బాండిట్ క్వీన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Bandit Queen
దస్త్రం:Bandit Queen 1994 film poster.jpg
Film poster
దర్శకత్వము Shekhar Kapur
నిర్మాత Bobby Bedi
రచన Ranjit Kapoor (dialogue)
Mala Sen
తారాగణం Seema Biswas
సంగీతం Nusrat Fateh Ali Khan
Roger White
కూర్పు Renu Saluja
డిస్ట్రిబ్యూటరు Koch Vision, USA 2004 (DVD)
విడుదలైన తేదీలు 9 September 1994
నిడివి 119 min.
దేశము India
భాష Hindi

బాండిట్ క్వీన్ అనే భారతదేశ చలన చిత్రము 1994లో ఫూలన్ దేవి జీవితం ఆధారంగా తీయబడింది. దీనికి శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. సీమ బిస్వాస్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చలనచిత్రాన్ని బాబి బేడి యొక్క కేలడోస్కోప్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ నిర్మించింది.ఉస్తాద్ నుస్రత్ ఫతెహ్ అలీ ఖాన్ గారు దీనికి సంగీతం రూపొందించారు.

కథాంశం[మార్చు]

ఈ చిత్రం 1968 వేసవి కాలంలో ఉత్తర ప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామంలో మొదలౌతుంది. పదకొండు సంవత్సరాల వయస్సు ఉన్న ఫూలన్ కు (సునీత భట్ట్ ఈ పాత్రలో నటించారు)[1] సుమారు ఇరవై సంవత్సరాల కంటే వయసు పైబడిన పుట్టిలాల్ అనే వ్యక్తితో (ఆదిత్య శ్రీవాస్తవ) వివాహం జరుగుతుంది. ఆ కాలంలో బాల్య వివాహాలు ఆచారంగా ఉన్నప్పటికీ ఫూలన్ తల్లి మూల (సావిత్రి రేక్వర్) ఆ జంట వయసుకున్న తేడా వల్ల ఆ వివాహానికి అడ్డు చెబుతుంది. ముసలివాడైన ఫూలన్ తండ్రి దేవిదీన్ (రామ్ చరణ్ నిర్మల్కర్) కనికరం లేకుండా వివాహానికి అంగీకరించి ఫూలన్ ను పుట్టిలాల్ తో పంపిస్తాడు.

ఫూలన్ లైంగిక మరియు మానసిక వేదింపులకు గురి అవటమే కాక కులవ్యవస్థ దౌష్ట్యానికి కూడా గురి అయినది. (ఫూలన్ కుటుంబం మరియు పుట్టిలాల్ కుటుంబం మాల అనే తక్కువ శ్రేణి కులానికి చెందినవారు. ఠాకూర్ అనే ఉన్నత శ్రేణి కులం సాంఘికమైన మరియు రాజకీయ సంబంధమైన ఆదిపత్యాన్ని కలిగి ఉండేది.) పుట్టిలాల్ ఫూలన్ ను లైంగికంగా మరియు శారీరరకంగా వేదించేవాడు. ఫూలన్ అప్పుడప్పుడు ఇంటి నుండి పారిపోయి చివరికి తిరిగి ఇంటికి వస్తుండేది. ఫూలన్ వయసు పెరిగిన పిదప ఆమెకు ఇష్టం లేకుండానే ఠాకూర్ కులానికి చెందిన పురుషులు ఆమెను తాకటము వంటి అసభ్య ప్రవర్తనను కనబరిచేవారు (ఆ ఠాకూర్ యొక్క పెద్దలు పంచాయితిని లేక గ్రామ దొరతనము నిర్వహిస్తారు. తదుపరి పట్టణ సమావేశంలో, ఆమెను నిమ్న జాతికి చెందిన దానిగా బావించే ఉన్నత కులాలకు చెందిన పురుషుల యొక్క లైంగిక వాంఛలను తీర్చటానికి ఆమె వప్పుకోని కారణం చేత, పంచాయతి తన యొక్క పితృస్వామిక ఆదిపత్యాన్ని, ఫూలన్ ని గ్రామము నుండి బహిష్కరించటం ద్వారా నిరూపించుకున్నది.

