తరం వలసదారులు, 7.4% మంది పాశ్చాత్యేతర నేపథ్యం నుండి వచ్చిన మొదటి లేదా రెండవ తరం వలసదారులు.[28] 2009 లో జనాభా 4,549 పెరిగింది. వృద్ధి రేటు 1.8%. జనాభాలో తొంభై ఆరు శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2002 నాటికి, 17 ఏళ్లు పైబడిన పురుషుల సగటు స్థూల ఆదాయం 4,26,000 నార్వేజియన్ క్రోన్ (NOK). 17 ఏళ్లు పైబడిన మహిళల సగటు స్థూల ఆదాయం NOK. 2,38,000. మొత్తం సగటు స్థూల ఆదాయం NOK 3,30,000.[28] 2007 లో 20–39 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి 100 మంది మహిళలకు 104.6 మంది పురుషులు ఉన్నారు. [28] జనాభాలో 22.8% మంది 17 ఏళ్లలోపు వారు, 4.5% మంది 80 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు.

బర్గెన్‌లోని వలస జనాభాలో (ఇద్దరు విదేశీ-జన్మించిన తల్లిదండ్రులు ఉన్నవారు) 200 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చిన 42,169 మంది వ్యక్తులు ఉన్నారు. నగర జనాభాలో వీరు 15.5% (2014). వీరిలో 50.2% మంది ఐరోపా నుండి, 28.9% మంది ఆసియా నుండి, 13.1% మంది ఆఫ్రికా నుండి, 5.5% మంది లాటిన్ అమెరికా నుండి, 1.9% మంది ఉత్తర అమెరికా నుండి, 0.4% మంది ఓషియానియా నుండి వచ్చినవారు. 1993-2008 కాలంలో బర్గెన్‌లో వలస జనాభా 119.7% పెరిగింది. అదే సమయంలో నార్వేజియన్ జాతి జనాభా 8.1% పెరిగింది. జాతీయ సగటు 138.0%, 4.2%. 1993–2008 మధ్య కాలంలో వలస జనాభా బర్గెన్ జనాభా పెరుగుదలలో 43.6%, నార్వే జనాభా పెరుగుదలలో 60.8% వాటా ఉంది, ఓస్లోలో ఇది 84.5%గా ఉంది.[29]

2022 నాటికి, పాశ్చాత్యేతర మూలానికి చెందిన వలసదారులు, వారి పిల్లలు 30,540 మంది ఉన్నారు. బర్గెన్ జనాభాలో వారు 11% మంది ఉంటారని అంచనా వేసారు. పాశ్చాత్య మూలానికి చెందిన వలసదారులు, వారి పిల్లలూ 22,954 మంది ఉన్నారు. ఇది బర్గెన్ జనాభాలో 9%.[30][31]

విద్య

[మార్చు]
2018లో బర్గెన్ విశ్వవిద్యాలయపు పురుష గాయక బృందం
బర్గెన్ విశ్వవిద్యాలయ మ్యూజియం

బర్గెన్‌లో 64 ప్రాథమిక పాఠశాలలు, [32] 18 లోయర్ సెకండరీ పాఠశాలలు,[33] 20 అప్పర్ సెకండరీ పాఠశాలలు[34] ఉన్నాయి. అలాగే 11 సంయుక్త ప్రాథమిక, దిగువ మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి.[35] బర్గెన్ కేథడ్రల్ స్కూల్ బర్గెన్‌లోని పురాతన పాఠశాల. దీనిని 1153 లో పోప్ అడ్రియన్ IV స్థాపించాడు.[36]

" బర్గెన్ స్కూల్ ఆఫ్ మెటియోరాలజీ"ని 1917 లో జియోఫిజికల్ ఇన్స్టిట్యూట్‌లో నెలకొల్పారు. నార్వేజియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 1936 లోను, బర్గెన్ విశ్వవిద్యాలయాన్ని 1946 లోనూ స్థాపించారు.[37]

