Jump to content

బాగ్డోగ్రా విమానాశ్రయం

బాగ్డోగ్రా విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంకస్టమ్స్ విమానాశ్రయం
యజమానిభారత వైమానిక దళం
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ
సేవలుసిలిగురి
ప్రదేశంబాగ్డోగ్రా, సిలిగురి, పశ్చిమ బెంగాల్, భారతదేశం
ఎత్తు AMSL126 m / 412 ft
అక్షాంశరేఖాంశాలు26°40′52″N 088°19′43″E / 26.68111°N 88.32861°E / 26.68111; 88.32861
పటం
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
18/36 2,754 9,035 కాంక్రీట్/తారు కాంక్రీట్
గణాంకాలు (ఏప్రిల్ 2024 – మార్చి 2025)
ప్రయాణికులు3,219,410 (Increase 3.2%)
విమానాల రాకపోకలు22,390 (Increase 7.4%)
సరుకు రవాణా (టన్నులు)8,952 (Increase 6%)
మూలం: AAI[1][2][3]
విమానాశ్రయ ఏప్రాన్

బాగ్డోగ్రా విమానాశ్రయం (IATA: IXB, ICAO: VEBD) [a] భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిలిగురి నగరానికి సేవలందించే కస్టమ్స్ విమానాశ్రయం. ఇది సిలిగురి నగర కేంద్రానికి నైరుతి దిశలో సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్డోగ్రాలో ఉంది.[4] ఇది భారత వైమానిక దళంకు చెందిన బాగ్డోగ్రా వైమానిక స్థావరంలో ఏర్పాటు చేసిన సివిల్ ఎన్‌క్లేవ్ గా నిర్వహించబడుతోంది.

ఈ విమానాశ్రయం డార్జిలింగ్, గ్యాంగ్‌టక్, కుర్సియాంగ్, కాలింపాంగ్, మిరిక్ వంటి కొండ ప్రాంత పర్యాటక కేంద్రాలుతో పాటు ఉత్తర బెంగాల్ ప్రాంతానికి ప్రధాన ప్రవేశద్వారంగా ఉంది. సిలిగురి ఒక ముఖ్యమైన రవాణా, ఆర్థిక కేంద్రం కావడంతో ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రయాణికులు, పర్యాటకులు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారు.

భారత ప్రభుత్వం 2002లో ఈ విమానాశ్రయానికి పరిమిత అంతర్జాతీయ విమానాశ్రయం హోదాను కల్పించింది. దీని ద్వారా బ్యాంకాక్–సువర్ణభూమి, పారోలకు పరిమిత అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.[5]

ఇది కొలకతా విమానాశ్రయం తరువాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండవ అత్యంత రద్దీ విమానాశ్రయం.

విమానాశ్రయం ఆర్ద్ర ఉపఉష్ణమండల వాతావరణం (కోప్పెన్ వర్గీకరణ: Cwa) కలిగిన ప్రాంతంలో ఉంది. వేసవికాలంలో వేడి, తేమ ఎక్కువగా ఉండగా, శీతాకాలంలో చల్లటి వాతావరణం ఉంటుంది. అన్ని కాలాల్లో వర్షపాతం నమోదవుతున్నప్పటికీ, శీతాకాలం తక్కువ వర్షపాతంతో ఉంటుంది.[6][7]

2014–15లో ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించిన వారి సంఖ్య తొలిసారిగా 10 లక్షలు దాటింది. ఆ సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ 43.6% పెరిగింది. 2019–20లో 32 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 11.2% వృద్ధి. దీంతో ఇది భారతదేశంలోని 17వ అత్యంత రద్దీ విమానాశ్రయంగా నిలిచింది.

ఈ విమానాశ్రయం ద్వారా 13 విమానాశ్రయాలకు సేవలు అందుతున్నాయి. భారతదేశం, భూటాన్, థాయ్‌లాండ్ దేశాలకు అనుసంధానాన్ని కల్పిస్తోంది. ఇక్కడి నుండి అత్యధికంగా నడిచే మార్గం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మార్గం.

వైమానిక దళ స్థావరం

[మార్చు]

ఈ వైమానిక స్థావరం భారత వైమానిక దళం యొక్క 20వ వింగ్‌కు కేంద్రంగా ఉంది. అదనంగా, నం. 8 స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్-21 FL యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్ యూనిట్ కూడా ఇక్కడ ఉన్నాయి.[8]

అలీపుర్‌దువార్ జిల్లాలోని హాసిమారా వైమానిక స్థావరంతో కలిసి, ఉత్తర పశ్చిమ బెంగాల్, సిక్కిం, అవసరమైతే భూటాన్ ప్రాంతాలపై యుద్ధవిమాన కార్యకలాపాలను నిర్వహించే బాధ్యత ఈ స్థావరంపై ఉంది.[9]

ఇది సమీపంలోని సుక్నాలో ఉన్న భారత సైన్యపు XXXIII కార్ప్స్ కు సంబంధించిన మొత్తం సైనిక వైమానిక రాకపోకలకు కూడా సేవలందిస్తుంది.[10]

