బలిజేపల్లి సీతారామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బలిజేపల్లి సీతారామయ్య (1885 - 1947) సుప్రసిద్ధ కర్ణాటక సంగీత గాయకులు. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు వీరికి అన్నయ్య. వీరి తల్లిదండ్రులు నరసింహశాస్త్రి, ఆదిలక్ష్మమ్మ. సంగీత విద్వాంసులైన తండ్రి వద్ద మొదట సంగీతవిద్యలోని ప్రాథమిక విషయాలు నేర్చుకొన్నారు. అన్నగారి ప్రోత్సాహంతో చిన్నతనంలో నాటకాలలో వేషాలు వేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. తర్వాత ప్రయాగ తిరుమలయ్య వద్ద సంగీత కళా రహస్యాలు నేర్చుకున్నారు. రాగ తాన గానాలలోను, త్రిశ మిశ్రాది గతిభేదపు పల్లవులను పాడటంలోను వీరికి సామర్థ్యం ఎక్కువ.

వీరి శిష్యులలో దెందుకూరి శివరామయ్య, మహావాది వెంకటప్పయ్య ప్రముఖులు.

వీరి కుమారుడు బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి పేరుపొందిన సంగీత పండితులు.