Coordinates: 16°26′50″N 80°02′29″E / 16.447281°N 80.041466°E / 16.447281; 80.041466

బలిజేపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలిజేపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
బలిజేపల్లి is located in Andhra Pradesh
బలిజేపల్లి
బలిజేపల్లి
అక్షాంశరేఖాంశాలు: 16°26′50″N 80°02′29″E / 16.447281°N 80.041466°E / 16.447281; 80.041466
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం రాజుపాలెం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,532
 - పురుషుల సంఖ్య 1,740
 - స్త్రీల సంఖ్య 1,792
 - గృహాల సంఖ్య 904
పిన్ కోడ్ 522412
ఎస్.టి.డి కోడ్

బలిజేపల్లి, పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రాజుపాలెం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సత్తెనపల్లి నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 904 ఇళ్లతో, 3532 జనాభాతో 949 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1740, ఆడవారి సంఖ్య 1792. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 483 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 120. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590043.[1]

సమీప గ్రామాలు[మార్చు]

తొండపి 3 కి.మీ, చాగల్లు 3 కి.మీ, దమ్మాలపాడు 6 కి.మీ, ధూళిపాళ్ళ 6 కి.మీ, రాజుపాలెం 7 కి.మీ.

గ్రామ చరిత్ర[మార్చు]

బలిజెపల్లి ఒక ఛిన్న గ్రామం. ఇక్కడ ప్రధానముగా వరి, మిర్ఛి, పసుపు, ప్రత్తి మొదలుగా గల పంటలు పండిస్తారు. గ్రామాన్ని ఆనుకొని ఎద్దువాగు ప్రవహిస్తుంటుంది. నాగార్జున సాగరు కెనాల్ ద్వారా నీరు అందుతుంది. మంఛి పంటలు పండుతాయి. ఈగ్రామంలో రెడ్డి, యాదవ, రాజులు, కుమ్మరి, ఛాకలి, ముస్లీం, మాదిగ, యెరుకల, భాగవతులు ఇలా అనెక కులముల వారు నివసిస్తున్నారు.ఈ గ్రామంలో సుమారు 200 సంవత్సరముల నాడు నిర్మింఛిన శివాలయం ఉంది. పెద్ద గాలిగోపురం కూడా ఉంది. అంతే కాకుండా ఇక్కడ రెండు రామాలయములు, వీరబ్రహ్మంగారి ఆలయము, పోలెరమ్మ గుడి కుడా ఉన్నాయి. ఈ గ్రామం మొదటి నుండి కళలకు పెట్టింది పేరుగా ఉంది. గత తరంలో యిసిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఆంజనెయులు అను స్టేజి డ్రామా ఆర్టిస్టులు వుండేవారు. ఇప్పుడు గంగదాసు అంజిరెడ్డి ఆనే మంఛి గాయకుడు ఉన్నాడు. తను ఎన్నొ అవార్డ్స్ గెలుఛు కున్నాడు. నంది బహుమతులు కూడా గెలిఛాడు. గంగదాసు రామకృష్ణా రెడ్డి అని సినిమా కో-డైరెక్టరు కూడా ఉన్నాడు.ఈ గ్రామం గురింఛి ఒక కథ వినిపిస్తుంది. పూర్వం ఈ గ్రామంలో పెరుపొందిన దొంగలు వుండేవారని ఛెపుతారు. ఒకసారి నరసరావుపేట రాజా వారు ఈ గ్రామం దొంగని గురింఛి విని వాడిని పిలిపింఛి "ఏరా నువ్వంతటి దొంగవా?" అని అడిగితే "రాజా నేను ఈ రాత్రికి మహారాణి కట్టు కొని వున్న ఛీరను దొంగిలిస్తానండి" అని ఛెప్పి మరీ ఆ రోజు ఛీరను దొంగిలింఛి నట్లు ఛెపుతారు. 64 కళల్లో ఛోరకళ కూడా ఒకటి అన్నది నిరూపించాడు.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామం గడ్డ ఎప్పడు ఎత్తారో ఇదమిత్ధముగా ఆధారం లేదు. కాకపొతే పూర్వీకుల సమాచారం ప్రకారం మాదిగ సామాజిక వర్గం వారు గడ్డ ఎత్తినట్లుగా పెద్దవారి ద్వారా తెలుస్తుంది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు గణపవరంలో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సత్తెనపల్లిలోను, ఇంజనీరింగ్ కళాశాల ధూళిపాళ్ళలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ నల్లపాడులోను, మేనేజిమెంటు కళాశాల ధూళిపాళ్ళలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం సత్తెనపల్లిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

బలిజేపల్లిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

బలిజేపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 17 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

బలిజేపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 9 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 329 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 26 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 139 హెక్టార్లు
  • బంజరు భూమి: 65 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 379 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 188 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 395 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

బలిజేపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 379 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 16 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

బలిజేపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

ప్రత్తి, మిరప

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీచెన్నమల్లేశ్వరస్వామి దేవాలయ చరిత్ర

బలిజేపల్లిలోని చెన్నమల్లేశ్వరస్వామి దేవాలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో బాలవినాయకుడు, శివలింగం, పార్వతిదేవి, భద్రకాళి, వీరభద్రుడు, నందీశ్వరుడు, వీరహనుమాన్, నవ గ్రహాలు, నాగేంద్రుడు కోలువైయున్నారు. ఈ పురాతనమైన దేవాలయంలో శివలింగం కింద లంకె బిందెలలో బంగారం, పురాతనమైన నాణేలు ఉన్నాయనే దురాలోచనతో కొందరు స్వార్ధపరులు దేవాలయ కట్టడాలను ధ్వంసం చేశారు. ఈ పురాతనమైన, చారిత్రక దేవాలయం, కొన్ని సంవత్సరాలు శిథిలావస్థలో ఉంది. దేవాలయాన్నిబలిజేపల్లి వాసులు కూడా పట్టించుకోలేదు. ఈ దీనావస్థలో ఉన్న శివదేవాలయాన్ని, సుమారుగా 1890వ సంవత్సరంలో జంపని బుచ్చయ్య చౌదరి గారు, వారి కుమారులు బలిజేపల్లిలోని తమ సొంత భూమిని సాగు చేయుటకు కండ్లగుంట నుండి బలిజేపల్లి వచ్చి వెళ్తూవుండేవారు. ఈ క్రమంలో, ఓరోజు రాత్రి జంపని బుచ్చయ్య చౌదరి గారికి కలలో శివుడు ప్రత్యక్షమై, బలిజేపల్లిలోని శిథిలావస్థలో ఉన్న గుడిని కాశీ వెళ్లి శివలింగాన్ని తీసుకొని వచ్చి పునఃరుద్ధరణ చేయవలసినదిగా ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞతో తనకు 60 సంవత్సరాల వయస్సులో జంపని బుచ్చయ్య చౌదరి గారు అత్యంత భక్తి శ్రద్ధలతో కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు. ఈ పునఃరుద్దరణ కార్యక్రమంలో భాగంగా దేవాలయానికి నాలుగువైపులా ప్రహరిగోడ, 50అడుగులు ఎత్తైన గాలి గోపురం, పూజారికి ఇల్లు నిర్మించడమే కాకుండా, అత్యంత వ్యయప్రయాసాలకోర్చి, ఆరోజులలో రోడ్లు కూడా సరిగాలేని చింతలపల్లి అడవుల నుండి 12జతల ఎద్దుల కాడిమానుల మీద 60అడుగుల టేకు ధ్వజస్తంభాన్ని 500 కిలోమీటర్ల దూరానికి కేవలం రెండు నెలల వ్యవధిలో తీసుకొని వచ్చి, ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది ఓ వ్యక్తిగా గొప్ప సాహసం.

ప్రదేశము

సుమారుగా ఎకరం స్థలంలో శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి దేవాయం బలిజేపల్లి గ్రామంలో, రాజుపాలెం మండలం, సత్తెనపల్లి నియోజకవర్గం, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో యున్నది. చుట్టూ పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంల మధ్య ఉంది. ఈ ఆలయం సత్తెనపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుండి 17.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవాలయానికి బస్సు సౌకర్యం ఉంది. దేవాలయానికి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో పురాతన ఆలయాలలో ఒకటిగా ఖ్యాతి గాంచింది. ప్రధాన శివలింగాన్ని, ఆలయ గోపురాన్ని సుమారుగా 1890 సంవత్సరంలో “జంపని బుచ్చయ్య చౌదరి గారి“ ద్వారా పవిత్రం జరిగింది.

తరువాత ఆధ్యాత్మికముగా కూడా మొదటి నుండి గ్రామం ముందుంటుంది. బ్రహ్మ్మంగారి గుడిలో పూర్వం 'సుబ్బయ్య నాయన' అని ఉండే వాడు. తను రోజు ఆన్నపూర్నమ్మ కావడి వేసుకొని గ్రామం లోకి వచ్చేవాడట. ఆయన విభుధి పెడితే ఎవరికి ఏవిధమైన బాధలున్నా తగ్గేవని గొప్పగా చెప్పేవారు. ప్రస్తుతం ఈ గ్రామం లోనే జన్మించిన యిసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి అను వ్యక్తి గత 20 సంవత్సరములకు పైగా అనేక గాయత్రి యజ్ణాలు చేస్తున్నారు.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,425. ఇందులో పురుషుల సంఖ్య 1,717, స్త్రీల సంఖ్య 1,708, గ్రామంలో నివాస గృహాలు 723 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 949 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".