Jump to content

బాబ్ డిలాన్

వికీపీడియా నుండి
బాబ్ డిలాన్
Bob Dylan standing on stage
2019 లో డిలాన్
రాబర్ట్ అలెన్ జిమ్మర్‌మ్యాన్

(1941-05-24) 1941 మే 24 (వయసు: 85)
ఇతర పేర్లు
  • షబ్తాయ్ జిసెల్ బెన్ అవ్రహాం (హీబ్రూ పేరు)
  • ఎల్‌స్టన్ గన్
  • బ్లైండ్ బాయ్ గ్రంట్
  • బాబ్ ల్యాండీ
  • రాబర్ట్ మిల్క్‌వుడ్ థామస్
  • టెడాం పోర్టర్‌హౌస్
  • లక్కీ విల్బరీ
  • బూ విల్బరీ
  • జాక్ ఫ్రోస్ట్
  • సెర్గీ పెట్రోవ్
  • జిమ్మీ
వృత్తి
  • గాయక రచయిత
  • చిత్రకారుడు
  • రచయిత
క్రియాశీలక సంవత్సరాలు1957–ప్రస్తుతం[1]
Spouses
  • సారా (నవంబరు 22, 1965 - జూన్ 29, 1977) (విడాకులు)
  • కారోలిన్ డెన్నిస్ (జూన్ 4, 1986 - అక్టోబర్ 1992) (విడాకులు)
పిల్లలు6, జెస్సీ డిలాన్, జాకబ్ డిలాన్ లతో కలిపి
పురస్కారాలు
  • 2016 లో సాహిత్యంలో నోబెల్ బహుమానం
  • ఇతరములు
Musical career
ప్రక్రియలు
  • ఫోక్
  • బ్లూస్
  • రాక్
  • గోస్పెల్
  • కంట్రీ
  • సాంప్రదాయ పాప్
  • జాజ్
వాద్య పరికరాలు
  • గాత్రం
  • గిటార్
  • హార్మోనికా
  • కీబోర్డ్స్
లేబుల్స్
  • కొలంబియా రికార్డ్స్
  • అసైలుమ్
సంతకం

బాబ్ డిలాన్ (జ. రాబర్ట్ అలెన్ జిమ్మర్‌మ్యాన్, 1941, మే 24) ఒక అమెరికన్ గాయకుడు, గీతరచయిత. ఇతన్ని అత్యుత్తమ గేయ రచయితల్లో ఒకడిగా పరిగణిస్తారు.[2][3] 60 ఏళ్ళకు పైగా సాగిన అతని ప్రస్థానంలో అతని మంచి గుర్తింపు సాధించాడు. ఈయన రికార్డులు ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.5 కోట్లు అమ్ముడై ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన సంగీతకర్తల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు.[4]

డిలాన్ అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రం, సెయింట్ లూయిస్ కౌంటీలో జన్మించాడు. 1961 లో సంగీత పరిశ్రమలో అవకాశాల కోసం న్యూయార్క్ చేరుకున్నాడు. 1962 లో బాబ్ డిలాన్ అనే పేరుతో తన మొట్టమొదటి ఆల్బం విడుదల చేశాడు. ఇది సాంప్రదాయ జానపద సంగీతం, బ్లూస్ శైలికి చెందినది. 1963 లో పాత జానపద పాటలను అనుసరిస్తూ ద ఫ్రీ వీలింగ్ బాబ్ డిలాన్ అనే ఆల్బమ్‌ను విడుదల చేశాడు. ఇది అతని మొదటి మైలురాయి.

మూలాలు

[మార్చు]
  1. Erlewine, Stephen Thomas (December 12, 2019). "Bob Dylan biography". AllMusic. Retrieved January 6, 2020.
  2. "Dylan 'the greatest songwriter'" (in బ్రిటిష్ ఇంగ్లీష్). BBC News. May 23, 2001. Retrieved January 1, 2022.
  3. "No. 1 Bob Dylan". Rolling Stone. April 10, 2020. Retrieved January 29, 2021.
  4. Lenthang, Marlene (January 25, 2022). "Bob Dylan sells his entire catalog of recorded music to Sony". NBC News. Retrieved June 11, 2024.