బాజిగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Baazigar
దస్త్రం:Baazigar1993.jpg
Baazigar poster
దర్శకత్వము Abbas Mustan
నిర్మాత Ganesh Jain
రచన Robin Bhatt,
Akash Khurana,
Javed Siddiqui
తారాగణం Shahrukh Khan,
Kajol,
Shilpa Shetty,
Rakhee,
Dalip Tahil,
Anant Mahadevan,
Siddharth,
Johnny Lever
సంగీతం Anu Malik
డిస్ట్రిబ్యూటరు Eros Labs
విడుదలైన తేదీలు 12 November 1993
నిడివి 181 min.
దేశము  భారతదేశం
భాష Hindi

బాజిగర్ (హింది(దేవనాగరి):ఉర్దూ/పర్షియన్(నాస్తాలిక్):ఇంగ్లిష్(గాంబ్లర్ )ఇది 1993లో అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన భారతీయ హిందీ సినిమా. 1953లో 'ఇరా లెవిన్' రాసిన 'ఎ కిస్ బిఫోర్ డైయింగ్' అనే నవల ఆధారంగా తెరకెక్కి, ఒక యువకుడు తను అనుకున్నది ఎలా సాధింకలేకపోయాడో అనే విషయాన్ని చెప్పే ఒక కంటెంపరరీ థ్రిల్లర్. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బాలివుడ్ సినిమా ఫార్ములాకు భిన్నంగా, 'హీరో ఒక అమాయకురాలైన హిరోయిన్ను చంపటం అనే విభిన్నమైన అంశంతో, సగటు భారతీయ ప్రేక్షకున్ని షాక్ కు గురిచేసింది. ఐనప్పటికీ, ఒక నమ్మకంలేని కొత్త హీరోతో కూడా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే ఆడింది. ఇది షారుఖ్ ఖాన్ కు సోలో హీరోగా మొదటి సినిమా అయితే, శిల్పా శెట్టికి మాత్రం మొట్టమొదటి సినిమా. ఈ సినిమాతో ఖాన్ విమర్శకుల ప్రశంశలతోపాటు, ప్రజాదరణను, తనదైన గుర్తింపును కూడా పొందాడు. బాజిగర్ , షారుఖ్ ఖాన్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన మొదటి సినిమా, దానిని అనుసరించి అదే సంవత్సరంలో డర్ , తరువాత సంవత్సరంలో అంజామ్ విడుదలయ్యాయి.

కథాంశం[మార్చు]

అజయ్ శర్మ, (షారుఖ్ ఖాన్), పగతో రగిలిపోతుంటాడు. ఒకప్పుడు ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యానికి అధిపతియైన అతని తండ్రి, విశ్వనాథ్ శర్మ (అనంత్ మహదేవన్)ను, మదన్ చోప్రా (దిలీప్ తహిల్) అనబడే ఉద్యోగస్తుడు నమ్మకద్రోహం చేస్తాడు. శర్మ కుటుంబం తమ సొంత కంపెనీనుంచే బయటకు గెంటివేయబడి, ఉన్నదంతా పోగొట్టుకుంటారు. తరువాత వెంటవెంటనే, అజయ్ తండ్రి, చిన్న చెల్లెలు మరణిస్తారు. అతని తల్లి (రాఖీ) ఇప్పుడు మానసిక రోగంతో, మతిమరుపుతో బ్రతుకుతోంది. ఈ కారణాలు అజయ్‍లో పగను పెంచుతాయి. తమకు జరిగిన అన్యాయానికి కారణమైన వ్యక్తిని చంపి, అతని కుటుంబానికి కూడా తమకు పట్టిన గతే పట్టించాలనుకుంటాడు అజయ్. దాని కోసం అతను దేనికైనా సిద్దపడతాడు.