విస్తరణ

[మార్చు]

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010లో రాత్రి ల్యాండింగ్ సౌకర్యాల అభివృద్ధి కోసం 14.5 acres (5.9 ha) భూమిని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అప్పగించింది. అదే సమయంలో భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) విమానాశ్రయ ఏప్రాన్ ను విస్తరించి, ఒకేసారి ఐదు న్యారో-బాడీ విమానాలు నిలిపివేయగల సామర్థ్యాన్ని కల్పించింది.[6]

విమానాశ్రయ విమాన రాకపోకల నియంత్రణ (ATC), రన్‌వేలను నిర్వహించే భారత వైమానిక దళం 2013లో పౌర విమానాలకు రాత్రి ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా విమాన సేవలు నిర్వహించగలిగే పరిస్థితి ఏర్పడింది.

ఏళ్ల తరబడి పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, 2022లో విమానాశ్రయం యొక్క ఏకైక రన్‌వే పునరుద్ధరణ పనుల కోసం ఏప్రిల్ 11 నుండి 25 వరకు మొత్తం 14 రోజులపాటు మూసివేయబడింది.[11]

కొత్త టెర్మినల్ భవనం నిర్మాణం 2024 నాల్గవ త్రైమాసికంలో ప్రారంభమైంది. ఇది 2027 మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త టెర్మినల్‌లో 16 పార్కింగ్ బేలు, 10 ఏరోబ్రిడ్జ్‌లు, అలాగే రన్‌వేకు సమాంతరంగా ఒక టాక్సీవే నిర్మించబడుతుంది.

ఈ టెర్మినల్ మొత్తం 1 లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో, సుమారు ₹3,000 కోట్ల వ్యయంతో నిర్మించబడుతోంది. ఇది సంవత్సరానికి 1.25 కోట్ల (12.5 మిలియన్) మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొత్త టెర్మినల్ రూపకల్పనను సి.పి. కుక్రేజా ఆర్త్కిటెక్ట్స్ సంస్థ ఆర్కిటెక్చరల్, ఇంజినీరింగ్ సలహాదారుగా నిర్వహించగా, నిర్మాణ కాంట్రాక్టును కల్పతరు ప్రజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దక్కించుకుంది.[12]

విమానాశ్రయ విస్తరణ పూర్తయిన తరువాత మరిన్ని అంతర్జాతీయ విమానాలు ఇక్కడ దిగే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ప్రస్తుతం కస్టమ్స్ విమానాశ్రయంగా ఉన్న బాగ్డోగ్రా విమానాశ్రయం పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.[13]

విమానయాన సంస్థలు, గమ్యస్థానాలు

[మార్చు]
AirlinesDestinations
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్అగర్తలా,[14]

బెంగళూరు,[14] చెన్నై,[14] ఢిల్లీ,[14] డిబ్రుగఢ్,[14] హైదరాబాదు,[14] ఇంఫాల్,[14] కొలకతా,[14] ముంబై,[14]

పూణే[15]
ఆకాసా ఎయిర్అహ్మదాబాద్,

బెంగళూరు,[16] ఢిల్లీ,[16] డిబ్రుగఢ్,[17] గువాహటి,[16] ముంబై,[16] నవి ముంబై

[16]
డ్రుక్ ఎయిర్బ్యాంకాక్–సువర్ణభూమి, పారో[18][19]
ఇండిగోబెంగళూరు,[20]

చెన్నై,[20] ఢిల్లీ,[20] హైదరాబాదు, కొలకతా,[20] ముంబై,[20]

నవి ముంబై[21]
స్పైస్‌జెట్ఢిల్లీ,[22] ముంబై[22]

ప్రమాదాలు, సంఘటనలు

[మార్చు]
  • 23 మే 2008: భారత వైమానిక దళంకు చెందిన ఒక మిగ్-21 విమానం సాంకేతిక లోపం, ల్యాండింగ్ గేర్ ఇరుక్కుపోవడం వల్ల బెల్లీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం రన్‌వేపై బలంగా దిగడంతో మంటలు చెలరేగాయి. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం ఆ విమానాన్ని పూర్తిగా సేవల నుండి తొలగించారు.[23]
  • 5 జూలై 2013: న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం AI879 ల్యాండింగ్ అనంతరం ఏప్రాన్ వైపు టాక్సీయింగ్ చేస్తున్నప్పుడు టాక్సీవే నుండి జారిపోయింది. ఎవరూ గాయపడలేదు. ప్రయాణికులను వెంటనే విమానం నుండి దించారు. విమానానికి స్వల్ప నష్టం సంభవించగా, దానిని తిరిగి టాక్సీవేపైకి తీసుకురావడానికి సుమారు 7 గంటలు పట్టింది.[24]
  • 11 జూలై 2014: ఇండిగో విమానం 6E472, ఎయిర్ ఇండియా విమానం AI879 మధ్య ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలకు ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) హెచ్చరిక జారీ అయింది. TCAS సూచనల మేరకు ఇండిగో విమానం వెంటనే దిగువకు వెళ్లగా, ఎయిర్ ఇండియా విమానం కుడివైపు మళ్లింది. అనంతరం రెండు విమానాలు సురక్షితంగా దిగాయి. ఎటువంటి గాయాలు సంభవించలేదు.[25]
  • 16 డిసెంబరు 2019: కొలకతాకు వెళ్తున్న ఒక ఇండిగో A320neo విమానం ఇంజిన్ లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆ విమానంలో ఉపయోగించిన Pratt & Whitney PW1000G ఇంజిన్లలో ఒకదానిపై అవసరమైన సవరణలు చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.[27]
  • 7 మార్చి 2025: భారత వైమానిక దళంకు చెందిన ఒక అంటోనోవ్ An-32 విమానం బాగ్డోగ్రా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. విమానం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.[28][29]

