బస్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనప/గోగునార బస్తా
పాలిథిన్ బస్తా

సరుకుతో నింపబడిన గోతాన్ని బస్తా అంటారు. బస్తా అంటే ఇంత బరువుండాలి, ఇంత పొడవుండాలి, ఇంత వెడల్పు ఉండాలి అని కచ్చితమైన కొలతలు లేవు.

బస్తా అంటే దానిలో నింపబడిన వస్తువును బట్టి, అని వాడే ప్రదేశాన్ని బట్టి అవి ఎంత బరువుంటాయి, ఎంత పొడవు, ఎంత వెడల్పు ఉంటాయి అనే అవగాహన ఉంటుంది. సాధారణంగా పెద్ద బస్తాలు 50-55 సెం.మీ.వెడల్పు,95-100సెం.మీ.పొడవు వుంటాయి.రెండోరకం 40-45 సెం.మీ.వెడల్పు,70-75సెం.మీ.పొడవు వుంటాయి.

గోతాలను జనపనారతోను, గోగు నారతో, పాలిథిన్ దారాలతో, లేదా పాలిథి షీట్ తో ప్లాస్టిక్ తోను, ఇతర దారాల తోను తయారు చేస్తారు. జనపనారతో తయారైన గోతాలు ప్లాస్టిక్ గోతాల కన్నా మన్నిక గాను ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

ఏ వస్తువు ద్వారా గోతం నింపబడుతుందో ఆ వస్తువు పేరును బస్తా అనే పదానికి ముందు చేర్చి ఆ బస్తాగా పిలుస్తుంటారు. ఉదాహరణకు బియ్యంతో నింప బడిన గోతాన్ని బియ్యం బస్తా అని, వడ్లుతో నింపబడిన గోతాన్ని వడ్లు బస్తా అని అంటారు.

బస్తాలలో ధాన్యాన్ని నింపిన బస్తాలను ధాన్యం బస్తాలని, సిమెంట్ నింపిన బస్తాలను సిమెంట్ బస్తాలని, సున్నంతో నింప బడిన గోతాలను సున్నం బస్తాలని అంటారు.

ద్రవ రూపంలో ఉండే వస్తువులను గోతాలలో నింపవలసినప్పుడు ఆ ద్రవాన్ని చిన్న చిన్న ప్యాకెట్ లలో నింపి వాటిని గోతాలలో నింపుతారు. ఉదాహరణకు మంచినీరును చిన్న చిన్న ప్యాకెట్ లకు నింపి వాటిని గోతాలలో నింపి వాటిని సరఫరా చేస్తుంటారు. బస్తాలలో నింపు వస్తువుల భారం వాటి యొక్క సాంద్రత మీద ఆధారపడి వుండును.ఎక్కువ సాంద్రత వున్న వస్తువులు ఎక్కువ బరువు, తక్కువ సాంద్రత వున్నవి తక్కువ బరువు వుండును.

20 కిలోల బరువుండే ఒక వాటర్ బస్తాలో సుమారు వంద నీళ్ళ ప్యాకెట్లు ఉంటాయి.

25 కిలోల బరువుండే ఒక బియ్యం బస్తా పరిమాణంలో సిమెంట్ బస్తా 50 కిలోల బరువును కలిగి ఉంటుంది.

బస్తా అనేది ఒక సాధారణ వ్యక్తి మోయగలిగిన బరువును కలిగి ఉంటుంది. సరుకులను ఒకప్రాంతం నుండి మరోప్రాంతానికి లారి, బస్సు, బండి వంటి వాటిద్వారా పంపవలసి నప్పుడు బస్తాలలో నింపి రవాణా చెయుదురు.అలాగే సరుకులను నిల్వ చేయ్య వలసినప్పుడు కూడా బస్తాలలో నింపి నిలవ చేయుదురు.బస్తాలలో నింపడం వలన సరుకులు లూస్ గా వున్నపటికన్న తక్కువ ప్రదేశం అక్రమించును

బస్తా బరువు అవగాహన కోసం

[మార్చు]

రేషన్ షాపుకు వేసే బియ్యం బస్తా బరువు 50 కిలోలు

కిరణా షాపులో అమ్మే బియ్యం బస్తా బరువు 25 కిలోలు

సిమెంట్ బస్తా బరువు 50 కిలోలు

ఎరువుల బస్తా బరువు 25 నుంచి 50 కిలోలు

దళారులు ధాన్యాన్ని కాటావేసేటప్పుడు 50 నుంచి 100 కిలోలు

హుక్

[మార్చు]

ధాన్యం వంటి బస్తాలను వ్యక్తులు ఒక చోటు నుండి మరొక చోటుకు మోయవలసినపుడు పట్టుకోసం హుక్ లను ఉపయోగిస్తుంటారు.

