Jump to content

బాను ముష్తాక్

వికీపీడియా నుండి
బాను ముష్తాక్
జననం (1948-04-03) 1948 ఏప్రిల్ 3 (వయసు: 78)
హసన్, మైసూర్ రాష్ట్రం, భారతదేశం
వృత్తిరచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది.
జాతీయతభారతీయురాలు
ప్రసిద్ధ రచనలుsహార్ట్ లాంప్ 2025, దీనిని దీపా భస్తి అను అనువాదకురాలు ఆంగ్లంలోకి అనువదించింది
ప్రసిద్ధ పురస్కారాలు
  • కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు
  • దాన చింతామణి అట్టీమబ్బే అవార్డు
  • పెన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అవార్డు, దీపా భస్తి యొక్క హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనువాదానికి
  • 2025: హార్ట్ లాంప్ కోసం అంతర్జాతీయ బుకర్ బహుమతి, దీపా భస్తి అనువదించారు

బాను ముష్తాక్ (జననం 3 ఏప్రిల్ 1948) దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది. ఆమె హార్ట్ లాంప్: చిన్న కథల సంకలన రచయిత్రి. దీనికి 2025లో అంతర్జాతీయ బుకర్ బహుమతి లభించింది. ఆమె కన్నడ భాషలో రచనలు చేస్తుంది. ఆమె ఆరు చిన్న కథల సంకలనాలు, ఒక నవల, ఒక వ్యాస సంకలనం, ఒక కవితా సంకలనం ప్రచురించింది. ఆమె రచనలని ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళం, ఆంగ్ల భాషల్లోకి అనువదించారు. ఈమె రచించిన హార్ట్ లాంప్ ను దీపా భస్తి ఆంగ్లంలోకి అనువదించింది.

వ్యక్తిగత జీవితం, క్రియాశీలత

[మార్చు]
Booker prize winner Banu Mushtaq talk at Kollam 2025

బాను ముష్తాక్ 1948 ఏప్రిల్లో కర్ణాటకలోని హసన్లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది.[1][2] ఆమె ఎనిమిదేళ్ల వయసులో శివమొగ్గ కన్నడ భాషా మిషనరీ పాఠశాలలో అక్కడ "ఆరు నెలల్లోనే కన్నడ చదవడం వ్రాయడం" నేర్చుకోవాలనే షరతుపై చేరింది. ఆమె కొన్ని రోజులలోనే రాయడం ప్రారంభించి పాఠశాల అంచనాలను అధిగమించింది.[3]

సమాజపు కట్టుబాట్లకు విరుద్ధంగా, ఆమె విశ్వవిద్యాలయానికి హాజరై, 26 సంవత్సరాల వయస్సులో ప్రేమ వివాహం చేసుకుంది.[4]

ఆమె 'లంకేష్' పత్రికకు పాత్రికేయురాలిగా పనిచేసింది. కొన్ని నెలలు బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో పనిచేసింది.[2][4]

1980ల నుండి, కర్ణాటకలో "ఫండమెంటలిజం, సామాజిక అన్యాయాలను" అణగదొక్కడానికి పనిచేస్తున్న సామాజిక ఉద్యమాలలో బాను కార్యకర్తగా పనిచేసింది.[5]

2000లో, ఆమె "ముస్లిం మహిళలు మసీదులలోకి ప్రవేశించే హక్కును సమర్థించినందుకు" ప్రతిస్పందనగా ఆమెను, కుటుంబాన్ని మూడు నెలల "సామాజిక బహిష్కరణ" ప్రకటించారు.[5] ఆ సమయంలో, ఆమెకు బెదిరిస్తూ టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. ఒక వ్యక్తి ఆమెను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు, కాని ఆమె భర్త అడ్డుకున్నాడు.[6] 2000 ల ప్రారంభంలో, చిక్మమగళూరు జిల్లా, బాబా బుదంగిరిలోని ఒక సమన్వయ మందిరాన్ని ముస్లింలు సందర్శించకుండా నిరోధించే ప్రయత్నాలను నిరసిస్తూ బాను పౌర సమాజ సమూహం అయిన 'కోము సౌహార్ధ వేదిక'ను సంప్రదించింది.[5] పాఠశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించే హక్కుకు బాను మద్దతు ఇచ్చింది. దీనిని కర్ణాటకలో సవాలు చేశారు.[7]

ఆమె కన్నడ, హిందీ, దఖనీ ఉర్దూ, ఇంగ్లీష్ మాట్లాడుతుంది.[4]

రచనా వ్యాసంగం

[మార్చు]

