బాగేశ్వర్ జిల్లా
బాగేశ్వర్ జిల్లా बागेश्वर जिला | |
---|---|
జిల్లా | |
నిర్దేశాంకాలు: 29°51′N 79°46′E / 29.85°N 79.77°ECoordinates: 29°51′N 79°46′E / 29.85°N 79.77°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఉత్తరాఖండ్ |
డివిజను | కుమావోన్ |
జిల్లా కేంద్రం | బాగేశ్వర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,302 km2 (889 sq mi) |
జనాభా వివరాలు | |
• మొత్తం | 2,49,462 |
• సాంద్రత | 108/km2 (280/sq mi) |
భాషలు | |
• అధికార భాష | హిందీ |
కాలమానం | UTC+5:30 (భా.ప్రా.కా) |
జాలస్థలి | bageshwar |
బాగేశ్వర్ జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లాలలో ఒకటి. బాగేశ్వర్ పట్టణం ఈ జిల్లాకేంద్రంగా ఉంది. బాగేశ్వర్ జిల్లా తూర్పు సరిహద్దులో కుమోన్ ప్రాంతం, పడమర, వాయవ్య సరిహద్దులో చమోలి , తూర్పున పితోరాఘర్, దక్షిణ సరిహద్దులో అల్మోరా జిల్లాలు ఉన్నాయి. 2011 గణాకాలను అనుసరించి అత్యల్ప జనసంద్రత కలిగిన ఉత్తరాఖండ్ (13) జిల్లాలలో బాగేశ్వర్ 3 వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో రుద్రప్రయాగ్, చంపావత్ జిల్లాలు ఉన్నాయి.
గణాంకాలు[మార్చు]
2011 గణాంకాలను అనుసరించి బాగేశ్వర్ జిల్లా జనసంఖ్య 259,840.[1] ఇది దాదాపు వనౌతు దేశ జనసంఖ్యకు సమానం. [2] భారతీయ జిల్లాలలో (640) బాగేశ్వర్ 578వ స్థానంలో ఉంది.[1] జిల్లా జనసాంద్రత చదరపు కి.మీ 116..[1] 2011-2001 కుటుంబనియంత్రణా శాతం 5.13% . [1] జిల్లా స్త్రీ పురుష నిష్పత్తి 1093:1000. [1] అలాగే అక్షరాశ్యతా శాతం 80.69%. [1] 2001 గణాంకాలను అనుసరించి బాగేశ్వర్ జిల్లా జనసంఖ్య 249,462. వీరిలో హిందువుల సంఖ్య 247,402, ముస్లిముల సంఖ్య1,280, క్రైస్తవులు 361. [3]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Vanuatu 224,564 July 2011 est.
- ↑ "Uttarakhand - Districts of India: Know India". National Portal of India. Archived from the original on 2009-02-19. Retrieved 2014-04-21.
వెలుపలి లింకులు[మార్చు]