బస్తాలను సులభంగా ఊడదీసే పద్ధతి

[మార్చు]

బస్తాలకు యంత్రాల ద్వారా వేయబడిన కుట్టుని ఒక టెక్నిక్ ద్వారా సులభంగా ఊడదీయవచ్చు. కుట్టులో ఉన్న మొదటి చిక్కును విడదీసి దారాన్ని లాగినప్పుడు తరువాత చిక్కులని అత్యంత వేగంగా విడిపోతాయి.

మొదటి చిక్కును విడదీయడం నేర్చుకునేటప్పుడు కొంచెంగా కష్టంగా ఉన్నప్పటికి తరువాత మొదటి చిక్కును కూడా విడదీయడం చాలా సులభంగా ఉంటుంది.

పాలిథిన్/ప్లాస్టిక్ బస్తాల వలన హాని

[మార్చు]

జనపనార లేదా గోగునారతో చేసిన బస్తాలు/గోతాలు అవి పాత బడి పోయాక ఇవి జీవ ఉత్పత్తులు కావున, సహజంగానే నశీంచి పర్యావరణానికి హాని కలిగించని విధంగా మట్టిలో జీర్ణించిపోవును.కాని పాలిథిన్/ప్లాస్టిక్ బస్టాలు అలాకాదు కొన్ని వందలసంవత్సరాలైన అలాగే వుండిపోతాయి.ముందుతరాలు మంచి పర్యావరణ వాతావరణ పరిస్థితులలో జీవించాలంటే సింథటిక్ బస్తాలను, సంచులను వాడటం తగ్గించాలి.జనపనార, గోగునార పంటల సాగును ప్రొత్యాయించాలి.జీవ నారతో బస్తాలను చేయు పరిశ్రమలను ప్రోత్యాయించాలి, పన్ను రాయితిలను ప్రకటించాలి.

బస్తాలలో సరుకు నిల్వ వుంచునప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు

[మార్చు]

సరుకులను బస్తాలలో నిల్వ వుంచునప్పుడు బస్తాలకు గాలి తగినంతగా అందేలా, కొన్ని వరుసల తరువాత ఖాళీ వదలి నిల్వ చెయ్యాలి. 10 అడుగులకు మించి ఎత్తు వచ్చేలా బస్తాలను పేర్చరాదు. ఎక్కువ ఎత్తు వచ్చేలా పేర్చినచో పై వరుసలోని బస్తాల బరువు క్రింది బస్తాల మీద ప్రభావం చూపి, దగ్గరగా నొక్కబడి, తేమ అధికంగా వున్నప్పుడు వేడి పుట్టి అగ్ని ప్రమాదం జరుగును. శీతల గిడ్డంగులలో, పరిశ్రమలలోని గోదాంలలో ఇలా నిల్వ వుంచినప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వేడిగా వున్న సరుకును బస్తాలలో నింపినప్పుడు చల్లబడిన తరువాతనే బస్తామూతిని కుట్టి నిల్వచేయాలి. అడుగు భాగంలోకూడా గాలి అందెలా కొన్ని చెక్కపలకలను అమర్చి వాటిపై న బస్తాలను వరుసగా పేర్చాలి. వేడిగా వున్న ప్రదేశంలో నిల్వ వుంచరాదు. బస్తాలలో సరుకు నిల్వ వుంచిన గోదాంలలో ఒకోసారి విద్యుతు షార్ట్ సర్కుట్ వలన ప్రమాదం చోటు చేసుకొనును. అందుచే ఎలక్ట్రికల్ వైరింగ్ సురక్షితంగా వుండాలి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బస్తా&oldid=2888593" నుండి వెలికితీశారు