చోప్రా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి కూతురైన సీమా చోప్రా (శిల్పా శెట్టి)ను అజయ్ ప్రేమించడం మొదలుపెడతాడు. ఇలాంటి ఒక పేద అల్లుణ్ణి అమె తండ్రి ఒప్పుకోడు కాబట్టి, వీళ్ళిద్దరూ రహస్యంగా కలుస్తుంటారు. ఇదిలా ఉండగా, మదన్ చోప్రా చిన్న కూతురు ప్రియ(కాజోల్), మదన్‍తో కలిసి, అతను పూర్తిగా రిటైరయ్యేలోగా పాల్గొనాలనుకున్న కార్ట్ రేసులను చూడడానికి మద్రాసు (ఇప్పటి చెన్నై)కు బయలుదేరుతుంది. మదన్ ఇప్పటివరకూ ఓటమి ఎరుగడు, అలాంటిది అతనికి విక్కీ మల్హోత్రా (బ్రౌన్ కాంటాక్ట్ లెన్సులతో ఉన్న అజయ్ శర్మ) గట్టి పోటీ ఇస్తాడు. విక్కీ చివరి క్షణంలో నెమ్మదించి, మదన్ గెలిచేలా చేసి మదన్‍తో, తన గురువును ఓడించలేనని చెప్తాడు. తరువాత ప్రియను కలిసి, ఒక అందమైన అమ్మాయి హృదయాన్ని బాధించకూడదుగనుక తను రేస్‍లో ఓడిపోయానని చెప్పి విక్కీ ఆమె హృదయానికి గాలం వేస్తాడు. అలా, గెలవడానికి ముందు ఓడడం (బాజీగర్ అంటే అదే అర్థం) అనే అతని సిద్దాంతం వల్ల, ప్రియ మనసును గెల్చుకుంటాడు. ఈ విధంగా సీమా, ప్రియలను ఇద్దర్నీ అజయ్ తను ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా కలుస్తూ నెట్టుకొస్తుంటాడు.

ఒకసారి సీమా పుట్టినరోజు సందర్భంగా, సీమాతో ఉన్న అజయ్‍ను ఆమె ఫ్రెండ్ ఒకరు ఫోటో(యాదృశ్ఛికంగా) తీస్తారు. ఆ తరువాత మదన్ చోప్రా, సీమా వివాహాన్ని వేరే ఒక వ్యాపార కుటుంబంతో జరపాలనుకుంటాడు. బాధలో ఉన్న సీమను కలిసి, సూసైడ్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకోవాలని అజయ్ నిశ్చయిస్తాడు. ఇద్దరూ సూసైడ్ నోట్స్ రాసిన తరువాత, ఇదంతా ఒక పరీక్ష అనీ, అసలు పిరికివాళ్ళే అలా రాస్తారని చెప్పి, సీమ సూసైడ్ నోట్‍ను అలాగే ఉంచి, అజయ్ తనది నాశనం చేస్తాడు. మర్నాడు ఇద్దరూ రహస్యంగా పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు వచ్చేసరికి రిజిష్ట్రార్ మూసివేయబడడం వల్ల, పరిసరాలు చూడటానికని ఇద్దరూ ఆ భవంతి పైకెక్కుతారు. అజయ్ ఆమెను పిట్టగోడ మీద కూర్చోబెట్టి, తన గురించి నిజం చెప్పి, పై నుంచి ఆమెను తోసి చంపేస్తాడు. తరువాత అతను ఆమె రాసిన సూసైడ్ నోట్‍ను పోస్ట్ చేసి, అక్కడి నుండి వెళ్ళిపోయి, మళ్ళీ విక్కీగా ప్రియతో కలిసి అక్కడికి వస్తాడు. ఆమె అంత్యక్రియలప్పుడు అతను చోప్రా కుటుంబానికి సహాయం చేస్తాడు. సీమ రాసిన సూసైడ్ నోట్ వల్ల అందరికీ నమ్మకం కలిగి, ఆమె మర్డర్ పరిశోధన ఆపివేయబడుతుంది. ఈ విషయాన్ని ప్రియ నమ్మక, మళ్ళీ ఆ కేసును తెరిపించమని తన తండ్రిని కోరుతుంది. అతను దానికి ససేమిరా ఒప్పుకోక, ఆ కేసును తిరగ తోడటం వల్ల, సీమ ప్రేమాయణం అందరికీ తెలుస్తుందనీ, తన పరువు పోతుందనీ చెప్తాడు. అప్పుడు ప్రియ, తన చిన్నప్పటి సహాధ్యాయి, ఇప్పటి పోలీస్ ఇన్స్‌పెక్టర్ అయిన కరణ్ (సిద్దార్థ్) సహాయం కోరుతుంది.