బర్గెన్ విశ్వవిద్యాలయంలో 16,000 మంది విద్యార్థులు, 3,000 మంది సిబ్బంది ఉన్నారు. ఇది నార్వేలో మూడవ అతిపెద్ద విద్యా సంస్థగా నిలిచింది.[38] బర్గెన్‌లో పరిశోధన 1825 లో బర్గెన్ మ్యూజియంలో జరిగిన కార్యకలాపాలతో మొదలైంది. అయితే ఈ విశ్వవిద్యాలయం 1946 వరకు స్థాపించబడలేదు. ఈ విశ్వవిద్యాలయం విద్యా రంగాలలో విస్తృత శ్రేణి కోర్సులు, పరిశోధనలు ఉన్నాయి. వాతావరణ పరిశోధన, పెట్రోలియం పరిశోధన, మధ్యయుగ అధ్యయనాలలో మూడు జాతీయ శ్రేష్ఠ కేంద్రాలున్నాయి.[39] ప్రధాన క్యాంపస్ నగర కేంద్రంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం వైద్య పరిశోధనలో హౌక్లాండ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రితో సహకరిస్తుంది. ది క్రైస్ట్. మైఖేల్సెన్ ఇన్స్టిట్యూట్ అనేది 1930లో మానవ హక్కులు, అభివృద్ధి సమస్యలపై దృష్టి సారించి స్థాపించబడిన ఒక స్వతంత్ర పరిశోధనా సంస్థ.[40]

క్రోన్‌స్టాడ్‌లో ప్రధాన క్యాంపస్‌ ఉన్న వెస్ట్రన్ నార్వే యూనివర్శిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో 16,000 మంది విద్యార్థులు, 1800 మంది సిబ్బంది ఉన్నారు.[41] ఇది బోధన, ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యపై దృష్టి పెడుతుంది. ఈ కళాశాల 1994 లో విలీనం ద్వారా సృష్టించబడింది; దీని క్యాంపస్‌లు పట్టణం అంతటా విస్తరించి ఉన్నాయి కానీ క్రోన్‌స్టాడ్‌లో కలిసి ఉంటాయి. నార్వేజియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ శాండ్వికెన్ వెలుపల ఉంది. ఇది నార్వేలోని ప్రముఖ వ్యాపార పాఠశాల.[42] ఇక్కడి నుండి ముగ్గురు ఎకానమిక్స్ నోబెల్ బహుమతి గ్రహీతలు వచ్చారు.[43] ఈ పాఠశాలలో 3,000 పైచిలుకు విద్యార్థులు, సుమారు 400 మంది సిబ్బంది ఉన్నారు.[44] ఇతర తృతీయ విద్యా సంస్థలలో బర్గెన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, 300 మంది విద్యార్థులతో నగర కేంద్రంలోని బర్గెన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ది ఆర్ట్స్, [45] లక్సెవాగ్‌లోని నార్వేజియన్ నావల్ అకాడమీ ఉన్నాయి. నార్వేజియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ రీసెర్చ్ 1900 నుండి బర్గెన్‌లో ఉంది. ఇది పర్యావరణ వ్యవస్థలు, ఆక్వాకల్చర్‌కు సంబంధించిన పరిశోధన, సలహాలను అందిస్తుంది. దీనికి 700 మంది సిబ్బంది ఉన్నారు.[46]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
స్ట్రాండ్‌గేటెన్ అనేది బర్గెన్‌లోని ఒక షాపింగ్ స్ట్రీట్.
స్టాక్ ఎక్స్ఛేంజ్. బర్గెన్ బోర్స్ (1813లో స్థాపించబడింది) 1861–1862లో దాని కొత్త భవనాన్ని నిర్మించింది; ఈ భవనం 1967లో అమ్ముడైంది.

