బాఘ్మార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాఘ్మార
పట్టణం
బాఘ్మార పట్టణం
బాఘ్మార పట్టణం
బాఘ్మార is located in Meghalaya
బాఘ్మార
బాఘ్మార
భారతదేశంలోని మేఘాలయలో ప్రాంతం ఉనికి
బాఘ్మార is located in India
బాఘ్మార
బాఘ్మార
బాఘ్మార (India)
నిర్దేశాంకాలు: 25°12′32″N 90°37′42″E / 25.2089793°N 90.6284523°E / 25.2089793; 90.6284523అక్షాంశ రేఖాంశాలు: 25°12′32″N 90°37′42″E / 25.2089793°N 90.6284523°E / 25.2089793; 90.6284523
దేశం భారతదేశం
రాష్ట్రంమేఘాలయ
జిల్లాదక్షిణ గారో హిల్స్
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం13,131
భాషలు
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
794 102
టెలిఫోన్ కోడ్91 03639
వాహనాల నమోదు కోడ్ఎంఎల్ - 09

బాఘ్మార, మేఘాలయ రాష్ట్రంలోని దక్షిణ గారో హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. తుర పట్టణం నుండి 113 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. ఇక్కడ సోమేశ్వరి నది ఉంది. గారో గిరిజన భాషలో దీనిని సిమ్సాంగ్ నది అని కూడా పిలుస్తారు.

ఈ పట్ణానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిజు గుహకు ఈ పట్టణం మీదుగానే వెళ్ళాలి. బల్పక్రం జాతీయ ఉద్యానవనం ఈ పట్టణానికి 66 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ బస్సులు, జీపులలతో రవాణా సౌకర్యం ఉంది. ఈ ప్రాంతంలో చేపలు అధికంగా లభిస్తాయి. ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌తో సముద్ర వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉంది.

చరిత్ర[మార్చు]

బాంగ్ లాస్కర్, ఒక బెంగాల్ పులి మధ్య జరిగిన పోరాటం నుండి ఈ ప్రాంతానికి "బాఘ్మార" అనే పేరు వచ్చింది. బాంగ్ లాస్కర్ ఈ ప్రాంతంలో ఒక పులిని చంపాడు. ఇందులో బాగ్ అంటే "పులి" అని, మారా అంటే "మరణించించడం" అని అర్థం. బాంగ్ లాస్కర్‌ జ్ఞాపకార్థంగా ఈ పట్టణం మధ్యలో ఒక సమాధి కూడా నిర్మించబడింది. ఈ స్థలాన్ని గతంలో "బరోకర్" అని కూడా పిలిచేవారు. అంటే 12 ప్రవాహాలు ("బారో" అంటే 12, "కర్" అంటే ప్రవాహం) అని అర్థం.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] ఈ పట్టణంలో 8,643 జనాభా ఉంది. ఈ జనాభాలో 53% మంది పురుషులు, 47% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 70% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఈ అక్షరాస్యతలో 55% మంది పురుషులు, 45% మంది స్త్రీలు ఉన్నారు. ఈ మొత్తం జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాఘ్మార మున్సిపాలిటీ జనాభా 13,131 మందికి పెరిగింది.[2]

పర్యాటక ప్రాంతాలు[మార్చు]

బాఘ్మారలోని పిచర్ ప్లాంట్ అభయారణ్యం
 • బల్పక్రం జాతీయ ఉద్యానవనం
 • సిజు గుహ
 • పిచర్ ప్లాంట్
 • సిమ్సాంగ్ నది
 • చిట్మాంగ్ కొండ
 • పిచర్ ప్లాంట్ అభయారణ్యం
 • బంగ్లాదేశ్ వ్యూ
 • సీతాకోకచిలుక స్పాట్
 • బాఘ్మార-బల్పక్రం అటవీ రిజర్వ్
 • నెంగ్కాంగ్ గుహ

మూలాలు[మార్చు]

 1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2021-01-02.
 2. "Census 2011 - Baghmara, Meghalaya". Retrieved 2021-01-02.
"https://te.wikipedia.org/w/index.php?title=బాఘ్మార&oldid=3089921" నుండి వెలికితీశారు