Jump to content

బల్లి

వికీపీడియా నుండి

బల్లులు
Temporal range: జురాసిక్ - Recent
Central bearded dragon, Pogona vitticeps
Scientific classification
Kingdom:
Phylum:
Superclass:
Class:
Order:
Suborder:
Günther, 1867

బల్లి (ఆంగ్లం Lizard) ఒక సరీసృపము.

బల్లులలో రకాలు

ఈ బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు తుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని అంటే అది కరవదు ...... గాని అది ఇళ్లలో తిరుగుతుంటుండి గనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక ఆపోహ ఉంది. అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం వుండదని నమ్మిక. అదే విధంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్ఫలితం వుండదని కూడా ప్రజల్లో ఓ మూఢ నమ్మకముంది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాల గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=బల్లి&oldid=2329093" నుండి వెలికితీశారు