బాంబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


యునైటడ్ స్టేట్స్ లో తయారు చేయబడిన మాసివ్ ఆర్డ్నన్స్ ఎయిర్ బ్లాస్ట్ (MOAB) ప్రపంచంలోనే రెండవ అత్యంత శక్తివంతమైన అణు-ఆయుధం కాని బాంబు.

ఒక పేలుడు పదార్థము, ఎక్సోతేర్మిక్ రసాయన ప్రక్రియ ద్వారా అతి ఆకస్మికంగా మరియు ఉగ్రమైన రీతిలో శక్తిని విడుదల చేసే పేలుడు సాధనాలే బాంబు అనేది. నేల మరియు ఆకాశం ద్వారా ప్రసరించబడే యాంత్రిక ఒత్తిడి, తాకిడి మరియు పీడనం మూలాన ప్రయాణించే ఎగిరే వస్తువులు, పీడనం హాని మరియు పేలుడు మూలాన ఏర్పడే ప్రభావాల ద్వారా పేలుళ్లు ముఖ్యంగా హాని కలిగిస్తాయి.[1] ఈ పధం βόμβος (బొమ్బోస్ ) అనే గ్రీక్ పధం నుండి వచ్చింది. ఈ ఒనోమాటోపోటిక్ పదానికి ఆంగ్లంలో ఇంచుమించు "మోత" అని అర్ధం. ఒక అణు ఆయుధం అతి పెద్ద అణు సంబంధించిన పెలుడుని ప్రారంబించడానికి రసాయన పేలుడు పదార్ధాలని ఉపయోగిస్తుంది.

భవన నిర్మాణము, గనుల తవ్వకాలు వంటి పౌర అవసరాలకోసం వాడే పేలుడు పరికరాలకు ఈ బాంబు అనే పదాన్ని సాధారణంగా వాడరు. కాని ఈ పరికరాలని వాడే వాళ్లు కొన్ని సార్లు వాటిని బాంబులు అని పిలవొచ్చు. సైన్యంలో వాడే "బాంబు" అనే పధం, ముఖ్యంగా గాలి మార్గంగా ప్రయాణించే బాంబు అంటే గాలిలో పైనుండి కిందకి పడేసే విద్యుత్-శక్తి వాడని పేలుడు ఆయుధాన్ని సూచిస్తుంది. వీటిని ఎక్కువుగా వాయు సేన లోను నౌకా దళంలోను వాడుతారు. బాంబుగా చెప్పబడని ఇతర సైన్య పేలుడు అయుదాలు ఏమనగా, గ్రెనేడ్ లు, షెల్ లు, లోతు చార్జ్లు (నీళ్ళలో వాడేది), వార్ హెడ్ లు, (క్షీపణిలలో వాడేవి) మరియు మందు పాత్రలు. అసాధరణమైన యుద్ధాలలో, "బాంబు" అనే పధం నాశనం చేసే శక్తి గల లేక్కేలేని పేలుడు ఆయుధానైన సూచించవచ్చు. ఉదాహరణకు, ఈ మధ్య జరిగిన ఇరాక్ ఘర్షణలలో, IEDలు లేదా ఇమ్ప్రోవైస్ద్ ఎక్స్ప్లోసివ్ డివైసస్ అనే "బాంబుల"ని తిరుగుబాటువాదులు ఎంతో సమర్ధవంతంగా వాడారు.

ప్రభావాలు[మార్చు]

నేల మరియు ఆకాశం ద్వారా ప్రసరించబడే యాంత్రిక ఒత్తిడి, తాకిడి మరియు పీడనం మూలాన ప్రయాణించే ఎగిరే వస్తువులు, ముక్కలు, పీడనం వల్ల జీవులకు హాని, వస్తువులు మరియు పేలుడు మూలాన ఏర్పడే నిప్పు, పొగ, దుమ్ము వంటి ప్రభావాల ద్వారా పేలుళ్లు ముఖ్యంగా హాని కలిగిస్తాయి.[1]

ఘాతం[మార్చు]