పంచాయతి తీర్పు ప్రకారము ఆమె తన సోదరుడు కైలాష్ (సౌరభ్ శుక్ల)తో కలిసి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మరొక గ్రామానికి ప్రయానమవుతూ, మార్గ మధ్యంలో ఆమె విక్రం మల్లః మస్తాన (నిర్మల్ పాండే) నాయకత్వంలోని బాబు గుజ్జర్ ముటాకి చెందిన బందిపోటు గుంపును కలుస్తుంది. ఫూలన్ కొంత కాలం కైలాష్ తో కలసి ఉంటుంది కాని కాలక్రమములో తప్పనిసరి పరిస్థితులలో అతనిని విడవవలసి వస్తుంది. కోపోద్రిక్తురాలైన మరియు నిస్సహాయ స్థితిలోని ఫూలన్ స్థానిక పోలీసుల వద్దకు (ఆమె పై ఉన్న బహిష్కారాన్ని తొలగించుకొనేందుకు) వెళుతుంది, కాని ఆమె వాళ్ళచే కొట్టబడి, లైంగికంగా వేదించబడి మరియు వాళ్ళచే నిర్భందించబడుతుంది అంతేకాక ఆమె నిర్భంధంలో ఉండగా పోలీసులు ఆమె పై అత్యాచారం చేయటం జరుగుతుంది. ఠాకూర్ లు ఆమెకు జామీను వచ్చి విడుదల అయ్యేలా చూస్తారు. కాని ఆమెకు తెలియనిది ఏమిటంటే వచ్చిన జామీను లంచం ద్వారా వచ్చినదని (పోలీసుల ద్వారా బాబు గుజ్జర్ ముటాకి చెల్లించబడినది) మరియు బాబు గుజ్జర్ అతని యొక్క బహుమతిని పొందటానికి వస్తాడు.

1979 మే నెలలో ఫూలన్ బాబు గుజ్జర్ (అనిరుద్ అగర్వాల్) చేత అపహరించబడుతుంది. గుజ్జర్ కటినమైన, పైసాచిక ప్రవర్తన కలిగి, తనకు బందీలుగా ఉన్న వారితో తన అవసరాలను గడుపుకోనేవాడు మరియు డబ్బు కోసం నిర్దయగా ఏ పని అయినా చేసేవాడు. గుజ్జర్ అనుచరుడు అయిన విక్రమ్ ఫూలన్ పట్ల జాలితో ఉన్నప్పటికీ, గుజ్జర్ ఆమెను నిర్దాక్షిణ్యంగా పైశాచికంగా హింసిస్తుంటాడు. చివరకు ఒక రోజు గుజ్జర్ ఫూలన్ పై అత్యాచారం చేస్తుండగా విక్రమ్ పట్టుకొని గుజ్జర్ ను తలలో కాలుస్తాడు. తరువాత విక్రమ్ ముటాను తన ఆధీనంలోకి తీసుకొంటాడు. విక్రానికి ఫూలన్ పట్ల ఉన్న అవగాహన క్రమంగా పరస్పర సమ్మతమైన మరియు పరస్పర గౌరవంతో కూడిన పరిణితి చెందిన బందంగా మారుతుంది. ఆ సమయంలోనే ఫూలన్ ఆమె యొక్క మాజీ భర్త అయినటువంటి పుట్టిలాల్ వద్దకు వెళుతుంది, మరియు విక్రమ్ సహాయంతో అతనిని బంధించి ఆమె పై అత్యాచారం చేసినందుకు మరియు హింసించినందుకు అతనిని కొట్టటం ద్వారా తన శైలిలో తగిన న్యాయం చేస్తుంది. ఆమె విక్రమ్ కు దగ్గరవుతుంది.

