Jump to content

బల్దేవ్ ఉపాధ్యాయ

వికీపీడియా నుండి
బల్దేవ్ ఉపాధ్యాయ
జననం(1899-10-10)1899 అక్టోబరు 10
మరణం1999 ఆగస్టు 10(1999-08-10) (వయసు: 99)
జాతీయతభారతీయుడు
పాఠశాల/కళాశాలలుబనారస్ హిందూ విశ్వవిద్యాలయం
పురస్కారాలుపద్మభూషణ్

బల్దేవ్ ఉపాధ్యాయ (10 అక్టోబర్ 1899 – 10 ఆగస్టు 1999) ప్రముఖ హిందీ, సంస్కృత పండితుడు, సాహిత్య చరిత్రకారుడు, వ్యాసకర్త, విమర్శకుడు. ఇతను అనేక పుస్తకాలు, వ్యాస సంకలనాలు, సంస్కృత సాహిత్య చరిత్రను రచించాడు. సంస్కృత సాహిత్యాన్ని హిందీలో చర్చించడంలో ఇతను ప్రసిద్ధి చెందాడు. అంతకుముందు సంస్కృత సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా సంస్కృతం లేదా ఆంగ్లంలో ఉండేవి.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతను 1899 అక్టోబర్ 10న బ్రిటిష్ ఇండియా లోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, బలియా జిల్లా లోని సోన్‌బర్సా గ్రామంలో జన్మించాడు. తండ్రి పండిట్ రామ్ సుచిత్ ఉపాధ్యాయ భాగవత పురాణంలో గొప్ప పండితుడు, తల్లి మూర్తి దేవి. ఇతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు.

ఉపాధ్యాయ ప్రాథమిక విద్య బలియా లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. 1911–1912 మధ్యలో బెనారస్ లోని బెంగాలీ టోలా ఇంటర్ కాలేజీలో 6వ తరగతి చదివాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (1922), బెనారస్ లోని ప్రభుత్వ సంస్కృత కళాశాల నుండి సాహిత్యాచార్య పట్టా పొందాడు.[మూలం అవసరం]

పండిట్ యోగేశ్ దత్ ఓజా మనవరాలు, పండిట్ దేవ్ కృష్ణ ఓజా కుమార్తె అయిన శివముని దేవితో ఇతని వివాహం జరిగింది. పండిట్ యోగేశ్ దత్ ఓజా సంస్కృత పండితుడు, వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం ప్రచురించిన పరిభాషేందు శేఖర్ రచయిత.

ఇతను తన శతజయంతి సంవత్సరమైన 1999 ఆగస్టు 10న వారణాసిలో మరణించాడు.[1] ఇతనికి ఇద్దరు కుమారులు. డాక్టర్ జి.ఎస్. ఉపాధ్యాయ అనే కుమారుడు ఐఐటి కాన్పూర్ లో మెటీరియల్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. అతను విభాగాధిపతిగా కూడా పనిచేశాడు. ప్రొఫెసర్ జి.ఎస్. ఉపాధ్యాయ కోవిడ్-19 కాలంలో (2020–21) మరణించాడు. బల్దేవ్ ఉపాధ్యాయ మనవడు డాక్టర్ అనీష్ ఉపాధ్యాయ ప్రస్తుతం ఐఐటి కాన్పూర్ లోని మెటీరియల్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉన్నాడు.

ప్రధాన రచనలు

[మార్చు]

1922లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని సంస్కృత విభాగంలో అధ్యాపకుడిగా నియమితుడయ్యాడు. ఆ సంస్థలో 38 ఏళ్లపాటు సేవలందించి, 1960లో విభాగాధిపతిగా పదవీ విరమణ చేశాడు. 1968లో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం లోని పరిశోధనా సంస్థకు డైరెక్టర్ గా, ప్రొఫెసర్ ఎమెరిటస్ గా నియమించబడ్డాడు. లక్నోలోని ఉత్తర ప్రదేశ్ సంస్కృత అకాడమీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.[2]

పరిశోధనా సంస్థ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, సరస్వతీ భవన గ్రంథమాల పుస్తక శ్రేణికి, సరస్వతీ సుషమ అనే సంస్కృత పత్రికకు ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించాడు. ఇతను అనేక పుస్తకాలను రచించాడు. ఇవి ఆయా రంగాలలో ప్రామాణికమైనవిగా గుర్తింపు పొందాయి. సుమారు 25 పుస్తకాలను సవరించాడు.[3]

అవార్డులు, పురస్కారాలు

[మార్చు]
  • మంగళా ప్రసాద్ పురస్కారం, 1942
  • డాల్మియా పురస్కారం, 1946
  • శ్రావణ-నాథ్ పురస్కారం
  • సాహిత్య వారిధి, ప్రయాగ, 1972
  • డి.లిట్., 1977
  • గౌరవ ధృవీకరణ పత్రం, 1968లో భారత రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ ద్వారా ప్రదానం చేయబడింది.
  • కాళిదాస్ సాహిత్య రత్న, ఉజ్జయిని, 1982
  • విశ్వ సంస్కృత భారతి అవార్డు, యు.పి. సంస్కృత అకాడమీ, 1983.
  • పద్మభూషణ్, 1984లో భారత రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ద్వారా ప్రదానం చేయబడింది.[4]
  • ఉమాస్వామి అవార్డు, కుంద కుంద భారతి ఛారిటబుల్ ట్రస్ట్, న్యూఢిల్లీ, 1994[మూలం అవసరం]
  • మహామహోపాధ్యాయ, 1997[మూలం అవసరం]
  • రామకృష్ణ డాల్మియా శ్రీ వాణి అవార్డు, రామకృష్ణ డాల్మియా ట్రస్ట్, న్యూఢిల్లీ[మూలం అవసరం]