పేలుడు ఘాత అలలు శరీరానికి స్థల మార్పిడి (అనగా, జనం గాలిలో విసిరేయబడటం), శరీరం ముక్కలవ్వడం, అంతర్గత రక్తపాతము మరియు చెవి డ్రం పగలడం వంటి ప్రభావాలు జరగోచ్చు.[1]

పేలుడు వల్ల ఏర్పడే ఘాత అలలుకు పోసిటివ్, నెగటివ్ అని రెండు బాగాలు ఉంటాయి. పోసిటివ్ అలలు పేలుడు ప్రదేశమునుండి బయిట వైపుకి ప్రవహిస్తాయి. వాటి వేనేక్కే ఉన్న శూన్యప్రదేశం, వాటిని మల్లి మూల బిందువుకి లాగుతాయి ఎందుకంటే ఆ ఘాత బుడగ దాని మీదే కూలి పోతుంది కనుక. ట్రినిటి అణు పరీక్షలో ఇది జరిగి, భవనాల మీద పోసిటివ్ మరియు నెగటివ్ ప్రభావాలు కనబడ్డాయి.[2]

ఘాత వల్ల ఏర్పడే హానినుంది రక్షణ పొందాలంటే ఘాత జరిగే ప్రదేశామనుంది దూరంగా ఉండటమే మార్గం.[3] ఓక్లహామా సిటి పేలుడు సమయములో ఏర్పడిన అధిక పీడనం 4000 psi ఉండొచ్చని అంచనా. దీనిని ఒక ఉపప్రామాణం లాగ తీసుకోవచ్చు.[4]

ఉష్ణము[మార్చు]

పేలుడు వల్ల హటాత్తుగా విడుదలయ్యే ఉష్ణము ఒక ఉష్ణ అలని శ్రుష్టిస్తుంది. సైన్య బాంబు పరీక్షలు సమయములో ఉష్ణోగ్రత 2,480 °C (4,500 °F) వరకు నమోదయ్యాయి. తీవ్రమైనదినుండి ఘోరమైనది వరకైన కాల్పులు మరియు ఉప మంటలని ఉష్హ అలలు ఏర్పరుస్తుంది. అయితే, ఘాత మరియు ముక్కలవ్వడంతో పోలిస్తే, ఉష్ణ అలల యొక్క ప్రభావాలు చాల తక్కువ దూరమే ఉంటుంది. అయితే, తెర్మోబారిక్ ఆయుధాలని సైన్యాలు తయారు చేయడంతో, ఈ నియమం ఇప్పుడు సవాలుకు గురి అయింది. ఈ ఆయుధాలు నెగటివ్ ఘాత అల ప్రభావాలు మరియు అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఈ రెండిటిని ఉపయోగించి పేలుడు వ్యాసార్ధం లోపల ఉన్న అన్ని వస్తువులని కాల్చేస్తుంది.

శకలమవ్వడం[మార్చు]

ముక్కలుగా పగిలిపోయిన బాంబు కేసింగ్ మరియు చుట్టూ ఉన్న వస్తువల యొక్క శకలాలు వేగంగా ప్రయానిచడం వల్ల శకలమవ్వడం ఏర్పడుతుంది. ఇనప బంతిలు మరియు మేకులు వంటి వస్తువులని గాయ తీవ్రతని పెంచడాని కోసమని బాంబుకు కలుపుతారు. వీటిని షార్పెనేల్ (పదునైన శకలాలు) అని పిలుస్తారు. ఇవి ముక్కలుగా పగిలే శకలాలకంటే వేరు అయినప్పటికీ, రెండిటికి తేడా కనిపెట్టలేము. సాంప్రదాయంగా వీటిని అతిధ్వానిక కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే చిన్నపాటి లోహ వస్తువులని భావించబడినా, శకలమవ్వడం అతిబయంకర పరిమాణంలో జరగి అతి ఎక్కువ దూరము ప్రయాణించవచ్చు. 1947 ఏప్రిల్ 16న టెక్సాస్ సిటి దుర్ఘటన సమయములో S.S.గ్రాండ్క్యాంపు పేలినప్పుడు, రెండు టన్నుల బరువుగల ఒక శకల పదార్థం, సుమారు రెండు మైళ్లు ప్రయాణించి పాన్ అమెరికన్ శుద్ధి కర్మాగారము యొక్క పార్కింగ్ స్థలములో పడింది.

