బహుమతి ప్రదాత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్రాల ఆటల ఒక ఆటోమోటివ్ కంపెనీ స్పాన్సర్షిప్.

గెలిచిన వారికి బహుమతులను ప్రదానం చేసే వ్యక్తిని బహుమతి ప్రదాత అంటారు. ఇతనిని ఆంగ్లంలో స్పాన్సర్ అంటారు. బహుమతిని ప్రదానం చేయడం ద్వారా గెలుచుకున్న విజేతలతో పాటు గెలుపొందని వారికి కూడా తదుపరి బహుమతిని సొంతం చేసుకోవాలనే ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపుతారు. బహుమతిని ప్రదానం చేసే వ్యక్తి లేదా సంస్థ పోటీ ప్రారంభంలో ముందుగానే తాము ఇవ్వాలనుకున్న బహుమతి గురించి వెల్లడిస్తారు వీరిలో వాణిజ్య బహుమతి ప్రదాతలు కూడా ఉంటారు. వాణిజ్య బహుమతి ప్రదాతలు అనగా తమ పేరు కోసం లేదా తమ వాణిజ్య సంస్థ అభివృద్ధి కోసం తాము ఇవ్వాలనుకున్న బహుమతిని ముందుగానే ప్రకటించి తద్వారా తమ సంస్థ ప్రాచుర్యం పొంది లాభపడాలనుకునేవారు. ప్రస్తుతం బాగా క్రేజ్ ఉన్న క్రికెట్ ఆటపై వాణిజ్య బహుమతి ప్రదాతలు దృష్టి సారిస్తున్నారు. కొందరు బహుమతి ప్రదాతలు ముఖ్యంగా చదువులో మంచి మార్కులు సాధించిన వారికి తాము ముందుగా బహుమతిని ప్రకటించకపోయినప్పటికి బహుమతులను అందజేస్తున్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]