బసవ రామ తారకం
Jump to navigation
Jump to search
బసవ రామ తారకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి భార్య. బసవతారకానికి ఎన్టీఆర్ తో 1942 మే నెలలో వివాహం జరిగింది. వీరికి మొత్తం 12 మంది పిల్లలు, వీరిలో ఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కుమార్తెలు. బసవతారకం ఎన్టీఆర్ కి మేనమావ కూతురు. ఈమె 1985లో కాన్సర్ వ్యాధితో మరణించారు. ఈమె జ్ఞాపకార్థం హైదరాబాద్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించబడింది.
కుటుంబం[మార్చు]
తారక రామారావు, బసవతారకం దంపతులకు 12 మంది సంతానం. పన్నెండు మందిలో ఎనిమిది మంది కుమారులు కాగా, నలుగురు కుమార్తెలు. రామకృష్ణ (సీనియర్) జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ (జూనియర్), జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.