గమనికలు

[మార్చు]
  1. Bengali pronunciation: [bagɖogra bimanbɔndor]

మూలాలు

[మార్చు]
  1. "Annexure III – Passenger Data" (PDF). aai.aero. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 April 2025.
  2. "Annexure II – Aircraft Movement Data" (PDF). aai.aero. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 April 2025.
  3. "Annexure IV – Freight Movement Data" (PDF). aai.aero. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 April 2025.
  4. "Airports Authority of India". the original నుండి 22 December 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2016.
  5. "International status to Bagdogra airport hailed". The Times of India. 2 October 2002. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 July 2014.
  6. 1 2 "Night-landing facility at Bagdogra soon". The Times of India. 16 January 2010. ఒరిజినల్ నుండి 9 November 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 January 2010.
  7. "International status to Bagdogra airport hailed". The Times of India. 2 October 2002. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 July 2014.
  8. "20 Wing, Indian Air Force - Database". Bharat Rakshak (in బ్రిటిష్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2021.
  9. "Why Bhutan is special to India". The Hindu (in Indian English). 1 July 2017. ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2021.
  10. Indiablooms (28 July 2019). "Air Force Station Bagdogra celebrates Kargil Vijay Diwas | Indiablooms - First Portal on Digital News Management". Indiablooms.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 October 2021.
  11. Niyogi, Subhro (18 January 2022). "14-day Closure Of Bagdogra Airport For Runway Repairs | Kolkata News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 April 2022.
  12. "Kalpataru Wins Siliguri Bagdogra Airport's New Terminal Contract". The Metro Rail Guy. 11 January 2024.
  13. "Bagdogra airport set for expansion". www.telegraphindia.com (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 December 2021.
  14. 1 2 3 4 5 6 7 8 9 "Air India Express Summer Schedule 2026". భారత పౌర విమానయాన మహానిర్దేశక సంస్థ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2026.
  15. "Pune–Bagdogra Direct Flights Take Off, Boosting Regional Connectivity". Pune Mirror. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 May 2026.
  16. 1 2 3 4 5 "Akasa Air Flight Schedule". Akasa Air. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2026.
  17. "Akasa Air deepens its Skyprint in Assam adds Dibrugarh as 32nd destination". Hospibuz. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2026.
  18. "Bagdogra to Paro, Bangkok Drukair". www.drukair.com. the original నుండి 30 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2022.
  19. "Bagdogra-Bangkok flight resumed". Aaj Tak Bangla. 4 July 2022. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 July 2022.
  20. 1 2 3 4 5 "IndiGo Summer Schedule 2026". భారత పౌర విమానయాన మహానిర్దేశక సంస్థ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 May 2026.
  21. Pall, Samreen (11 June 2024). "Durgapur: New Direct Flights To Bhubaneswar, Bagdogra, And Guwahati To Begin Starting August End". News18 (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 June 2024.
  22. 1 2 "SpiceJet Flight Schedule". SpiceJet Official Website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 May 2026.
  23. "MiG 21 crashes in Bengal, pilot safe". Hindustan Times. 23 May 2008. ఒరిజినల్ నుండి 12 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 September 2021.
  24. "Flight skids off taxiway - Air India plane stuck at Bagdogra for 7 hrs". The Telegraph. 6 June 2013. ఒరిజినల్ నుండి 12 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 September 2021.
  25. "Mishap avoided at Bagdogra airport as Indigo and Air India flight avoid collision". News18 India. 11 July 2014. ఒరిజినల్ నుండి 13 September 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 September 2021.
  26. "DGCA suspends two AirAsia India pilots for violation". The Economic Times. 11 July 2019. ఒరిజినల్ నుండి 18 November 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 September 2021.
  27. "IndiGo A320neo flight diverted to Bagdogra due to engine glitch". Mint. 16 December 2019. ఒరిజినల్ నుండి 16 December 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 September 2021.
  28. "Accident Antonov An-32, Friday 7 March 2025". Aviation Safety Network. 7 March 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2025.
  29. Kumari, Sweety (7 March 2025). "Indian Air Force's AN-32 craft crash lands in West Bengal's Bagdogra airport, crew safe". The Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2025.

బాహ్య లింకులు

[మార్చు]