మానవ శరీరం మీద పేలుడు యొక్క ప్రభావాలు[మార్చు]

బాంబు నిర్వీర్యం చేసే సాంఖేతిక నిపుణులు, శరీరం మీద రక్షణ కవచం ధరించిన సిపాయిలు, మందుపాతర తీసే వాళ్లు, ఎటువంటి రక్షణ ధరించని వాళ్లు వంటి పేలుడు ప్రదేశానికి అతి సమీపములో ఉన్నవారికి, అతి ఎక్కువ పీడనం (ఘాత), శకలమవ్వడం, తాకిడి, ఉష్ణం వంటి నాలుగు రకాలుగా శరీరానికి హాని జరగోచ్చు. పరిసరలో నేలకున్న పీడనం హటాత్తుగా మరియు తీవ్రంగా పెరిగినప్పుడు అతి పీడనం అనే పరిస్థతి ఏర్పడి, లోపరి అవయవాలకు హాని కలిగి శాశ్వతంగా హాని కాని మరణం కాని సంబవించవచ్చు. శకలాలలో పైన చెప్పిన పోడుననైన వస్తువులతో పాటు ఇసుక, శిథిలాలు మరియు పేలుడు ప్రాంతము పరిసరలో ఉన్న చేట్టుచేమలు కూడా ఉండవచ్చు. మనుషులని గురి పెట్టె మందుపాతర పేలుళ్లలో ఇది చాల సామాన్యంగా జరుగుతూ ఉంటుంది.[5] పదార్థాలు ఎగిరిపడటం వల్ల మృదువైన కణజాలాలలో గాటు వేసి, అంటురోగాలు ఏర్పరిచి మరియు లోపరి అవయవాలుకు గాయాలు ఏర్పరిచి ప్రాణాంతకరమైన అపాయాలని కలగచేస్తుంది. అతి పీడన అలలు శరీరాన్ని తాకినప్పుడు, అది పేలుడు మూలాన అతి భయంగరమైన వేగాన్ని ఉత్పన్నం చేస్తుంది. దాని వల్ల చిన్నపాటి గాయాల నుండి ప్రాణాంతకరమైన గాయాలు వరకు ఏర్పడుతాయి. ఈ ప్రారంభ త్వరణం వెనువెంటనే, వేగం తగ్గేటప్పుడు కూడా గాయాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా, పేలుడు తరువాత విసిరివేయబడే ఒక మనిషి ఒక దృఢమైన తలం మీద కాని అడ్డంకి మీద కాని కొట్టుకున్నప్పుడు ఈ విధంగా ఏర్పడవచ్చు. చివరిగా, పేలుడు మంట వల్ల మరియు శరీరం మీద పడే మంటలు లేపే వస్తువుల వల్ల గాయం మరియు మరణం ఏర్పడవచ్చు. బాంబు సూట్ లేదా మందుపాతర తీసేటప్పుడు వేసుకునే దుస్తులు, హెల్మెట్ లు, విసార్ లు మరియు కాళ్ల రక్షణ వంటి రక్షణ ఉపకరణములు వాడుతే ఈ నాలుగు ప్రభావాలని, పేలుడు చార్జ్, దూరం వంటి అంశాలని బట్టి చాల వరకు తగ్గించోచ్చు.

రకాలు[మార్చు]

పైప్ బాంబు రూపంలో ఉన్న ఒక చిన్న టైం బాంబు యొక్క రేఖాచిత్రం
ఒక అమెరికన్ B61 అణు బాంబు ఎక్కించే ముందు

