బర్డ్ వాక్ ఫెస్టివల్ (కవ్వాల్)
బర్డ్ వాక్ ఫెస్టివల్
కవ్వాల్ కవ్వల్ అటవీ ప్రాంతంలో పక్షుల పండుగ | |
---|---|
స్థితి | యాక్టివ్ |
ప్రక్రియ | పక్షుల అందాల |
తేదీ(లు) | 2025: మార్చి 01-2 (Kavvala Forest), డిసెంబర్ 12-13 (Gandhari fort), మార్చి 1-2 (Mancherial). |
ఫ్రీక్వెన్సీ | వార్షికం |
స్థలం | కవల (కవ్వాల్ టైగర్ జోన్) |
ప్రదేశం | కవ్వాల్ జన్నారం మండలం , మంచిర్యాల జిల్లా , తెలంగాణ, ఇండియా |
దేశం | భారతదేశం |
క్రియాశీల సంవత్సరాలు | 2022–present |
ప్రారంభించినది | February 12, 2022 |
వ్యవస్థాపకుడు | తెలంగాణ అటవీ శాఖ |
పాల్గొనువారు | పక్షి ప్రేమికుడు, పక్షీ పరిశోధకులు |
విస్తీర్ణం | కవ్వాల్ టైగర్ జోన్ |
నిర్వహణ | అటవీశాఖ అధికారులు |
బర్డ్ వాక్ ఫెస్టివల్ కవ్వాల్ తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, కవల్ , వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రతి సంవత్సరం అటవీ అధికారులు రెండు రోజులు పాటు బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు[1][2][2][3].
చరిత్ర
[మార్చు]కవల్ ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ ను 2022 లో ప్రారంభించారు.కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యంలోని జరిగే పక్షుల పండుగ కోసం తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్ గడ్ , ఒరిస్సా రాష్ట్రాల నుండి అనేక మంది పక్షి ప్రేమికులు సందర్శించి పక్షుల ఫోటోలు, వన్యప్రాణుల ఫోటోలు తమ యొక్క క్యామేరాలో బందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారులు బర్డ్ వాక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.ఈ అభయారణ్యం సమృద్ధిగా వృక్షజాలం, జంతుజాలానికి ప్రసిద్ధి గోదావరి నది, కడెం నది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉంది.గతంలో రెండుసార్లు ఫిబ్రవరి నెలలో నిర్వహించగా మూడో ఫెస్టివల్ డిసెంబర్ నెలలో నిర్వహించారు.
తొలి బర్డ్ వాక్ ఫెస్టివల్ -2022
[మార్చు]ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలంలోని కవల పులుల అభయారణ్యం లో తొలి సారిగా 12,13 తేది: ఫిబ్రవరి 2022లో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించారు.విశేసమైన స్పందన రావడంతో అటవీ శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు[4].
2024 లో డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15 వరకు మూడు రోజుల పాటు కవ్వాల్ టైగర్ జోన్ లో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించారు[5].
ఏర్పాట్లు
[మార్చు]ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారులు, W.W.F (World Wide Fund for Nature)& N.C.F (National Curriculum Framework) సంయుక్తంగా ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది[6].ఈ పండుగకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను చేస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పక్షి ప్రేమికులు కోసం అటవీ అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. మైసమ్మ కుంట,బైసన్ కుంట, నీలుగాయికుంట, కప్పకుంట, గోండుగూడ మొదలగు అటవీ ప్రాంతాల్లో పక్షి, ప్రేమికులు కోసం బస ఏర్పాట్లు చేసి వసతులు సమకూర్చు తారు. అడవుల్లో సెల్ఫీ పాయింట్, హరిత రిసార్ట్స్ ఏర్పాటు చేశారు.
