Jump to content

బాన్సువాడ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
బాన్సువాడ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాకామారెడ్డి

బాన్సువాడ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కామారెడ్డి జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం బాన్సువాడ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

[మార్చు]

బాన్సువాడ డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం బాన్సువాడ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 బాన్స్‌వాడ మండలం 19 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
2 బీర్కూర్ మండలం 15 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు)
3 నసురుల్లాబాద్ మండలం 16 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
4 బిచ్కుంద మండలం 29 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
5 జుక్కల్ మండలం 31 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
6 పిట్లం మండలం 27 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
7 పెద్ద కొడపగల్ మండలం 13 రెవెన్యూ గ్రామాలు
8 మద్నూరు మండలం 42 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు)
9 నిజాంసాగర్‌ మండలం 30 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు)

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-30.
  3. "Revenue Divisions | District Kamareddy, Government of Telangana | India". www.kamareddy.telangana.gov.in. Archived from the original on 2022-02-15. Retrieved 2022-04-30.
  4. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2022-04-30.