బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి ప్రముఖ సంగీత విద్వాంసులు, రేడియో కళాకారులు.[1]

రామకృష్ణశాస్త్రి గుంటూరులో 1932 జనవరి 6వ జన్మించారు. తండ్రి సీతారామశాస్త్రి గారి వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1947 నుండి సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. 1956 నుండి ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సంగీతవాద్యాల పరిరక్షకులుగా (Care taker, Musical Instruments) 1962 వ సంవత్సరంలో చేరారు. భక్తిరంజని, సంగీత శిక్షణ, సంగీత రూపకాలు, కచేరిల ద్వారా శ్రోతల మన్ననలు పొందారు. 1980 లో తంబురా కళాకారులుగా నియుక్తులయ్యారు. 1992లో పదవీ విరమణ చేసేంతవరకు రామకృష్ణశాస్త్రి తమ గాత్రమాధుర్యంతో శ్రోతల నలరించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీవారు శాస్త్రి ప్రతిభను గుర్తించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సంగీత విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్ గా కొంతకాలం వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారు వీరి సేవలను పరిక్షాధికారిగా వినియోగించుకొంటున్నారు. శాస్త్రి విజయవాడలో స్థిరపడ్డారు.

మూలాలు

[మార్చు]
  1. Chandaraju, Aruna (2014-01-30). "Flavour of traditional music". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-03-29.