పక్షుల అధ్యాయనం
[మార్చు]ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవల అభయారణ్యంలో సుమారు 300 రకాల పక్షులు ఉన్నాయని అటవీ శాఖ వారు అంచనా వేసారు.ఈ అభయారణ్యంలో పచ్చని ఎత్తైన చెట్లు, అందమైన సరస్సులు , లోయలు, రంగు రంగుల పక్షులు,పక్షుల కిలకిల రాగాలు, రకారకాల జంతువులు, అందమైన చిన్న చిన్న సరస్సులు , ప్రకృతి సుందరమైన దృశ్యాలను ఇలా ఎన్నేనో వింత అనుభూతులకు నిలయమైన కవ్వాల్ అభయారణ్యంలో పక్షి ప్రేమికులను కనువిందు చేస్తుంది. చలికాలంలో ఖండాంతరాల నుంచి వివిధ రకాల పక్షులు కవల అభయారణ్యంలో వస్తాయి. ఇలా వచ్చిన వలస పక్షులతో ఈ అభయారణ్యం పక్షుల కిలకిల రాగాలతో మార్మోగిపోతుంది. పలు ప్రాంతాల్లో నుండి వచ్చిన [పక్షి]] ప్రేమికులు, విశ్వవిద్యాలయలయాల పరిశోధక విద్యార్థులు సందర్శించి వారు తెచ్చిన పెద్ద పెద్ద లెన్స్ కెమెరాల్లో,బైనాక్యులర్స్ లతో చూసి రంగు రంగుల పక్షుల చిత్రాలను తమ కెమెరాలో బంధించారు. ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ లో గ్రే హెడ్డ్ ఈగల్, రామచిలుక,వూలీ నెక్ట్ స్టోర్క్, ఎగ్రెట్స్, స్పాట్ బిల్ట్ బాతులు, కింగ్ ఫిషర్, కొంగలు, వైట్ బ్రెస్ట్ వాటర్ ఈటర్, రెడ్ కాలర్ట్, పావురాలు, సీతకోక చిలుకలు, బ్లాక్ డ్రాంగోలు, మొదలగునవి పక్షి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం తో పాటు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పక్షి ప్రేమికులు,పక్షి పరిశోధకులు, పరిశీలకులు వన్యప్రాణి ఫోటో గ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభయారణ్యంలో ఉన్న వివిధ రకాల స్థలాలైన సీతాకోకచిలుకల ఉద్యానవన, బైసన్ కుంట,బిర్తాన్ పేట్,కల్పకుంట, మైసమ్మ కుంట క్యాంపులను సందర్శించారు.
మూలాలు
[మార్చు]- ↑ "BIRD: కవ్వాల్ బర్డ్ వాక్ ...నేచర్ చాలా గొప్పది !". Newsline. Retrieved 2025-03-29.
- ↑ 2.0 2.1 Telugu, TV9 (2025-03-01). "Bird Walk Festival: కవ్వాల్‌లో కనువిందు చేసిన బర్డ్ వాక్ ఫెస్టివల్.. బారులు తీరుతున్న పక్షి ప్రేమికులు." TV9 Telugu. Retrieved 2025-03-19.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ ABN (2022-02-10). "కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్". Andhrajyothy Telugu News. Retrieved 2025-03-19.
- ↑ Vikas, Manda. "Bird Walk | పక్షి ప్రేమికుల కోసం కవాల్ రిజర్వ్‌లో తొలిసారిగా బర్డ్ వాక్ ఈవెంట్". Hindustantimes Telugu. Retrieved 2025-03-19.
- ↑ Velugu, V6 (2024-12-11). "డిసెంబర్ 13 నుంచి కవ్వాల్‌లో బర్డ్ వాక్ ఫెస్టివల్". V6 Velugu. Retrieved 2025-03-19.
{{cite web}}
: zero width space character in|title=
at position 27 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "కనువిందు చేసిన బర్డ్ వాక్ ఫెస్టివల్.. సందడి చేసిన విద్యార్థులు..!". telugu.news18.com. 2025-03-05. Retrieved 2025-03-19.