బర్వాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Barwani జిల్లా

बड़वानी जिला
Madhya Pradesh రాష్ట్రంలో Barwani యొక్క స్థానాన్ని సూచించే పటం
Madhya Pradesh రాష్ట్రంలో Barwani యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
డివిజన్Indore
ముఖ్యపట్టణంBarwani
విస్తీర్ణం
 • మొత్తం3,665 కి.మీ2 (1,415 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1
 • సాంద్రత380/కి.మీ2 (980/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత50.23 per cent
 • లింగ నిష్పత్తి981
జాలస్థలిఅధికారిక వెబ్‌సైటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో బరేలి జిల్లా (హిందీ:बड़वानी जिला) ఒకటి. బరేలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.జిల్లావైశాల్యం 3665 చ.కి.మీ 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,081,039.

సరిహద్దులు[మార్చు]

బరేలి జిల్లా ఉత్తర సరిహద్దులో నర్మదానది ప్రవహిస్తుంది. దక్షిణ సరిహద్దులో సప్తపురా పర్వతశ్రేణి ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దులో మాహారాష్ట్ర రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో ధార్ జిల్లా మరియు తూర్పు సరిహద్దులో ఖర్‌గొన్ జిల్లా ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

1948 సమైక్య భారతంలో బర్వానీ రాజాస్థానం విలీనం తరువాత ఈ ప్రాంతం సరికొత్తగా రూపొందించబడిన మధ్యభారత్ రాష్ట్రంలోని ఖర్‌గొన్ (పశ్చిమ నిమర్) జిల్లాలో భాగం అయింది. 1998 మే మాసంలో ఖర్‌గొన్ జిల్లాలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బర్వాని జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : బర్వని మరియు సెంధ్వ
  • జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి : తాలూకాల్లో, బర్వని, సెంధ్వ, పన్సెమల్, నివలి, థికరి, పతి, అంజద్ మరియు రాజ్పూర్
  • జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి : బర్వని, పతి, సెంధవ, పన్సెమల్, నివలి, థికరి మరియు రాజ్పూర్.
  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పన్సెమల్ ( పన్సెమల్, నివాలి), బర్వాని (బర్వాని, పతి) సెంధ్వ, మరియు రాజ్పూర్ (రాజ్పూర్ + అంజద్ + థికరి).
  • ఖర్గొనె పార్లమెంటు నియోజకవర్గం :-బర్వని, సెంధవ, పన్సెమల్ మరియు రాజ్పూర్
  • జిల్లాలో 2 పురపాలితాలు ఉన్నాయి :- బర్వాని మరియు సెంధ్వా.

జిల్లాలో 417 గ్రామ మపచాయితీలు, 646 గ్రామాలు, 576 రెవెన్యూలు మరియు 70 ఆటవీ ప్రాంతాలు ఉన్నాయి. 560 జనావాస గ్రామాలు మరియు 16 నిర్జన గ్రామాలు ఉన్నాయి.

ఆర్ధికం[మార్చు]

సెంధ్వా కాటన్ జిన్నింగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. జిల్లాలో అదనంగా ఉన్న పత్తి పరిశ్రమలు వేలాది ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో సంజయ్ కాటన్ ఫైబర్ అతిపెద్ద కాటన్ ఫ్యాక్టరీగా గుర్తినబడుతుంది.

ఆలయాలు[మార్చు]

  • అంజాద్ :- వీరేశ్వర్ మహాదేవ్, గాయత్రి ఆలయం మరియు మాతా నగరి మాత ఆలయం నగరంలో ప్రముఖ ఆలయాలుగా గుర్తినచబడుతున్నాయి.
  • బవంగజ :- ఇది ఒక ప్రముఖ జైన ఆలయంగా గుర్తినబడుతుంది. బర్వాని పట్టణానికి ఇది 6 కి.మీ దూరంలో ఉంది.
  • ప్రపంచంలో అతిపెద్ద జైన శిల్పంగా గుర్తించబడుతున్న జైన తీర్ధంకర " అజిత్జీ " శిల్పం.
  • జిల్లాలో 15వ శతాబ్ధానికి చెందిన హిందూ ఆలయాలు ఉన్నాయి. కుంభకర్ణుడు మరియు ఇంద్రజిత్తు ఇక్కడ నిర్యాణం చెందారని విశ్వసిస్తున్నారు.
  • సప్తపురా పర్వతావళిలో పురాతన భవర్ గర్ పురాతన కోట ఉంది.
  • సెంధ్వాకు దక్షిణంగా 20కి.మీ దూరంలో సెంధ్వా సమీపంలో ఉన్న బీజసన్ ఆలయంలో బీజశని (దుర్గా) ప్రధాన దైవంగా ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,385,659, [2]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 345 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 256 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.55%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 881:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 50.23%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

జిల్లాలోని ప్రజలలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. బరేలి పాల్యా, భిల్లు భాష 10,000 మంది ప్రజలలో వాడికలో ఉంది. ;[5] బరేలీ ప్యూరీ భాషకు 1,75,000 మంది వాడకందార్లు ఉన్నారు. దీనిని దేవనాగరి లిపిలో వ్రాస్తుంటారు.[6] మరియు బరేలి రాథ్వి భాష 64,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. [7] భిలాలి భాష 1 150 000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[8]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Swaziland 1,370,424 line feed character in |quote= at position 10 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help)
  5. M. Paul Lewis, ed. (2009). "Bareli, Palya: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
  6. M. Paul Lewis, ed. (2009). "Bareli, Pauri: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
  7. M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
  8. M. Paul Lewis, ed. (2009). "Bhilali: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.CS1 maint: Extra text (link)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బర్వాని&oldid=2353049" నుండి వెలికితీశారు