పౌర మరియు సైన్య బాంబులని నిపుణులు వేరుగా పరిగణిస్తారు. సైన్య బాంబులు దాదాపుగా అన్ని కూడా ఒక ప్రమాణం ప్రకారం రూపొందించబడి, ఎక్కువ సంఖ్యలో మొత్తంగా ఉత్పత్తి చేయబడుతాయి. ఇవి ప్రమాణంతో కూడిన విడిబాగాలతో తయారు చేయబడి ఒక ప్రమాణంతో కూడిన పేలుడు సాధనాల్లో వాడబడుతాయి. IED లని, వాటి పరిమాణం మరియు సరఫరా విధానం బట్టి మూడు రకాలుగా విబజించబడుతాయి. టైప్ I IEDలు చేతిలో కాని సూట్కేస్ లో కాని తీసుకెళ్ల బడుతాయి. టైప్ 2 బాంబులు "ఆత్మాహుతి దుస్తులు" లాగ వేసుకోబడుతాయి. పేలుడు పదార్ధాలు నింపి ఒక చోట ఆగి ఉన్న వాహనాలు ఒక చోట నిలబడి ఉన్న బాంబులు లాగ కాని వాటంతట అవే కదిలే బాంబులు లాగ కాని వ్యవహరించే వాటిని టైప్ 3 సాధనాలని పిలుస్తారు. వీటిని VBIED (వాహనాలలో ఉన్న IEDs).

ఇంప్రోవైస్డ్ పేలుడు పదార్ధాలు సాదారణుముగా చాలా అస్థిరమైనవి కాబట్టి తాకిడి, ఒరిపిడి మరియు ఎలెక్ట్రోస్టాటిక్ ఘాత వంటి అనేక పరియావరణ కారణాల వల్ల ఆకస్మికంగా, తనకుతానే పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కొద్దిపాటి చలనము, ఉష్ణోగ్రతలో మార్పు, పక్కన సెల్ ఫోన్ లేదా రేడియో వాడకం వంటి కారణాల వల్ల ఒక అస్థిరమైన లేదా దూరమునుండి నియంత్రించే సాధానము ద్వారా పేల్చ బడుతాయి. పేలుడు పదార్ధాలు, సాధనాలతో అన్అధికృత వాళ్లు జోక్యం చేసుకోవడం చాలా అపాయకరమైనది మరియు వెంటనే మరణం కాని తీవ్ర గాయం కాని కలగచేసే ప్రమాదం ఉంటుంది. ఏ వస్తునైన పేలుడు సాధనం అని నమ్ముతే, వెంటనే అక్కడనుండి ఎంత దూరం వెళ్ల గలిగితే అంత మంచిది.

అణు బాంబులు అణు విచ్చినము అనే ఒక సిద్ధాంతము పై ఆధారపడి వుంటాయి. ఒక పెద్ద అణువు విచ్చిన్నమైనప్పుడు అది అతి భారీ శక్తిని ఉత్పాదన చేస్తుంది. హైడ్రజన్ బాంబులు తొలుత అణు విచ్చిన్నపు శక్తిని ఉపయోగించుకుని, తదుపరి అణు సంయోగం ద్వారా మరింత బలమైన శక్తిని ఉత్పాదన చేస్తాయి.

డర్టీ బాంబు అనే పదం తక్కువ విచ్చినకర శక్తిని కలిగి ఎక్కువ వైశాల్యములో ప్రమాదకర పదార్ధమును వెదజల్లే ఒక ప్రత్యేక సాధనానికి అన్వయిస్తుంది. సాధారణంగా రేడియోలాజికల్ మరియు రసాయన పదార్ధాలకు సంబంధించిన ఈ డర్టీ బాంబులు చంపటానికి గాయపరచటానికి ఉద్దేశించినవి. ఇదే కాక ఆ అపరిశుభ్ర ప్రదేశాన్ని బాగుగా శుభ్రం చేసిదాకా ఎవరూ చేరలేనట్లు చేస్తాయి. పట్టణ వాతావరణంలో ఇటువంటివి శుభ్రం చేయటం మిక్కిలి సమయం తీసుకొనవచ్చు. అంతదాకా ఆ అపరిశుభ్ర ప్రాంతం నివాసయోగ్యం కాకుండా పోతుంది.