బానుకు చిన్న వయస్సు నుండే రాయడం పట్ల ఆసక్తి ఉండేది, కానీ ప్రసవానంతరం నిరాశతో బాధపడుతున్న తల్లిగా 29 సంవత్సరాల వయస్సు వరకు ఆమె రచయిత్రి కాలేదు. తన భావాలను, అనుభవాలను అన్వేషించడానికి బాను రచన వైపు మొగ్గు చూపారు. ఆమె రచనలలో ఎక్కువ భాగం మహిళల సమస్యలను ప్రస్తావిస్తుంది.[8]

ముష్తాక్ ఆరు చిన్న కథల సంకలనాలు, ఒక నవల, వ్యాసాల సంకలనం, కవిత్వ సంకలనం ప్రచురించింది.[9] ఆమె రచనలు ఉర్దూ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి, అలాగే ఇటీవల ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి.[10] ఆమె రచించిన కథ "కరి నాగరుగలు" ను 2003లో హసీనా అనే చిత్రంగా రూపొందించారు.[11]

హార్ట్ లాంప్ అనేది ఆంగ్లంలోకి అనువదించబడిన బాను రచించిన మొట్టమొదటి పూర్తి-నిడివి పుస్తకం. 2025లో 'హార్ట్ లాంప్: ఎంపిక చేసిన కధల సంకలనం (సెలెక్టెడ్ స్టోరీస్)' ఇంకా మిగతా కధలు (అండ్ అదర్ స్టోరీస్)ను ప్రచురించింది. ఇది దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజాలలోని స్త్రీలను-కేంద్రంగా రచించిన కథల ఎంపిక. 2022లో దీపా భస్తి అను అనువాదకురాలు ముష్టాక్ రచనలను ఆంగ్లంలోకి అనువదించడం ప్రారంభించింది.[12] 1990, 2023ల మధ్య ప్రచురించిన ఆరు సంకలనాల నుండి ఈ సంపుటికి పన్నెండు కథలను భస్తి ఎంపిక చేసింది.[13][14][15]

మే 2025లో, హార్ట్ లాంప్ 2025 సంకలనం అంతర్జాతీయ బుకర్ బహుమతి గెలుచుకుంది.[16] ఈ బహుమతికి ఎంపిక అయిన తొలి కన్నడ భాషా రచయిత్రి/త ముష్టాక్.[17] దీపా భస్తి ఈ బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ అనువాదకురాలు. ఈ బహుమతిని గెలిచిన మొట్టమొదటి చిన్న కథల సంకలనం.[18] ఈ సంకలనంలోని కథలు పాత్రికేయురాలిగా, న్యాయవాదిగా బాను జీవితాన్ని ప్రతిబింబిస్తాయి, మహిళల హక్కులు, దేశంలోని ఆమె ప్రాంతంలో కుల మత ప్రాతిపదికగా జరుగుతున్న అన్యాయాలకు ప్రతిఘటనపై దృష్టి సారించాయి.[19]

బుకర్ ఇంటర్నేషనల్ న్యాయమూర్తుల అధ్యక్షులు 'మాక్స్ పోర్టర్' మాట్లాడుతూ, ఈ కథలు స్త్రీవాదమైనవి అయినప్పటికీ, "పితృస్వామ్య వ్యవస్థకు ప్రతిఘటనల గురించిన అసాధారణ కథనాలను కలిగి ఉన్నాయి", అవి "రోజువారీ జీవితానికి, ముఖ్యంగా అన్నిటికంటే మహిళల జీవితాలకు సంబంధించిన అందమైన కథనాలు" అని అన్నారు.[20] ది గార్డియన్ పత్రిక "స్వరం నిశ్శబ్దం నుండి హాస్యభరితంగా మారుతుంది, కానీ దృష్టి స్థిరంగా ఉంటుంది" ("tone varies from quiet to comic, but the vision is consistent") అని వ్యాఖ్యానించింది, ఇంకా దీనిని "అద్భుతమైన సంకలనం" అని పేర్కొంది.[21]

పురస్కారాలు, గుర్తింపు

[మార్చు]
  • 1999: కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు [22]
  • దాన చింతామణి అట్టీమబ్బే అవార్డు[22]
  • 2024: పెన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ (PEN English Translate Award) అవార్డు, దీనిని దీపా భస్తి హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనువాదానికి లభించింది [23]
  • 2025: హార్ట్ లాంప్ కు అంతర్జాతీయ బుకర్ బహుమతి, దీపా భస్తి అనువదించింది.[24][25]