2004 ఆగస్టులో టైమ్ మ్యాగజైన్ ఈ నగరాన్ని యూరప్‌లోని 14 "రహస్య రాజధానులలో" ఒకటిగా పేర్కొంది [47] ఇక్కడ బర్గెన్ రాజధాని పాలన సముద్ర వ్యాపారాలు, ఆక్వాకల్చర్, సముద్ర పరిశోధన వంటి కార్యకలాపాలలో గుర్తించబడింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ రీసెర్చ్ (IMR) (ఐరోపాలో రెండవ అతిపెద్ద సముద్ర శాస్త్ర పరిశోధన కేంద్రం) ఇక్కడి మరొక ప్రముఖ సంస్థ. మోవి లెరోయ్ వంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆక్వాకల్చర్ కంపెనీలలో కొన్నిటి ప్రధాన కార్యాలయాలు నగరంలో ఉన్నాయి. బర్గెన్‌లో ఉన్న ఓడల యజమానులు నార్వేజియన్ వ్యాపారి సముదాయంలో గణనీయమైన భాగాన్ని నియంత్రిస్తారు, వీరిలో విల్సన్, ఓడ్ఫ్జెల్, గేర్‌బుల్క్ వంటి ఓడల యజమానులు కూడా ఉన్నారు. నగరంలో ఆర్థిక సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. బ్యాంకులు స్బాంకెన్, స్పేర్‌బ్యాంకెన్ వెస్ట్ ల ప్రధాన కార్యాలయం నగరంలో ఉన్నాయి. నార్వేజియన్ బీమా సంస్థలైన ట్రిగ్, డిఎన్‌బి లివ్స్‌ఫోర్సిక్రింగ్, నార్డియా లివ్ లకు బర్గెన్‌లో ప్రధాన కార్యాలయాలున్నాయి. నార్వేజియన్ హల్ క్లబ్‌తో సహా సముద్ర భీమా సంస్థల గణనీయమైన ఉనికి ఇక్కడ ఉంది. నగరంలో షిప్పింగ్, ఆక్వాకల్చర్‌కు సంబంధించి అనేక బ్యాంకులు పెద్ద కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాలను నిర్వహిస్తున్నాయి.

రాయల్ నార్వేజియన్ నేవీకి (హాకాన్స్‌వెర్న్‌లో) బర్గెన్ ప్రధాన స్థావరం. దాని అంతర్జాతీయ విమానాశ్రయం ఫ్లెస్‌ల్యాండ్ నార్వేజియన్ నార్త్ సీ చమురు, గ్యాస్ పరిశ్రమకు ప్రధాన హెలిపోర్ట్. వేలాది మంది ఆఫ్‌షోర్ కార్మికులు చమురు గ్యాస్ రిగ్‌లు, ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న తమ పని ప్రదేశాలకు ఇక్కడ నుండే ప్రయాణిస్తారు.[48]

పర్యాటకం నగరానికి ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య, సమావేశాల కారణంగా నగరంలోని హోటళ్ళు కొన్నిసార్లు నిండిపోవచ్చు.[49][50] బర్గెన్ పశ్చిమ నార్వే అని పిలువబడే ఈ ప్రాంతానికి అనధికారిక రాజధానిగా గుర్తించబడింది. నార్వే లోని ప్రపంచ ప్రసిద్ధ ఫ్యోర్డ్‌లకు ప్రవేశ ద్వారంగా దీన్ని భావిస్తారు. ఆ కారణంగా ఇది, నార్వేలో అతిపెద్ద క్రూయిజ్ షిప్ పోర్ట్‌ గాను, యూరప్‌లోని అతిపెద్దవాటిలో ఒకటిగానూ మారింది.[51]

బర్గెన్‌లో ఆఫీసు భవనాలు

రవాణా

[మార్చు]
బర్గెన్ విమానాశ్రయం, ఫ్లెస్లాండ్
బైబానెన్

బర్గెన్ విమానాశ్రయం, ఫ్లెస్‌ల్యాండ్, నగర కేంద్రం నుండి 18 కిలోమీటర్లు (11 మై.) దూరంలో ఫ్లెస్‌ల్యాండ్ వద్ద ఉంది.[52] అవినోర్ నిర్వహించే ఈ విమానాశ్రయం 2013 లో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించింది. ఈ విమానాశ్రయం స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్, నార్వేజియన్ ఎయిర్ షటిల్, వైడెరోలకు కేంద్రంగా పనిచేస్తుంది. 20 దేశీయ, 53 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఇక్కడి నుండి నేరుగా విమానాలు ఉన్నాయి.[53]

