బాబూరావు చించన్సూర్
| బాబూరావు బసవన్నెప్ప చించన్సూర్ | |||
| పదవీ కాలం 2022 ఆగస్టు 5 – 2023 మార్చి 21 | |||
| ముందు | సిఎం ఇబ్రహీం | ||
|---|---|---|---|
| తరువాత | ఎన్.ఎస్. బోసురాజు | ||
| నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
జౌళి, ఓడరేవులు, అంతర్గత రవాణా శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2013 – 2016 | |||
| పదవీ కాలం 2008 – 2018 | |||
| ముందు | మల్లికార్జున్ ఖర్గే | ||
| తరువాత | నాగనగౌడ కందకూర్ | ||
| నియోజకవర్గం | గుర్మిత్కల్ | ||
| పదవీ కాలం 1989 – 2004 | |||
| ముందు | విశ్వనాథ్ పాటిల్ హెబ్బాళ్ | ||
| తరువాత | విశ్వనాథ్ పాటిల్ హెబ్బాళ్ | ||
| నియోజకవర్గం | చిత్తాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1951 ఏప్రిల్ 5 చించన్సూర్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2018 ఆగస్టు 29 - 2023 మార్చి 20) | ||
| నివాసం | శాంతి నగర్, గుల్బర్గా , కర్ణాటక , భారతదేశం | ||
| పూర్వ విద్యార్థి | మైసూర్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బాబూరావు చించన్సూర్ (జననం 5 ఏప్రిల్ 1951) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు గుర్మిత్కల్ నుండి మూడు సార్లు, చిత్తాపూర్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2013 నుండి 2016 వరకు జౌళి, ఓడరేవులు & అంతర్గత రవాణా మంత్రిగా పని చేశాడు.
బాబూరావు చించన్సూర్ 2022 నుండి 2023 వరకు కర్ణాటక శాసన మండలి సభ్యుడిగా కూడా పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]బాబూరావు చించన్సూర్ 1951 ఏప్రిల్ 5న జన్మించాడు. ఆయన మైసూర్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బాబూరావు చించన్సూర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989 శాసనసభ ఎన్నికలలో చిత్తాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1994, 1999 శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
బాబూరావు చించన్సూర్ 2008, 2013 శాసనసభ ఎన్నికలలో గుర్మిత్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2013 నుండి 2016 వరకు జౌళి, ఓడరేవులు & అంతర్గత రవాణా మంత్రిగా పని చేశాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆగస్టు 29న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[1]
బాబూరావు చించన్సూర్ బిజెపిలో చేరిన తర్వాత 2022 జూలై 30న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా కోటా నుండి ఆగస్టు 5న కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై,[2] 20 మార్చి 2023న ఆయన తన పదవికి రాజీనామా చేసి,[3] మార్చి 22న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Senior Karnataka Congress leader Baburao Chinchansur joins BJP" (in ఇంగ్లీష్). The News Minute. 29 August 2018. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Karnataka MLC bypoll: BJP's Baburao Chinchansur elected unopposed" (in ఇంగ్లీష్). The Indian Express. 5 August 2022. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Baburao Chinchansur resigns from Legislative Council" (in Indian English). The Hindu. 20 March 2023. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Karnataka: Ex BJP MLC Baburao Chinchansur joins Congress ahead of Assembly polls" (in ఇంగ్లీష్). India Today. 22 March 2023. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.
- ↑ "Two days after quitting BJP, Baburao Chinchansur joins Congress in Karnataka" (in Indian English). The Hindu. 22 March 2023. Archived from the original on 22 March 2025. Retrieved 22 March 2025.