మూలాలు

[మార్చు]
  1. The Hindu Staff (21 May 2025). "Who is Banu Mushtaq? Kannada writer who scripted history with 2025 International Booker Prize win". The Hindu. Bangalore. Retrieved 22 May 2025.
  2. 2.0 2.1 "Muslim patriarchs – I prefer to call them Muslim fascist forces: Banu Mushtaque (interview)". New Age Islam. 17 August 2010. Retrieved 27 March 2025.
  3. Sathish, G. T. (4 March 2025). "Firebrand writer Banu Mushtaq, and her International Booker Prize-longlisted anthology, Heart Lamp". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 27 March 2025.
  4. 4.0 4.1 4.2 Sharma, Kanika (1 March 2025). "Banu Mushtaq wrote Heart Lamp for 33 years. Now, it's nominated for the International Booker Prize". Vogue India (in Indian English). Retrieved 27 March 2025.
  5. 5.0 5.1 5.2 Biradar, Basav (17 March 2022). "'In Karnataka, Cultural Practices Basavanna Fought Against Are Getting Reintroduced'". article-14.com. Retrieved 27 March 2025.
  6. Mollan, Cherylann (21 May 2025). "India's Banu Mushtaq makes history with International Booker win". BBC News. Retrieved 22 May 2025.
  7. Biradar, Basav (17 March 2022). "'In Karnataka, Cultural Practices Basavanna Fought Against Are Getting Reintroduced'". article-14.com. Retrieved 27 March 2025.
  8. Sharma, Kanika (1 March 2025). "Banu Mushtaq wrote Heart Lamp for 33 years. Now, it's nominated for the International Booker Prize". Vogue India (in Indian English). Retrieved 27 March 2025.
  9. "Authors: Banu Mushtaq". The Booker Prizes. Retrieved 27 March 2025.
  10. "Authors: Banu Mushtaq". And Other Stories. 4 December 2024. Retrieved 27 March 2025.
  11. Sharma, Kanika (1 March 2025). "Banu Mushtaq wrote Heart Lamp for 33 years. Now, it's nominated for the International Booker Prize". Vogue India (in Indian English). Retrieved 27 March 2025.
  12. Sharma, Kanika (1 March 2025). "Banu Mushtaq wrote Heart Lamp for 33 years. Now, it's nominated for the International Booker Prize". Vogue India (in Indian English). Retrieved 27 March 2025.
  13. Knight, Lucy (20 May 2025). "'Radical translation' of Heart Lamp by Banu Mushtaq wins International Booker prize". The Guardian. Retrieved 20 May 2025.
  14. "An interview with Banu Mushtaq and Deepa Bhasthi, author and translator of Heart Lamp". The Booker Prizes. 14 March 2025. Retrieved 21 May 2025.
  15. Sathish, G. T. (4 March 2025). "Firebrand writer Banu Mushtaq, and her International Booker Prize-longlisted anthology, Heart Lamp". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 27 March 2025.
  16. Marshall, Alex (20 May 2025). "Banu Mushtaq's Heart Lamp, a Story Collection, Wins International Booker Prize". The New York Times. Retrieved 20 May 2025.
  17. Sathish, G. T. (4 March 2025). "Firebrand writer Banu Mushtaq, and her International Booker Prize-longlisted anthology, Heart Lamp". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 27 March 2025.
  18. "Banu Mushtaq and Deepa Bhasthi have won the International Booker Prize 2025 for Heart Lamp, the first collection of short stories to win the prize". The Booker Prizes. Retrieved 20 May 2025.
  19. The Hindu Staff (21 May 2025). "Who is Banu Mushtaq? Kannada writer who scripted history with 2025 International Booker Prize win". The Hindu. Bangalore. Retrieved 22 May 2025.
  20. Knight, Lucy (20 May 2025). "'Radical translation' of Heart Lamp by Banu Mushtaq wins International Booker prize". The Guardian. Retrieved 20 May 2025.
  21. Self, John (18 May 2025). "A Danish Groundhog Day or tales of millennial angst… What should win this year's International Booker?". The Guardian. Retrieved 21 May 2025.
  22. 22.0 22.1 Creamer, Ella (25 February 2025). "All 13 writers on International Booker longlist are first-time nominees". The Guardian. Retrieved 27 March 2025.
  23. "Collection of Banu Mushtaq's short stories translated into English wins PEN English Translate award". The Hindu (in Indian English). 18 July 2024. ISSN 0971-751X. Retrieved 27 March 2025.
  24. Marshall, Alex (8 April 2025). "International Booker Prize Shortlist: 6 Books to Talk About". New York Times (in ఇంగ్లీష్). Retrieved 8 April 2025.
  25. Raj, Gayathri V (21 May 2025). "Booker Prize for Banu Mushtaq: Celebrations in Hassan as Kannada Author Wins Prestigious Award". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 21 May 2025.