ఠాకూర్ శ్రీరామ్ (గోవింద్ నందే) జైలు నుండి విడుదల అయ్యేవరకు అంతా సవ్యంగానే సాగుతుంది. ఠాకూర్ శ్రీ రామ్ అసలైనటువంటి ముఠా నాయకుడు (మునుపటి గుజ్జర్ కి నాయకుడు). శ్రీరామ్ తిరిగి తన ముఠా వద్దకు చేరుకుంటాడు మరియు విక్రమ్ అతనిని సగౌరవంగా ఆహ్వానిస్తాడు కాని శ్రీరామ్ విక్రమ్ యొక్క సమానత్వ సిద్దాంతాలతో కూడిన నాయకత్వ లక్షణాల పట్ల తలబిరుసుగా ప్రవర్తించి ఫూలన్ ని స్వంతం చేసుకోవాలని కాంక్షిస్తాడు. 1980 ఆగష్టు నెలలో శ్రీరామ్, విక్రమ్ ని చంపి మరియు ఫూలన్ ని బంధించి బెహ్మై అనే గ్రామానికి తీసుకొని వచ్చేలా ఏర్పాట్లు చేస్తాడు. శ్రీరామ్ యొక్క పూర్వపు ప్రయత్నాలను గౌరవించనందుకు మరియు అందరితో సమానంగా ఉన్నందుకు శ్రీరామ్ చేత మరియు ఇతర ముఠా సభ్యుల చేత ఫూలన్ పదే పదే అత్యాచారానికి గురి అవుతుంది మరియు వారి చేత కొట్టబడుతుంది. ఆమె నగ్నంగా బెహ్మై గ్రామం చుట్టూ నడవటము, కొట్టబడుట మరియు నీళ్ళు తీసుకోని వచ్చుటకు బావి వద్దకు పంపబడటము (గ్రామస్తులందరూ చూస్తుండగా) అత్యంత దిగ్బ్రాంతికి గురిచేసే మరియు వేదించే శిక్ష.

అత్యంత బాధించబడిన ఫూలన్ ఆమె సోదరుడు కైలాష్ వద్దకు తిరిగి వస్తుంది. ఆమె కాలక్రమంలో బాధను మరచి విక్రమ్ మల్లః పాత మిత్రుడైనటువంటి మాన్ సింగ్ (మనోజ్ బాజ్ పాయ్) ను చేరుకుంటుంది. మాన్ సింగ్ ఆమెను బాబా ముస్తకిం (రాజేష్ వివేక్) నాయకత్వంలోని వేరొక పెద్ద ముఠా వద్దకు తీసుకొని వస్తాడు. ఆమె బాబా ముస్తకింకు తన చరిత్ర అంతా వివరించి ఆమె స్వంతంగా ముఠాను ఏర్పాటు చేసుకోవటానికి కొంత మంది పురుషులను మరియు ఆయుధాలను ఇవ్వమని కోరుతుంది. బాబా ముస్తకిం దానికి అంగీకరించడంతో మాన్ సింగ్ మరియు ఫూలన్ కొత్త ముఠాకు నాయకులవుతారు.

ఫూలన్ తన కొత్త ముఠాను ధైర్యంతో, ఉదార బుద్ధితో, వినయంతో మరియు ప్రతిభతో నడిపిస్తుంది. ఆమె యొక్క సామగ్రి నిలువలు మరియు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆమె బందిపోటు రాణి ఫూలన్ దేవిగా ప్రఖ్యాతి చెందుతుంది. 1981 ఫిబ్రవరి నెలలో, బాబా ముస్తకిం ఆమెకు ఠాకూర్ శ్రీరామ్ హాజరు అయ్యేటువంటి ఒక పెద్ద వివాహానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాడు. ఫూలన్ వెళ్ళేటప్పుడు బాబా ముస్తకిం ఆమెను తక్కువ తీవ్రతతో వ్యవహరించమని హెచ్చరిస్తాడు. ఫూలన్ వివాహ ఉత్సవం పై దాడి చేస్తుంది మరియు ఆమె యొక్క ముఠా బెహ్మైకి చెందిన ఠాకూర్ సంతతి అంతటి పై పగ సాధిస్తారు. వారు పురుషులను చుట్టుముట్టటమే కాక వారిని కొడతారు. చాలా మంది పురుషులు చివరకి కాల్చబడతారు. ఈ కక్ష సాధింపు చర్య ఆమెను జాతీయ న్యాయ విచారణ విభాగం (న్యూఢిల్లీలో కల) దృష్టికి తెస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు ఫూలన్ కోసం విస్త్రుతమైన గాలింపు చేపడతారు మరియు ఠాకూర్ శ్రీరామ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి సహాయాన్ని కోరతాడు.