పెద్ద బాంబుల యొక్క శక్తిని మెగాటన్నుల TNT (Mt)లో కొలుస్తారు. పోరాట సమయంలో వాడిన అతిపెద్ద బాంబులు యునైటెడ్ స్టేట్స్ హీరోషిమా మరియు నాగాసాకి ఫై దాడికి పాల్పడినప్పుడు వదిలిన రెండు అణు బాంబులైతే, అత్యంత శక్తిమంతమయింది త్సర్ బాంబా. అణ్వేతర బాంబులలో అత్యంత శక్తిమంతమయింది రష్యాకు చెందిన "ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్" (అధికారికంగా ఏవియేషన్ థర్మోబారిక్ బాంబ్ ఆఫ్ ఇంక్రీస్ద్ పవర్ (ATBIP))[6] కాగా యునైటెడ్ స్టేట్స్ వాయు సేన యొక్క MOAB (అధికారికంగా మాసివ్ ఆర్డ్నాన్స్ ఎయిర్ బ్లాస్ట్ లేక సామాన్యంగా పిలువబడుతున్నట్లుగా "మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్").

సరఫరా[మార్చు]

కలిఫోర్నియాలో 1994లో ఒక లైవ్ ఫయర్ విన్యాసమప్పుడు బి-2 స్పిరిట్ 47[14] క్లాస్ మార్క్ 82 బాంబులని కిందకి వదులుతుంది (బి-2 యొక్క మొత్తము పేలోడ్ లో సహానికంటే కొంతే ఎక్కువ).
ఒక F-15E స్ట్రైక్ ఈగల్ 1[15] GBU-28 "బంకర్ బస్టర్", ఒక పరీక్ష సమయుములో.

ఆస్ట్రియా దేశస్తులు 1849 సంవత్సరములో వెనిస్ ను ఆక్రమించినప్పుడు తొలిసారిగా ఆకాశం నుండి వదిలే బాంబులను వాడడం జరిగింది.[7] రెండు వందల మనుషులు లేని బెలూన్లలో చిన్న బాంబులు ఉంచగా వాటిలో కొన్ని సరాసరి వెనిస్ ను గ్రుద్దుకున్నాయి.

ప్రస్తుతం లిబ్యాగా చలామణీ అవుతున్న ప్రాంతంలో 1911 సంవత్సరములో ఇటాలియన్లు ఆఫ్గాన్లతో యుద్ధం చేసినప్పుడు తొలిసారిగా స్థిరమైన రెక్కలు కలిగిన విమానము నుండి బాంబులు వేయబడినవి. ఈ బాంబులు చేతితో వదలబడినవి.[8]

మొట్టమొదటి ఉగ్రవాదుల ద్వారా జరిగిన బాంబు దాడి యునైటెడ్ స్టేట్స్ లో తొమ్మిది సంవత్సరాల తరువాత 1920 సంవత్సరంలో సెప్టెంబరు 16వ తారీఖు మధ్యాహ్నము ఒక ప్రేలుడు పదార్ధాలు నిండిన గుర్రపు బండి ద్వారా మధ్యాహ్నపు భోజన సమయంలో బజారులు జనంతో నిండి వుండగా న్యూ యార్క్ యొక్క ఆర్థిక జిల్లాలో జరిగింది. ఆ వాల్ స్ట్రీట్ బాంబు దాడిలో పోత ఇనుముతో స్లగ్స్ జత చేసిన తూటా తునకలు లాంటి అనేక ఆధునిక తీవ్రవాద పరికరాలు ఉపయోగించి ఒక దారుణమైన దాడి జరిపి 38 మంది మరణానికి, 400 మంది ఇతరులు గాయపడటానికి కారణమయ్యారు.

ఆధునిక సైన్య బాంబుల విమానాలు లోపల ఒక పెద్ద బాంబుల గది ఉంటుంది. ఫైటర్ బాంబుల విమానాలలో పైలాన్ ల మీద కాని బాంబుల అలమారులు కాని బాంబులు ఉంటాయి. లేదా ఒకటికంటే ఎక్కువ అలమారులు కలిగి ఉండి, ఒకే పైలాన్ లో అనేక బాంబులు అమర్చే విధంగా ఉంటుంది. అతి తుల్యంగా ప్రయాణించే సాధానాలైన ఆదునిక బాంబులు, అవి విమానాలనుండి వెళ్ళిన తరువాత కూడా వాటిని రిమోట్ నియంత్రణ ద్వారా కాని స్వయముగా కాని మల్లించోచ్చు. అణు ఆయుధాలు వంటి బాంబులని ఒక శక్తితో నడిచే పీటం మీద అమర్చినప్పుడు వాటిని గైడడ్ క్షీపణలని పిలుస్తారు.

