బహుపిండత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒకే విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండే స్థితిని బహుపిండత (Polyembryony) అంటారు. బహుపిండత వివృతబీజాలలో సాధారణముగా ఉండే స్థితి. ఆవృతబీజాలలో కొన్ని జాతులలో మాత్రమే కనిపిస్తుంది. ఉదా: సిట్రస్, మాంజిఫెరా, క్రోటలేరియా, నికోటియానా.

18వ శతాబ్దంలో లీవెన్ హాక్ నారింజ విత్తనాలలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలున్నాయని మొదటిసారిగా వర్ణించాడు.

రకాలు[మార్చు]

ఆవృతబీజాలలోని బహుపిండతను రెండు రకాలుగా గుర్తించారు. అవి 1. నిజమైన బహుపిండత 2. మిధ్యా బహుపిండత

  • మిధ్యా బహుపిండత (False Polyembryony) : ఒకే అండాంతః కణాజాలములో గల రెండు లేక అంతకంటే ఎక్కువ పిండకోశాల నుండి గాని లేక రెండు అంతకంటే ఎక్కువ అండాంతః కణజాలాల సంయోగం వల్ల కాని ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఏర్పడితే దానిని మిధ్యా బహుపిండత అంటారు.

ఉదాహరణ : సిట్రస్, పోవ ప్రటెన్సిస్.

  • నిజమైన బహుపిండత (True Polyembryony) : ఒకే పిండకోశంలో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఏర్పడితే, దానిని నిజమైన బహుపిండత అంటారు. ఈ పిండాలు స్త్రీ బీజకణము చీలడం వలన గాని, సహాయకణాల నుండి గాని, ప్రతిపాద కణాల నుండి, అండాంతః కణజాలమునుండి గాని, అండకవచ కణాల నుండి గాని ఏర్పడతాయి.

కారణాలు[మార్చు]

  • 1. సంకరణము (Hybridization)
  • 2. నెక్రో హార్మోను సిద్ధాంతము ప్రకారము నశించుచున్న అండాంతః కణజాలము నుండి స్రవించే పదార్థాలు వాటి ప్రక్కన గల కణాలను ప్రేరేపించి పిండాలు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=బహుపిండత&oldid=1998680" నుండి వెలికితీశారు