బర్గెన్ పోర్ట్ అథారిటీ నిర్వహిస్తున్న బర్గెన్ పోర్ట్, నార్వేలో అతిపెద్ద సముద్ర నౌకాశ్రయం.[54] 2011 లో ఈ ఓడరేవు 264 క్రూయిజ్ నౌకలు, 3,50,248 మంది సందర్శకులు వచ్చారు.[55] 2009 లో ఈ ఓడరేవు 5.6 కోట్ల టన్నుల సరుకు రవాణా చేసి, యూరప్‌లో తొమ్మిదవ అత్యంత రద్దీగా ఉండే కార్గో పోర్టుగా నిలిచింది.[56] నగర కేంద్రం నుండి ఓడరేవును తరలించడానికి ప్రణాళికలు ఉన్నాయి, కానీ ఇంకా స్థలాన్ని ఎంచుకోలేదు.[57] ఫ్యోఫ్జోర్డ్ లైన్ డెన్మార్క్‌లోని హిర్ట్‌షాల్స్‌కు క్రూయిజ్ ఫెర్రీ సర్వీస్‌ను నిర్వహిస్తోంది. హర్టిగ్రూటెన్ లు బర్గెన్ దక్షిణ టెర్మినస్. ఇది తీరం వెంబడి కిర్కెనెస్‌కు రోజువారీ నడుస్తుంది.[52] ప్రయాణీకుల కాటమరాన్లు బర్గెన్ నుండి దక్షిణాన లీర్విక్, సన్‌హార్డ్‌ల్యాండ్ వరకూ, ఉత్తరాన సోగ్నెఫ్‌జోర్డ్, నార్డ్‌ఫ్‌జోర్డ్ వరకూ నడుస్తాయి. [58]

బర్గెన్ రైల్వే స్టేషన్

నగర కేంద్రం చుట్టూ ఆటోపాస్ వ్యవస్థను ఉపయోగించి ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ రింగ్ ఉంది. ప్రధాన మోటారు మార్గాలలో నగరం గుండా ఉత్తరం-దక్షిణం వైపు వెళ్ళే E39, తూర్పు వైపు వెళ్ళే E16, పశ్చిమం వైపు వెళ్ళే నేషనల్ రోడ్ 555 ఉన్నాయి. బర్గెన్‌ను పొరుగు మునిసిపాలిటీలకు అనుసంధానించేందుకు నార్డ్‌హోర్డ్‌ల్యాండ్ వంతెన,[59] ఆస్కోయ్ వంతెన,[60] సోట్రా వంతెన,[61] ఓస్టెరోయ్ వంతెనఅనే నాలుగు ప్రధాన వంతెనలు ఉన్నాయి. సముద్రం అడుగున ఉన్న జోరోయ్ సొరంగం బర్గెన్‌ను జోరోయ్ ద్వీపానికి కలుపుతుంది.[62]

బర్గెన్ స్టేషన్, ఓస్లోకు వెళ్ళే 496 కిలోమీటర్లు (308 మై.) బర్గెన్ మార్గానికి టెర్మినస్.[63] వై, ఓస్లోకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను, వోస్‌కు బర్గెన్ కమ్యూటర్ రైలునూ నడుపుతుంది. బర్గెన్, అర్నా స్టేషన్ల మధ్య రైలు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఉల్రికెన్ టన్నెల్ ద్వారా నడుస్తుంది. ఇక్కడ రోడ్డు సొరంగం లేదు, రోడ్డు వాహనాలు అసేన్ లేదా నెస్టున్ ద్వారా ప్రయాణించవలసి వస్తుంది.[64]

Fløybanen అనేది మౌంట్ Fløyen పైకి వెళ్లే ఒక ఫ్యూనిక్యులర్

ట్రామ్, ట్రాలీబస్ ఎలక్ట్రిక్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లు రెండూ ఉన్న యూరప్‌లోని అతి చిన్న నగరాల్లో బర్గెన్ ఒకటి. హోర్డాలాండ్‌లో ప్రజా రవాణాను స్కైస్ నిర్వహిస్తుంది. ఇది బర్గెన్‌లోను, అనేక పొరుగు మునిసిపాలిటీల లోనూ విస్తృతమైన సిటీ బస్సు నెట్‌వర్క్‌ను నడుపుతోంది.[65] ఇందులో ఒక మార్గం ట్రాలీబస్‌గా పనిచేస్తుంది. బర్గెన్‌లోని ట్రాలీబస్ వ్యవస్థ నార్వేలో ఇప్పటికీ అమలులో ఉన్న ఏకైక వ్యవస్థ. స్కాండినేవియాలోని రెండు ట్రాలీబస్ వ్యవస్థలలో ఇది ఒకటి.[66]