కొన్ని బాంబులలో పారాచూట్ ఉంటుంది. ప్రపంచ యుద్ధం II "పారాఫ్రాగ్" అనే 11 kg ఫ్రాగ్మెన్టేషన్ బాంబు, వియత్నాం-కాలపు డైసి కట్టర్లు మరియు కొన్ని ఆధునిక క్లస్టర్ బాంబులు ఈ రకానికి చెందినవి. పారాచూట్ లు బాంబు కిందకు దిగే వేగాన్ని దగ్గిస్తుంది. అందువల్ల బాంబుని వదిలే విమానము పేలుడు ప్రదేశమునుండి సురక్షితమైన దూరానికి వేలిపోవడానికి సమయం ఉంటుంది. ఎయిర్ బుర్స్ట్ అణు ఆయుధాలు విషయములో మరియు తక్కువ ఎత్తునుండి బాంబుని వదిలే విమానాల విషయములో ఇది చాల ముఖ్యం.[9]

చేతి గ్రెనేడ్ విసిరి వెయ బడుతుంది. గ్రనేడ్ లని ఒక గ్రెనేడ్ లాంచర్ ఉపయోగించి ఇతర మార్గాల ద్వారా కూడా ప్రయోగించవచ్చు. M203 లేదా GP-30 ఉపయోగించి ఒక తుపాకి నుండి కాని, రాకట్ సహాయంతో ప్రయోగించబడే గ్రెనేడ్ మాదిరిగా (RPG), పేలుడు గ్రెనేడ్ కు ఒక రాకేట్ని తగిలించటం ద్వారా కాని గ్రెనేడ్ ని ప్రయోగించవచ్చు.

బాంబుని ముందుగానే ఒక స్థలములో దాచి పెట్టి ఉంచొచ్చు.

రైలు వచ్చే సమయానికి రైలు పట్టాని పేల్చే బాంబు అ రైలు, పట్టా తప్పేలా చేస్తుంది. వాహనాలకు జనాలకు హాని కలగటమే కాకుండా, ఒక రవాణా వ్యవస్థలో ఒక బాంబు పేలినప్పుడు, అ వ్యవస్థ మొత్తానికే హాని కలిగే అవకాశం ఉంది. కొన్ని సార్లు అదే ఉద్దేశం కూడా కావొచ్చు. రైల్వేలు, వంతెనలు, రన్వేలు మరియు రేవులకు ఇది వర్తిస్తుంది. కొంత మేరకు రహదారులకు కూడా ఇది వర్తిస్తుంది.

అత్మాహుది బాంబు దాడిలో, వ్యక్తి తన శరీరం లోనే బాంబుని పెట్టుకుంటాడు లేదా ఒక వాహనంలో పెట్టి తన లక్ష్యానికి నడుపుతాడు.

బాంబులని కూడా పిలవబడే బ్లూ పీకాక్ అణు ఘనులు యుద్ధం సమయుములో వాడటానికి ఉద్దేశించబడినవి. కదిలిస్తే పది సేకన్లలో పెలేటట్టు ఏవి రూపొందించబడ్డాయి.

ఒక డిటోనేటర్ లేదా ఫ్యూజ్తో బాంబు పెల్చబడుతుంది. డిటోనేటర్ లని పేల్చడానికి గడియారాలు లేదా సెల్ ఫోన్ ల వంటి రిమోట్ నియంత్రణలు లేదా పీడనం (ఎత్తు), రాడార్, ఊగటం, స్పర్శ వంటి సెన్సార్ సాదానాలని వాడుతారు. పని చేసే విధానం బట్టి డిటోనేటర్ లలో అనేక రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని, విద్యుత్, నిప్పు ఫ్యూజ్ మరియు పేలుడు ద్వారా మొదలయ్యేవి.