తన ప్రయత్నం సఫలం కాకున్నా ప్రియ, సీమ మరణాన్ని పరిశోధించడం మొదలుపెడుతుంది. సీమ కళాశాల స్నేహితుడైన రవి, ప్రియకు ఈ విషయంలో సహాయం చేద్దామనుకుని, విక్కీ చేతిలో దారుణంగా హత్య చేయబడతాడు. అతన్ని ఉరితీయడానికి ముందు, విక్కీ అతనితో రాపించిన సూసైడ్ నోట్ ఆధారంగా, అతను సీమను ప్రేమించినవాడని, అతనే సీమ చావుకు కారణమని, కరణ్ భావిస్తాడు. తరువాత ప్రియ, విక్కీలు ఇద్దరూ సీమ ఇంకో కళాశాల స్నేహితుడైన అంజలిని కలుస్తారు, ఇక అంజలి అతనికి అనుమానాస్పదంగా తోస్తుంది. ఎప్పుడైతే ఆమె, ఇతనే సీమను ప్రేమించినవాడు అని గుర్తుపడుతుందో, విక్కీ ప్రియలు ఎంగేజ్‍మెంట్ పార్టీలో ఉన్నప్పుడు, అజయ్ శర్మ ఇంటికి ఫోన్ చేస్తుంది. విక్కీ ఆ ఫోన్‍ను అడ్డగించి, చోప్రాను గొంతును అనుకరించి, ఆమె ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. అతను ఆమెను గొంతు నలిపి చంపి, ఓ సూట్‍కేసులో ఆమె శరీరాన్ని పెట్టి నదిలోకి విసిరేస్తాడు.

మదన్ చోప్రాను నాశనం చేసి, అతని ఆస్తులను వశపరుచుకొని, అఫీసులోంచి వీధిలోకి నెట్టేసి, తన తండ్రిని ఎలాగైతే అవమానించాడో అలాగే అవమానించాలనుకొని విక్కీ శపధం చేస్తాడు. చోప్రా తను ఓ బిజినెస్ ట్రిప్ మీద బయటకు వెళ్తూ, విక్కీ తనకు కాబోయే అల్లుడే కాబట్టి, అతనికి పవర్ అఫ్ అటార్నీ(అధికారాలన్నీ) ఇచ్చేస్తాడు. చోప్రాను పోలిన కార్బన్ కాపీ (నకలు) తయారు చేసి, కొద్దిరోజుల్లోనే విక్కీ ఆస్తంతా స్వాధీన పర్చుకుంటాడు. ఒకరోజు ప్రియను సమాధానపర్చడానికి విక్కీ ఒక క్లబ్‍కు తీసుకెళ్తే, అక్కడ వాళ్ళు అజయ్ చిన్ననాటి మిత్రున్ని కలుస్తారు, అతను విక్కీని అజయ్ అని సంబోధిస్తాడు. విక్కీ అతన్ని పట్టించుకోకుండా ఉంటే, ప్రియ మాత్రం అతను పొరబడుతున్నాడని, అతను అజయ్ కాదు విక్కీ మల్హోత్రా అని అతనితో చెప్తుంది. అజయ్ ఫ్రెండ్ మాత్రం విక్కీతో (ఇప్పుడు అజయ్ ) మళ్ళీమళ్ళీ తమ స్నేహం గురించి ఊదరగొడుతుంటాడు. తను ఉచ్చులో పడ్డాడని గ్రహించిన విక్కీ, అక్కడి నుంచి బయట పడాలనుకొని, అతన్ని తిట్టి, అతనితో గొడవ పడతాడు. తరువాత అజయ్ ఫ్రెండ్‍ని ప్రియ కలిసి, అసలు నిజాన్ని గ్రహిస్తుంది.

చోప్రా తిరిగి రాగానే, విక్కీ తనను విశ్వనాథ్ శర్మ కొడుకుగా నిజాన్ని చెప్పి, 15-20 ఏళ్ళక్రితం, అతను తన తండ్రిని ఎలా బహిష్కరించాడో అలాగే చోప్రాను వెళ్ళగొడ్తాడు. ప్రియ, అజయ్ ఇంటి చిరునామా కనుక్కొని, అతని నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది. అజయ్ రాగానే ఇద్దరూ సీమ హత్య గురించి వాదించుకుంటారు. తమ రెండు కుటుంబాల గత చరిత్ర చెప్పి అజయ్ ఆమెను ఒప్పిస్తాడు. మదన్ గూండాలతో దాడిచేసి, అప్పటికే చాలా గాయాలతో ఉన్న అజయ్‍ను, తుపాకీతో అతని భుజం మీద కాలుస్తాడు. అజయ్‍ను కాపాడే ప్రయత్నంలో అజయ్ తల్లి స్పృహ కోల్పోతుంది. దీంతో అజయ్ రెచ్చిపోయి మదన్ మీదా అతని గ్యాంగ్ మీదా ఒంటరిగా విరుచుకుపడతాడు. చోప్రా ఒక చువ్వతీసుకుని అజయ్‍ను గట్టిగా పొడుస్తాడు. చివరికి అజయ్ అతన్ని లొంగదీసుకునే ప్రయత్నంలో ఇద్దరూ పైనుండి దూకుతారు. చోప్రా మరణిస్తాడు, అజయ్ మెల్లగా తేరుకుని తల్లితో, తమకు న్యాయంగా ఏదైతే చెందాలో, ఆ ఆస్తంతా రాబట్టానని చెప్తాడు. అజయ్ తల్లికి జబ్బు నయమౌతుంది, కానీ తన చేతుల్లోనే తన కొడుకు అజయ్ చనిపోతుంటే చూస్తూ బాధలో మునిగిపోతుంది.