ఈ గాలింపు చర్య ఫూలన్ ముఠాలోని చాలా మందిని బలి తీసుకుంటుంది. చివరకు వారు విధి లేని పరిస్థితులలో దట్టమైన చంబల్ లోయలో ఆహారము మరియు నీరు లేకుండా దాక్కుంటారు. ఫూలన్ ఆమెకు ఉన్నటువంటి అవకాశాలను మదింపు చేసుకొని చివరకు లొంగిపోవడానికి నిర్ణయించుకొంటుంది. ఆమె యొక్క ఆంక్షలు ఏమిటంటే ఆమె యొక్క మిగిలిన అనుచరులు రక్షించబడటము (ముఖ్యముగా మహిళలు మరియు పిల్లలు). 1983 ఫిబ్రవరిలో ఫూలన్ లొంగిపోవటం ద్వారా చలనచిత్రము ముగుస్తుంది. ఆమె పై ఉన్న అన్ని అభియోగాలు కొట్టివేయబడినట్లు (బెహ్మైలోని హత్యతో సహా) ముగింపులో సూచించటం జరుగుతుంది మరియు ఆమె 1994లో విడుదల చేయబడుతుంది.

తారాగణం[మార్చు]

 • సీమ బిస్వాస్... ఫూలన్ దేవి
 • నిర్మల్ పండే... విక్రమ్ మల్లః
 • ఆదిత్య శ్రీవాస్తవ ... పుట్టిలాల్
 • రామ్ చరణ్ నిర్మల్కర్ ... దేవిదీన్
 • సావిత్రి రేక్వర్... మూల
 • సౌరభ్ శుక్ల... కైలాష్
 • మనోజ్ బజ్పై ... మాన్ సింగ్
 • రఘువీర్ యాదవ్ ... మధో
 • రాజేష్ వివేక బాబా ముస్తకిం
 • అనిరుద్ అగర్వాల్... బాబు గుజ్జర్
 • గోవింద్ నామదేవ్ ... ఠాకూర్ శ్రీరామ్
 • శేఖర్ కపూర్... లారీ డ్రైవర్ గా అతిథి పాత్ర

అవార్డులు[మార్చు]

 • 1995: ఫిలిం ఫేర్ అవార్డ్
  • క్రిటిక్స్ అవార్డు ఫర్ బెస్ట్ మూవీ
 • 1996: నేషనల్ ఫిలిం అవార్డ్
  • బెస్ట్ ఫీచర్స్ ఫిలిం ఇన్ హిందీ
  • ఉత్తమ నటి: సీమ బిస్వాస్
  • ఉత్తమ దుస్తుల రూపకల్పన: డాలీ అహ్లువాలియా
 • 1997: ఫిలిం ఫేర్ అవార్డ్
  • ఉత్తమ దర్శకుడు: శేకర్ కపూర్
  • ఉత్తమ ఛాయా గ్రహణం: అశోక్ మెహతా

స్వల్ప ప్రాముఖ్యం గల ప్రాంతాలు[మార్చు]

 • చిత్ర దర్శకుడు శేకర్ కపూర్ ఈ చిత్రంలో లారీ డ్రైవర్ గా అతిథి పాత్రలో కనిపించారు.

మరింత చదవటానికి[మార్చు]

 • ఇండియాస్ బాండిట్ క్వీన్: ది ట్రూ స్టోరీ ఆఫ్ ఫూలన్ దేవి, రచన మాల సేన్. ప్రచురణ, పందొర, 1993. ISBN 0044408889.

సూచనలు[మార్చు]

 1. నిజ జీవితంలో ఫూలన్ దేవి 1963లో జన్మించింది మరియు పదకొండవ ఏట వివాహం జరిగినది. మరిన్ని వివరాలకు ఫూలన్ దేవి చుడండి.

బాహ్య లింకులు[మార్చు]

Awards and achievements
Preceded by
Kabhi Haan Kabhi Naa
Filmfare Critics Award for Best Movie
1995
Succeeded by
Bombay

మూస:FilmfareCriticsAwardBestMovie మూస:Bollywood మూస:Shekhar Kapur