బవనక సందీప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బవనక సందీప్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు బవనక పరమేశ్వర్ సందీప్
జననం (1992-04-25) 1992 ఏప్రిల్ 25 (వయసు 31)
హైదరాబాదు, తెలంగాణ
బ్యాటింగ్ శైలి ఎడమచేతి వాటం
బౌలింగ్ శైలి ఎడమచేతి ఆర్థోడాక్స్ స్పిన్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2010-ప్రస్తుతం హైదరాబాదు క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ లిస్టు-ఎ ట్వంటీ20
మ్యాచులు 58 48 38
సాధించిన పరుగులు 3,631 1,343 734
బ్యాటింగ్ సగటు 44.82 32.75 28.23
100 పరుగులు/50 పరుగులు 7/21 0/8 0/2
ఉత్తమ స్కోరు 203 నాటౌట్ 96 74 నాటౌట్
వేసిన బాల్స్ 1,487 783 321
వికెట్లు 12 18 7
బౌలింగ్ సగటు 72.08 32.88 54.42
ఇన్నింగ్స్ లో వికెట్లు 0 1 0
మ్యాచులో 10 వికెట్లు 0 0 0
ఉత్తమ బౌలింగు 4/57 5/26 2/14
క్యాచులు/స్టంపింగులు 41/– 28/– 19/–
Source: Cricinfo, 6 మే 2020 {{{year}}}

బవనక పరమేశ్వర్ సందీప్, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఫస్ట్-క్లాస్ క్రికెటర్ గా హైదరాబాద్ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు.[1] 2017-18 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున నాలుగు మ్యాచ్‌లలో 400 పరుగులు చేసి, అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[2]

2018 జూలైలో 2018-19 దులీప్ ట్రోఫీ కోసం ఇండియా రెడ్ జట్టులో ఎంపికయ్యాడు.[3] 2018 నవంబరులో, 2018-19 రంజీ ట్రోఫీలో కేరళ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ తరపున బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన 3,000వ పరుగును సాధించాడు.[4]

జననం[మార్చు]

సందీప్ 1992 ఏప్రిల్ 25న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం[మార్చు]

ఫస్ట్-క్లాస్[మార్చు]

రంజీ ట్రోఫీ ప్లేట్ లీగ్ లో భాగంగా 2010, నవంబరు 10 నుండి 13 వరకు రాంచీలో జార్ఖాండ్ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్ లో 232 బంతుల్లో 144 పరుగులు చేశాడు.[5] ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 203 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ తో నాటౌట్ గా నిలిచాడు.

లిస్టు-ఎ[మార్చు]

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా 2011, ఫిబ్రవరి 11న పాలక్కడ్ లో ఆంధ్ర క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[6] లిప్టు-ఎ క్రికెట్ లో 96 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ సాధించాడు.

ట్వంటీ20[మార్చు]

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా 2013, మార్చి 17న షిమోగాలో కేరళ క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[7] ట్వంటీ20 క్రికెట్ లో 74 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ తో నాటౌట్ గా నిలిచాడు.

మూలాలు[మార్చు]

  1. "Bavanaka Sandeep". ESPN Cricinfo. Retrieved 2022-07-25.
  2. "Ranji Trophy, 2017/18: Hyderabad batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2022-07-25.
  3. "Samson picked for India A after passing Yo-Yo test". ESPN Cricinfo. 23 July 2018. Retrieved 2022-07-25.
  4. "Ranji Trophy Digest: Mixed Bag For India Stars, New States Take Baby Steps". Network18 Media and Investments Ltd. Retrieved 2022-07-25.
  5. "Full Scorecard of Jharkhand vs Hyderabad Group A 2010/11 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-24. Retrieved 2022-07-25.
  6. "Full Scorecard of Hyderabad vs Andhra South Zone 2010/11 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-05-09. Retrieved 2022-07-25.
  7. "Full Scorecard of Hyderabad vs Kerala South Zone 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-16. Retrieved 2022-07-25.

బయటి లింకులు[మార్చు]