పుస్తకాలు

[మార్చు]

ఉపాధ్యాయ పుస్తకాలు రాయడానికి హిందీ మాధ్యమాన్ని ఎంచుకున్నాడు. అతను రాయడం ప్రారంభించినప్పుడు హిందీ భాషలో సంస్కృత సాహిత్యంలోని అన్ని శాఖలపై ప్రామాణిక పుస్తకాలు లేవు.

పుస్తకం పేరు ప్రచురణకర్త సంవత్సరం
రసిక గోవింద ఔర్ ఉన్ కీ కవిత (Rasika Govinda Aur Unki Kavita) హిందీ నగరి ప్రచారిణి సభ, బలియా. 1926
సూక్తి ముక్తావళి (Sukti Muktavali) హరిదాస్ కంపెనీ, మథుర 1932
సంస్కృత కవి చర్చ (Sanskrit Kavi Charchā) మాస్టర్ ఖేదిలాల్, వారణాసి 1932
భారతీయ దర్శన (Bhartiya Darshana) శారదా మందిర్, వారణాసి 1942
సంస్కృత సాహిత్య కా ఇతిహాస్ (Sanskrit Sahitya Ka Itihas) శారదా మందిర్, వారణాసి 1944
ధర్మ ఔర్ దర్శన (Dharma aur Darshana) శారదా మందిర్, వారణాసి 1945
సంస్కృత వాఙ్మయ (Sanskrit Vangmaya) శారదా మందిర్, వారణాసి 1945
వైదిక కహానియా (Vaidika Kahaniya) శారదా మందిర్, వారణాసి 1946
బౌద్ధ దర్శన మీమాంస (Bauddha Darsana Mimansa) శారదా మందిర్, వారణాసి 1946
ఆర్య సంస్కృతి కే మూలాధార (Arya Sanskriti Ke Muladhara) శారదా మందిర్, వారణాసి 1947
భారతీయ సాహిత్య శాస్త్ర (Bhartiya Sahitya Shastra) ప్రసాద్ పరిషత్, వారణాసి 1948
భాగవత సంప్రదాయ (Bhagvata Sampradaya) నగరి ప్రచారిణి సభ, వారణాసి 1954
వైదిక సాహిత్య ఔర్ సంస్కృతి (Vaidika Sahitya Aur Sanskriti) శారదా సంస్థాన్, వారణాసి 1955
సంస్కృత ఆలోచన (Sanskrit Alochana) యు.పి. సంస్కృత సంస్థాన్, లక్నో 1956
కావ్యానుశీలన (Kavyanushilana) రమేష్ బుక్ డిపో, జైపూర్ 1956
భారతీయ వాఙ్మయ మే శ్రీరాధ (Bhartiya Vangmaya Mein Sri Radha) బీహార్ రాష్ట్రభాష పరిషత్, పాట్నా 1963
సంస్కృత సుకవి సమీక్ష (Sanskrit Sukavi Samikchha) చౌకంబ విద్యా భవన్, వారణాసి 1963
పురాణ విమర్శ (Purana Vimarsha) చౌకంబ విద్యా భవన్, వారణాసి 1965
సంస్కృత శాస్త్రోం కా ఇతిహాస్ (Sanskrit Shashtron Ka Itihas) చౌకంబ విద్యా భవన్, వారణాసి 1969
భారతీయ ధర్మ ఔర్ దర్శన (Bhartiya Dharma Aur Darshana) చౌకంబ విద్యా భవన్, వారణాసి 1977
సంస్కృత సాహిత్య కా సంక్షిప్త ఇతిహాస్ (Sanskrit Sahitya Ka Sanksipta Itihas) శారదా సంస్థాన్, వారణాసి 1978
కాశీ కి పాండిత్య పరంపర (Kashi Ki Panditya Parampara) శారదా సంస్థాన్, వారణాసి 1985
భారతీయ ధర్మ ఔర్ దర్శన కా అనుశీలన్ (Bhartiya Dharma aur Darshana Ka Anushilan) శారదా సంస్థాన్, వారణాసి 1985
విమర్శచింతామణిః (Vimarshachintamanih) శారదా సంస్థాన్, వారణాసి 1987

మూలాలు

[మార్చు]
  1. Sanskrit Sadhana, Vidya_Niwas_Mishra Ayas Bharati Publication, Saharanpur, 1990.
  2. Baldev Upadhyaya Felicitation Volume, (Ed.) G.C. Tripathi, Journal of the Ganganath_Jha, Kendriya Sanskrit Vidyapeeth, Allahabad, 1983.
  3. Shemushi, (Ed) Vidya_Niwas_Mishra, Sharda Niketan, Varanasi, 2000.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.