బలిజేపల్లి సాయిలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలిజేపల్లి సాయిలక్ష్మి
జననంహైదరాబాదు
ఇతర పేర్లుసాయిలక్ష్మి
చదువునీలోఫర్ లో పి.జి
సంస్థఏకం ఫౌండేషన్
వెబ్ సైటుhttp://www.ekamoneness.org/

బలిజేపల్లి సాయి లక్ష్మి హైదరాబాదులో జన్మించి, వైద్యవిద్య అభ్యసించి చెన్నయ్ లో స్థిరపడిన ప్రముఖ వైద్యురాలు. ఆమె సమాజంలో డబ్బులు లేక, వైద్య సేవలలు అందించలేక పేద పిల్లలు చనిపోతుంటే, వారి తల్లితండ్రుల ఆవేదనను చూసి చలించి తన సర్వ శక్తులను ఏకంచేసి.. ఏకం అనే సంస్థను స్థాపించి చిన్న పిల్లలకు వైద్య సేవలందిస్తున్నారు[1]. పిల్లల వైద్య సేవలకు ఖర్చుపెట్టలేని వారికి తన సంస్థ ద్వారా సహాయమందించి పిల్లల తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూసి తృప్తి పడే వైద్యురాలు. వీరి సేవకు గాను కేంద్ర ప్రభుత్వము ప్రతిష్ఠాకమైన నారిశక్తి పురస్కారాన్నిచ్చి గౌరవించింది[2][3].

బాల్యము... విద్య[మార్చు]

సాయిలక్ష్మి హైదరాబాదులో జన్మించారు. సికిందరాబాదు సెయింట్ ఆన్స్ కళాశాలలో ఇంటరు చదివి, గాంధీ వైద్య కళాశాలలో ఎం.బి.బిఎస్. చదివారు. ఆమె నీలోఫర్ లో పి.జి. చేసి చిన్న పిల్లల వైద్య నిపుణురాలైనారు.[1] తాను వైద్య విద్యను అబ్యసిస్తున్నప్పుడు. తమ పరిసర ప్రాంతాలోని పేదవారి పిల్లలు అనారోగ్యంతో..... వైద్యం అందక, సరైన వైద్యం అందించడానికి తగిన ఆర్థిక వనరులు లేక చిన్న పిల్లలు చనిపోతుంటే వారికేదైనా సహాయం చేయాలని సంకల్పించి తన మిత్రుల సహాయంతో అటువంటి పిల్లలకు వైద్య సహాయము అందించారు. 2009 లో తాను చేస్తున్న వైద్య వృత్తిని మానేసి తాను నెలకొల్పిన ఏకం అనే సంస్థకే అంకితమై పేద వారైన చిన్నపిల్లల వైద్య సేవలోనే వుంటున్నారు[4]

ఎదుర్కొన్న సవాళ్ళు[మార్చు]

ఒక సారి ఇద్దరు చిన్నపిల్లలకు గుండె సమస్య వచ్చింది. దానికి గాను 12 లక్షలు అవసరమైంది. ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చాలో తెలియక సతమతమయ్యారు. కాని వారికి వారికి వైద్య సేవ లందించి ప్రాణాలు నిలబెట్టగా.... ఆచిన్నారుల చిరునవ్వు, వారి తల్లి దండ్రుల కళ్ళలోని ఆనందాన్ని చూసి తాను పడిన శ్రమ వృధా కాలేదని సంతోష పడింది. కొంత మంది పిల్లల తల్లిదండ్రులు తమకు పోన్ చేసి తమ బిడ్డ చావు బ్రతుకుల మద్య వున్నాడని, మీవద్దకు రావడానికి కూడా చార్జీలకు డబ్బులు లేవని చెపుతుంటారు. అలాంటి వారి వద్దకు తమ వద్ద నున్న వాలంటీర్లను పంపి.... భోజనము పెట్టించి, చార్జీలిచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి... వైద్యం చేయించి పంపేవారు. ఆవిధంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు గాక ఇప్పటి వరకు 8446 మంది పేదవారైన చిన్న పిల్లలకు మెరుగైన వైద్యాన్నందించి వారి ముఖంలో చిరునవ్వును, వారి తల్లి దండ్రుల కళ్ళలో ఆనందాన్ని చూడ గలిగారు డాక్టర్ సాయి లక్ష్మి.[5][6]

స్పూర్తి[మార్చు]

డాక్టర్ సాయి లక్ష్మి చేస్తున్న సేవను స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాదులోనూ కొంతమంది వైద్యులు ఏకం సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పురస్కారము[మార్చు]

వీరు చేస్తున్న సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వము వీరిని ప్రతిష్ఠాత్మకమైన నారిశక్తి పురస్కారాన్ని ప్రపంచ మహిళాదినోత్సవమైన మార్చి 8 న ఇచ్చి సత్కరించింది.[7]

వివాహము[మార్చు]

పేదవారైన చిన్న పిల్లల ఆరోగ్య విషయములో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న తన పెళ్ళి విషయమే గుర్తుకు రాలేదంటున్నారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]