Jump to content

బసవరాజ్ పాటిల్

వికీపీడియా నుండి
బసవరాజ్ మాధవరావు పాటిల్

పదవీ కాలం
2009 అక్టోబర్ 22 – 2019 నవంబర్ 7
ముందు దినకర్ బాబురావు మనే
తరువాత అభిమన్యు పవార్
నియోజకవర్గం ఔసా

మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి
పదవీ కాలం
1999 – 2004

పదవీ కాలం
1999 – 2004
ముందు రవీంద్ర గైక్వాడ్
తరువాత రవీంద్ర గైక్వాడ్
నియోజకవర్గం ఉమర్గా

వ్యక్తిగత వివరాలు

జననం (1957-04-23) 1957 ఏప్రిల్ 23 (age 67)
మురుమ్, ఒమెర్గా ఉస్మానాబాద్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2024 నుండి), భారత జాతీయ కాంగ్రెస్ (2024 వరకు)
తల్లిదండ్రులు మాధవరావు బాపురావు పాటిల్
జీవిత భాగస్వామి ప్రమీలా పాటిల్
సంతానం శరణ్ పాటిల్
నివాసం అన్నపూర్ణ నగర్, ఔసా , లాతూర్ , మహారాష్ట్ర , భారతదేశం
పూర్వ విద్యార్థి యశ్వంతరావు చవాన్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

బసవరాజ్ మాధవరావు పాటిల్ (జననం 23 ఏప్రిల్ 1957) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బసవరాజ్ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 మహారాష్ట్ర ఎన్నికలలో ఉమర్గా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి రవీంద్ర గైక్వాడ్ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1999 నుండి 2004 వరకు మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా పని చేశాడు. ఆయన 2004 మహారాష్ట్ర ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి రవీంద్ర గైక్వాడ్ చేతిలో ఓడిపోయాడు.

బసవరాజ్ పాటిల్ 2009 మహారాష్ట్ర ఎన్నికలలో ఔసా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి దినకర్ బాబురావు మనేపై 14795 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి దినకర్ బాబురావు మనేపై 8,858 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

బసవరాజ్ పాటిల్ 2024 ఫిబ్రవరి 26న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి,[3][4] ఫిబ్రవరి 27న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  2. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  3. "कांग्रेस को एक और झटका, मराठवाड़ा के बड़े चेहरे बसवराज पाटिल ने दिया इस्तीफा". News18 हिंदी. 26 February 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  4. "Maharashtra Congress leader Basavaraj Patil quits, to join BJP today" (in ఇంగ్లీష్). India Today. 27 February 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  5. "Former working president of Maharashtra Congress joins BJP" (in ఇంగ్లీష్). The Indian Express. 28 February 2024. Archived from the original on 12 January 2025. Retrieved 12 January 2025.
  6. "Ex-Maharashtra minister Basavaraj Patil resigns from Congress, joins BJP" (in ఇంగ్లీష్). mint. 27 February 2024. Archived from the original on 19 April 2024. Retrieved 12 January 2025.