ఆధునిక ట్రామ్ బర్గెన్ లైట్ రైల్ 2010 లో నగర కేంద్రం, నెస్టున్ ల మధ్య మొదలైంది.[67] 2013 లో రాడాల్ (లగునెన్ స్టోర్సెంటర్) వరకూ, 2017 లో బర్గెన్ విమానాశ్రయం ఫ్లెస్లాండ్ వరకూ దీన్ని విస్తరించారు.[68] ఇతర బారోగ్‌లకు విస్తరణలు ఆ తరువాత జరగవచ్చు.[69] ఫ్లోబానెన్‌ అనేది నగర కేంద్రం నుండి మౌంట్ ఫ్లాయెన్ వరకు నడిచే ఒక ఫ్యూనిక్యులర్. ఉల్రిక్స్‌బానెన్ అనేది మౌంట్ ఉల్రికెన్ వరకు నడిచే ఒక వైమానిక ట్రామ్‌వే.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Gross domestic product (GDP) at current market prices by metropolitan regions". ec.europa.eu.
  2. "Folketall per 1. januar 2022" (in నార్వేజియన్ బొక్మాల్). SSB. 19 May 2021. Retrieved 10 August 2022.
  3. Heggemsnes, Nils (26 September 2012). "Bergen Havn". Store norske leksikon (in నార్వేజియన్ బొక్మాల్). Retrieved 8 January 2016.
  4. 4.0 4.1 "Cruisestatistikk". Cruise (in నార్వేజియన్ బొక్మాల్). Port of Bergen. 2016. Archived from the original on 26 May 2015. Retrieved 8 January 2016.
  5. Brekke, Nils Georg (1993). Kulturhistorisk vegbok Hordaland (in నార్వేజియన్). Bergen: Hordaland Fylkeskommune. ISBN 82-7326-026-7.
  6. Elisabeth Farstad (2007). "Om kommunen" (in నార్వేజియన్ బొక్మాల్). Bergen kommune. Archived from the original on 5 October 2007. Retrieved 16 September 2007.
  7. Hella, Asle (2004-06-07). "Bergens historie må skrives om". NRK (in నార్వేజియన్ బొక్మాల్).
  8. Marguerite Ragnow (2007). "Cod". Retrieved 14 August 2007.
  9. 9.0 9.1 Tom R. Hjertholm (16 December 2013). "- Tørrfisken vender hjem". Bergensavisen.
  10. Anette Skogseth Clausen. "7. oktober 1754 – fra et hanseatisk kontor til et norsk kontor med hanseater" (in నార్వేజియన్ బొక్మాల్). Arkivverket. Archived from the original on 15 October 2007. Retrieved 9 October 2007.
  11. Østby Pedersen, Nina (2005). "Scottish Immigration to Bergen in the Sixteenth and Seventeenth Centuries". In Grosjean, Alexia; Murdoch, Steve (eds.). Scottish Communities Abroad in the Early Modern Period. Brill. pp. 136–168. doi:10.1163/9789047407157_010. ISBN 978-90-474-0715-7.
  12. UNESCO (2007). "World Heritage List". Retrieved 14 August 2007.
  13. Carl Hecker, Justus Friedrich (1833). The Black Death in the Fourteenth Century.
  14. Knight, Charles, ed. (1847). The National Cyclopaedia of Useful Knowledge. Vol. III. London: Charles Knight. p. 211.
  15. Downing Kendrick, Thomas (2004). A History of the Vikings. Courier Corporation. p. 142. ISBN 978-0-486-43396-7.
  16. "The fire of 1702". kulturpunkt.org. Bergen City Museum. Retrieved 3 May 2023.
  17. "Innvandring 1600–2000, Arkivenes dag 2002" (in నార్వేజియన్ బొక్మాల్). Arkivverket. Archived from the original on 6 December 2002. Retrieved 9 October 2007.
  18. Ivan Kristoffersen (2003). "Historien om Norge i nord" (in నార్వేజియన్). Norwegian Ministry of Foreign Affairs. Archived from the original on 28 March 2008. Retrieved 9 October 2007.
  19. "Distriktsinndeling og navn" (in నార్వేజియన్). Fornyings- og administrasjonsdepartementet. Archived from the original on 28 March 2008. Retrieved 16 September 2007.
  20. Jukvam, Dag (1999). Historisk oversikt over endringer i kommune- og fylkesinndelingen (PDF) (in నార్వేజియన్). Statistisk sentralbyrå. ISBN 9788253746845.
  21. Jenny Heggsvik; Lars Borgersrud; August Rathke; Egil Christophersen; Ole-Jacob Abraham. "Prosjektbeskrivelse for det historiske forskningsprosjektet SABORG I BERGEN". Archived from the original on 13 March 2017. Retrieved 30 November 2018.
