Coordinates: 18°20′55″N 77°54′19″E / 18.3485803°N 77.9053182°E / 18.3485803; 77.9053182

బాన్సువాడ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాన్స్‌వాడ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
బాన్స్‌వాడ పురపాలకసంఘం is located in తెలంగాణ
బాన్స్‌వాడ పురపాలకసంఘం
బాన్స్‌వాడ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°20′55″N 77°54′19″E / 18.3485803°N 77.9053182°E / 18.3485803; 77.9053182
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి
మండలం బాన్స్‌వాడ
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 15.96 km² (6.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 28,384
 - పురుషుల సంఖ్య 13,748
 - స్త్రీల సంఖ్య 14,636
 - గృహాల సంఖ్య 6,216
పిన్‌కోడ్ - 503187
503190
503194
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

బాన్సువాడ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] బాన్స్‌వాడ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

2018 జనవరి 11 న బాన్స్‌వాడను మునిసిపాలిటీ గ్రేడ్ 3గా అప్‌గ్రేడ్ చేశారు. 2019 జూలైలో 19 ఎన్నికల వార్డులుగా విభజించారు.

భౌగోళికం[మార్చు]

బాన్సువాడ 15.96 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°22′52″N 77°52′30″E / 18.381°N 77.875°E / 18.381; 77.875 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 179 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కామారెడ్డి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 28,384 మంది కాగా, అందులో 13,748 మంది పురుషులు, 14,636 మంది మహిళలు ఉన్నారు. 6,216 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 19 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[3] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. తస్లిమా ఫిర్డోస్
  2. జురుపాల మోతీలాల్
  3. సేహా సుల్తానా
  4. రుక్మిణి గైక్వాడ్
  5. కాసుల బాలరాజ్
  6. షేక్ జుబెర్
  7. జి. సరిత
  8. డొంకంటి వెంకటేష్
  9. పాషం రవీందర్ రెడ్డి
  10. ర్యాకల రామదేవి
  11. గడుమల లింగమేశ్వర్
  12. గంగరాపు సుగుణ
  13. ఎం. శ్రీనివాస్
  14. నార్ల నందకిషోర్
  15. జంగం గంగాధర్
  16. బిట్ల రేణుక
  17. రేష్మా బేగం
  18. కాసుల రోహిత్
  19. సలీమా బేగం

మూలాలు[మార్చు]

  1. "Banswada Municipality". banswadamunicipality.telangana.gov.in. Archived from the original on 2021-07-30. Retrieved 2021-06-13.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 June 2021.
  3. admin (2020-05-16). "Banswada municipality Councillors list 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-13.

వెలుపలి లంకెలు[మార్చు]