పేలుడు స్థానం[మార్చు]

ఫారంసిక్ శాస్త్రంలో, బాంబు పేలిన స్థలాన్ని, పేలుడు స్థానం, పేలుడు రంధ్రం లేదా ఎపిసెంటర్ అని పిలుస్తారు. పేలుడు పదార్థం యొక్క రకము, పరిమాణం మరియు అమర్చిన స్థలాన్ని బట్టి పేలుడు స్థలం వ్యాపించవచ్చు లేదా ఒకే చోట కేంద్రీకరించి ఉండొచ్చు (అనగా పేలుడు క్రేటర్).[10]

క్రేటర్ ఏర్పడుతే, ఒక పేలుడు సాధనమే పెలుడుకి కారణమని అనుకోవచ్చు. దుమ్ము, ఆవిరి పేలుళ్లు వంటి ఇతర పేలుళ్లు క్రేటర్ ని ఏర్పరచావు. వాటికి నిర్దిష్టమైన పేలుడు స్థానం కూడా ఉండవు.[10]

ఇవి కూడా చూడండి[మార్చు]

చేతి బాంబు

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 Milstein, Randall L. (2008). "Bomb damage assessment". In Ayn Embar-seddon, Allan D. Pass (eds.) (సంపాదకుడు.). Forensic Science. Salem Press. p. 166. ISBN 978-1587654237.CS1 maint: extra text: editors list (link)
 2. "The House in the Middle". Federal Civil Defense Administration. 1954. Retrieved 2008-07-16. Cite web requires |website= (help)
 3. Marks, Michael E. (2002). The Emergency Responder's Guide to Terrorism. Red Hat Publishing Co., Inc. p. 30. ISBN 1-932235-00-0.
 4. Wong, Henry (2002). "Blast-Resistant Building Design Technology Analysis of its Application to Modern Hotel Design". WGA Wong Gregerson Architects, Inc. p. 5. Cite news requires |newspaper= (help)
 5. కూప్ల్యాండ్, ఆర్.ఎం. (1989). ఘనులలో కాళ్లకు ఏర్పడే గాయాల కారణంగా కాళ్ళని తీసేయడం: మీడియాల్ గాస్ట్రోక్నేమియాస్ మయోప్లస్టి ఉపయోగించి తిబియాల్ స్టుంప్ ని రక్షింకోవడం అన్నల్స్ అఫ్ ది రాయల్ కాలేజ్ అఫ్ సర్జన్స్ అఫ్ ఇంగ్లాండ్. 71, pp. 405-408.
 6. Solovyov, Dmitry (2007-09-12). "Russia tests superstrength bomb, military says". Reuters. Retrieved 2008-06-02. Cite web requires |website= (help)
 7. Murphy, Justin (2005). Military Aircraft, Origins to 1918: An Illustrated History of their Impact. ABC-CLIO. p. 10. ISBN 1851094881. Retrieved 2008-05-26. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 8. Lindqvist, Sven (2004). "Guernica". Shock and Awe: War on Words. published by Van Eekelen, Bregje. North Atlantic Books. p. 76. ISBN 0971254605. Retrieved 2008-05-26.
 9. Jackson, S.B. (June 1968). "The Retardation of Weapons for Low Altitude Bombing". United States Naval Institute Proceedings. Cite journal requires |journal= (help)
 10. 10.0 10.1 Walsh, C. J. (2008). "Blast seat". In Ayn Embar-seddon, Allan D. Pass (eds.) (సంపాదకుడు.). Forensic Science. Salem Press. p. 149. ISBN 978-1587654237.CS1 maint: extra text: editors list (link)

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 • పేలుడు హింస, పేలుడు ఆయుధాల సమస్య - బాంబులు మరియు ఇతర పేలుడు ఆయుధాలని జనసంరుద్ధం ఉన్న ప్రదేశాల్లో వాడాటం వల్ల ఏర్పడే మానవతా సమస్యల గురించి రిచర్డ్ మోయస్ రాసిన ఒక నివేదిక (లాండ్మైన్ యాక్షన్, 2009).
 • FAS.org బొమ్బ్స్ ఫర్ బిగినర్స్
 • MakeItLouder.com బాంబు ఎలా పనిచేస్తుంది మరియు వాటి శక్తిని అంచనా వేయడం ఎలా?
"https://te.wikipedia.org/w/index.php?title=బాంబు&oldid=2808483" నుండి వెలికితీశారు