తారాగణం[మార్చు]

 • షారుఖ్ ఖాన్... అజయ్ శర్మ/విక్కీ మల్హోత్రా
 • కాజోల్... ప్రియ. ఎమ్. చోప్రా
 • శిల్పా శెట్టి... సీమా చోప్రా
 • రాఖీ... శోభా శర్మ
 • దిలీప్ తహిల్... మదన్ చోప్రా
 • సిద్ధార్థ్... ఇన్స్‌పెక్టర్ కరణ్
 • జానీ లీవర్... బాబూ లాల్
 • అనంత్ మహదేవన్... విశ్వనాథ్ శర్మ
 • దినేశ్ హింగూ... బజోదియా సేఠ్
 • ఆది ఇరానీ... విక్కీ మల్హొత్రా
 • రేషమ్ టిప్నిస్... అంజలీ సిన్హా
 • హర్‍పాల్ సింగ్... హర్‍పాల్-మోటు
 • అమ్రిత్ పటేల్... మార్కో - డ్రైవర్
 • మన్‍మౌజి... సర్వెంట్

సంగీతం[మార్చు]

ఈ సినిమా సంగీతం, ఈ సినిమా విడుదలైన సంవత్సరంలో చాలా గొప్ప ప్రజాదరణ పొందింది. సంగీత దర్శకత్వం వహించింది అనూ మాలిక్. పాటల జాబితా కింద ఇవ్వబడింది.

పాట గాయనీ,గాయకులు నటీ,నటులు పాటల రచయిత
యే కాలీ కాలీ ఆంఖేఁ కుమార్ శానూ, అనూ మాలిక్ షారుఖ్ ఖాన్, కాజోల్ దేవ్ కోహ్లీ
కితాబేఁ బహుత్ సీ ఆశా భొంస్లే, వినోద్ రాథోడ్ షారుఖ్ ఖాన్, శిల్పా శెట్టి రాణి మాలిక్
ఛుపానా భీ నహీ ఆతా వినోద్ రాథోడ్ సిద్ధార్థ్, కాజోల్ రాణి మాలిక్
సమజ్ కర్ చాంద్ జిస్ కో అల్కా యాజ్ఞీక్, వినోద్ రాథోడ్ కాజోల్ లేక శిల్పా శెట్టి, షారుఖ్ ఖాన్ జమీర్ కాజ్మి
బాజీగర్ ఓ బాజీగర్ కుమార్ శానూ, అల్కా యాజ్ఞీక్ షారుఖ్ ఖాన్, కాజోల్ నవాబ్ ఆర్‍జూ
ఆ మేరే హమ్ సఫర్ వినోద్ రాథోడ్, అల్కా యాజ్ఞీక్ షారుఖ్ ఖాన్, శిల్పా శెట్టి గౌహర్ కాన్‍పురి
తేరే చెహ్రే పే కుమార్ శాను, సోనాలి బాజ్‍పాయ్ (సౌండ్ ట్రాక్‍ మాత్రమే, సినిమాలో లేదు)

గౌహర్ కాన్‍పురి

అవార్డులు[మార్చు]

 • ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (షారుఖ్ ఖాన్)
 • ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ గాయకుడు (కుమార్ శాను)
 • ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ సంగీత దర్శకుడు (అను మాలిక్)
 • ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ చిత్రానువాదం

బాహ్య లింకులు[మార్చు]

మూస:Abbas Mustan మూస:Bollywood

"https://te.wikipedia.org/w/index.php?title=బాజిగర్&oldid=1998738" నుండి వెలికితీశారు