  22. NRK (21 November 2017). "The Isdalen Mystery". NRK (in నార్వేజియన్ బొక్మాల్). Retrieved 25 June 2019.
  23. McCarthy, Marit Higraff and Neil (25 June 2019). "Death in Ice Valley: New clues in a Norwegian mystery" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 25 June 2019.
  24. Tønder, Finn Bjørn (26 November 2002). "Viktig nyhet om Isdalskvinnen" [Important news about Isdal Woman]. Bergens Tidende (in నార్వేజియన్). Archived from the original on 10 November 2013. Retrieved 21 October 2012.
  25. Bergen Kommune (2007). "Styringssystemet i Bergen kommune" (PDF) (in నార్వేజియన్). Archived from the original (PDF) on 27 February 2008. Retrieved 14 August 2007.
  26. "Folketall per 1. januar 2022" (in నార్వేజియన్ బొక్మాల్). SSB. 19 May 2021. Retrieved 10 August 2022.
  27. "Urban settlements. Population and area, by municipality. 1 January 2012". Statistics Norway. 2012. Retrieved 31 January 2014.
  28. 28.0 28.1 28.2 "SSB: Tall om Bergen kommune" (in నార్వేజియన్). Statistics Norway. Archived from the original on 1 October 2007. Retrieved 1 October 2007.
  29. "Statistics Norway". Stat Bank. Archived from the original on 26 May 2012. Retrieved 4 January 2012.
  30. "09817: Immigrants and Norwegian-born to immigrant parents by immigration category, in total and separately, country background and percentages of the population (M) 2010 - 2023. Statbank Norway". SSB (in ఇంగ్లీష్). Retrieved 2023-10-30.
  31. "Immigrants and Norwegian-born to immigrant parents". SSB (in ఇంగ్లీష్). Retrieved 2023-10-31.
  32. "Oversikt over barneskoler" (in నార్వేజియన్). Bergen kommune. 2007. Archived from the original on 5 September 2007. Retrieved 29 September 2007.
  33. "Oversikt over ungdomsskoler" (in నార్వేజియన్). Bergen kommune. 2007. Archived from the original on 14 September 2007. Retrieved 29 September 2007.
  34. "Skoleportalen" (in నార్వేజియన్). Hordaland fylkeskommune. 2007. Archived from the original on 26 July 2007. Retrieved 29 September 2007.
  35. "Oversikt over kombinerte skoler" (in నార్వేజియన్). Bergen kommune. 2007. Archived from the original on 5 September 2007. Retrieved 29 September 2007.
  36. Hartvedt, Gunnar Hagen (1994). Bergen Byleksikon. Kunnskapsforlaget. ISBN 82-573-0485-9.
  37. "The University of Bergen is 70 years old". University of Bergen (in ఇంగ్లీష్). Retrieved 14 August 2020.
  38. "Om Universitetet i Bergen" (in నార్వేజియన్). Archived from the original on 23 September 2006. Retrieved 16 August 2007.
  39. Mia Kolbjørnsen and Hilde Kvalvaag (2002). "UiB får tre SFF" (in నార్వేజియన్). på høyden. Retrieved 9 October 2007.
  40. "About CMI" (in నార్వేజియన్). Retrieved 2 October 2007.
  41. "Høgskolen på Vestlandet" (in నార్వేజియన్). 2018. Archived from the original on 11 December 2018. Retrieved 12 December 2018.
  42. "FT.com / Business Education / Masters in management". Financial Times (in నార్వేజియన్). 2007. Archived from the original on 15 October 2008. Retrieved 29 September 2007.
  43. "The Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel 2004". 2007. Retrieved 16 August 2007.
  44. "Om NHH" (in నార్వేజియన్). Archived from the original on 2 February 2014. Retrieved 23 January 2014.
  45. "Om Kunsthøgskolen i Bergen" (in నార్వేజియన్). Archived from the original on 13 December 2007. Retrieved 16 August 2007.
