బసు భట్టాచార్య
బసు భట్టాచార్య | |
---|---|
జననం | 1934 |
మరణం | 1997 జూన్ 19[1] | (వయసు 62–63)
పిల్లలు | ఒక కుమారుడు (దర్శకుడు ఆదిత్య భట్టాచార్య), ఇద్దరు కుమార్తెలు (చిమ్ము, అన్వేషా ఆర్య-రచయిత) |
పురస్కారాలు | 1967:జాతీయ ఉత్తమ చిత్రం: తీస్రీ కసమ్ 1985: ఫిలింఫేర్ ఉత్తమ సినిమా అవార్డు: స్పర్ష్ |
బసు భట్టాచార్య (1934 - 19 జూన్ 1997) హిందీ సినిమా దర్శకుడు.[2][3] 1966లో తీసిన తీస్రీ కసమ్ సినిమా ద్వారా పేరు పొందాడు. రాజ్ కపూర్, వహీదా రెహమాన్ నటించిన ఈ సినిమా 1967లో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. భట్టాచార్య దర్శకత్వం వహించిన అవిష్కార్ సినిమా అత్యంత ప్రజాదరణ పొందడమేకాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ నటించిన ఈ సినిమాకు బాలీవుడ్ గైడ్ కలెక్షన్స్[4] లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. 1975లో రాజేష్ ఖన్నాకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది.
1979లో భట్టాచార్య నిర్మించిన స్పర్ష్ సినిమాలకు హిందీలో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం వచ్చింది, ఫిలింఫేర్ ఉత్తమ సినిమా అవార్డును కూడా గెలుచుకుంది.[5] 1976 నుండి 1979 వరకు ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.[6] 1981లో 12 వ మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యుడిగా ఉన్నాడు.[7]
జననం
[మార్చు]భట్టాచార్య 1934లో పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా లో జన్మించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]1958లో మధుమతి, సుజాత వంటి సినిమాలకు బిమల్ రాయ్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరి తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. అటు తరువాత బిమల్ రాయ్ కుమార్తె రింకి భట్టాచార్యను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి బిమల్ రాయ్ అంగీకరించడకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.[8][9] భట్టాచార్య దంపతులకు ఒక కుమారుడు (దర్శకుడు ఆదిత్య భట్టాచార్య), ఇద్దరు కుమార్తెలు (చిమ్ము, అన్వేషా ఆర్య-రచయిత) ఉన్నారు. అనేక గృహహింస సంఘటనల తరువాత, అతని భార్య రింకి 1983లో ఇతని నుండి విడిపోయింది. 1990లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. భారతదేశంలో గృహహింసలపై పోరాటానికి రింకి కృషిచేసింది. సంకలనకర్తగా బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ - డొమెస్టిక్ వాయిలెన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని తీసుకొచ్చింది. రచయితగా, కాలమిస్ట్ గా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా రింకి పేరుపొందింది.[10]
సినిమాలు
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]- ఉస్కి కహానీ (1966)
- తీస్రీ కసమ్ (1966) - జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు
- అనుభవ్ (1971)
- ఆవిష్కార్ (1973)
- డాకు (1975)
- తుమ్హారా కల్లూ (1975)
- సంగత్ (1976)
- నోన్ యెట్ నాట్ నోన్ (1977)
- మధు మాల్తి (1978)
- గ్రిహ ప్రవేష్ (1979)
- మధుమాన్ (1981)
- హోర్కే పోడ్జిమ్స్ వూనా మాంగా (1984)
- అన్వేషన్ (1985) (టీవీ)
- సోలార్ ఎనర్జీ (1986)
- సైన్స్ ఇండియా (1986)
- పంచవతి (1986)
- ఏక్ సాస్ జిందగి (1991)
- ఆస్తా: ఇన్ ది ప్రిజన్ ఆఫ్ స్ప్రింగ్ (1997)
మరణం
[మార్చు]1997, జూన్ 19న మహారాష్ట్ర లోని, ముంబై లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Film-maker Basu Bhattacharya dead". Rediff.com. 20 June 1997. Retrieved 24 June 2021.
- ↑ "Basuda, auteur of "sensitive" films dies at 62". The Indian Express. 21 June 1997. Archived from the original on 2010-08-16.
- ↑ Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia of Hindi cinema. (Encyclopædia Britannica (India) Pvt. Ltd), Popular Prakashan. p. 532. ISBN 81-7991-066-0.
- ↑ Collections. Update Video Publication. 1991.
- ↑ "National Film Awards (1979)". Archived from the original on 2016-01-22. Retrieved 2021-06-24.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014). Encyclopedia of Indian Cinema. Routledge. p. 64. ISBN 978-1135943189.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ "12th Moscow International Film Festival (1981)". MIFF. Archived from the original on 21 April 2013. Retrieved 24 June 2021.
- ↑ "A Homage to Basu Bhattacharya". Archived from the original on 29 January 2008. Retrieved 2008-08-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Father’s pictures The Tribune (Chandigarh), 26 August 2001.
- ↑ "Can you beat that?". Archived from the original on 2017-08-28. Retrieved 2021-06-24.
బయటి లింకులు
[మార్చు]- "A Homage to Basu Bhattacharya". Archived from the original on 29 January 2008. Retrieved 2008-08-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)