  46. "About imr" (in నార్వేజియన్). Archived from the original on 16 January 2008. Retrieved 2 October 2007.
  47. "Europe's Secret Capitals". Time. 30 August 2004. Archived from the original on 23 August 2004. Retrieved 14 August 2007.
  48. "Film Location:Bergen". West Norway Film Commission. Archived from the original on 15 October 2007. Retrieved 9 October 2007.
  49. Lars Kvamme and Ingvild Bruaset. "Russerne kommer" (in నార్వేజియన్). bt.no. Archived from the original on 15 October 2007. Retrieved 10 October 2007.
  50. Frode Buanes and Lars Kvamme (2006). "Sender bergensturister vekk" (in నార్వేజియన్). bt.no. Archived from the original on 15 October 2007. Retrieved 10 October 2007.
  51. Bergen Havn. "Velkommen til Bergen havn – "Inngangen til Fjordene"" (in నార్వేజియన్). Archived from the original on 18 July 2007. Retrieved 14 August 2007.
  52. 52.0 52.1 "Transport to Bergen". Innovation Norway. Archived from the original on 31 May 2012. Retrieved 2 May 2012.
  53. "Flight Timetables". Avinor. Archived from the original on 9 September 2012. Retrieved 9 April 2012.
  54. Eliassen, Jan I. (24 June 2006). "Bergen havn holder koken". Bergens Tidende (in నార్వేజియన్). Archived from the original on 10 August 2013. Retrieved 2 May 2012.
  55. "Cruise ships". Bergen Port Authority. Archived from the original on 9 August 2013. Retrieved 2 May 2012.
  56. "World Port Rankings 2009" (PDF). American Association of Port Authorities. Archived from the original (PDF) on 2023-12-08. Retrieved 2 May 2012.
  57. Haga, Anders (24 June 2006). "- Vi har alle vært feige". Bergens Tidende (in నార్వేజియన్). Archived from the original on 10 August 2013. Retrieved 2 May 2012.
  58. "Fjord1 – Ekspressbåter" (in నార్వేజియన్). Fjord1. Archived from the original on 27 August 2007. Retrieved 16 September 2007.
  59. Norwegian Public Roads Administration (1994). "The Nordhordland Bridge" (PDF). Archived from the original (PDF) on 9 February 2006.
  60. "Askøy Bridge" (PDF). Aas-Jakobsen. Archived from the original (PDF) on 3 September 2011. Retrieved 2 October 2011.
  61. Fjell, Ragnvald (1989). Sotrabrua (in నార్వేజియన్). Fjell: A/S Sotrabrua. p. 5.
  62. Jahnsen, Jack (2006). Fastlandssamband for Bjorøy og Tyssøy (in నార్వేజియన్). Straume: Fastlandssambandet Tyssøy – Bjorøy. ISBN 82-303-0642-7.
  63. Jernbaneverket (2007). Jernbanestatistikk 2006 (PDF). Oslo: Jernbaneverket. p. 13. Archived from the original (PDF) on 17 December 2007.
  64. Aagesen, Ragnhild (21 September 2010). "Bergen-Arna" (in నార్వేజియన్). Archived from the original on 6 November 2011. Retrieved 20 September 2011.
  65. "About Skyss". Skyss. Archived from the original on 13 May 2012. Retrieved 2 May 2012.
  66. Aspenberg, Nils Carl (1996). Trolleybussene i Norge. Oslo: Baneforlaget. p. 96.
  67. "Signingsferden" (in నార్వేజియన్). 2010. Archived from the original on 26 June 2010. Retrieved 26 June 2010.
  68. Melhus, Ståle (11 September 2009). "Vil ha bybane til Flesland i 2015". Fanaposten (in నార్వేజియన్). Archived from the original on 24 July 2011. Retrieved 7 November 2009.
  69. Rykka, Ann Kristin and Solfrid Torvund (13 December 2006). "Usamde om bybaneutvidinga". Norwegian Broadcasting Corporation (in నార్వేజియాన్ న్యోర్స్క్).
"https://te.wikipedia.org/w/index.php?title=బర్గెన్&oldid=4546593" నుండి వెలికితీశారు