Jump to content

బారమ్

వికీపీడియా నుండి
బారమ్
({{{year}}} తమిళం సినిమా)
దస్త్రం:Baaram poster.jpg
పోస్టరు
దర్శకత్వం ప్రియా కృష్ణస్వామి
నిర్మాణం
  • ప్రియా కృష్ణస్వామి
  • ఆర్ద్ర స్వరూప్
సంగీతం వేద్ నాయర్
ఛాయాగ్రహణం జయంయ్త్ సేతుమాధవన్
కూర్పు ప్రియా కృష్ణస్వామి
విడుదల తేదీ 2018 నవంబరు (2018-11)(IFFI)
21 ఫిబ్రవరి 2020 (India)
నిడివి 91 నిమిషాలు
దేశం భారతదేశం
భాష తమిళం
నిర్మాణ_సంస్థ రెక్‌లెస్ రోజెస్

[[వర్గం:{{{year}}}_తమిళం_సినిమాలు]]

బారం (భారం) అనేది 2020లో విడుదలైన తమిళ భాషా చిత్రం. ప్రియా కృష్ణస్వామి దీనికి రచన, దర్శకత్వం కూర్పు చేసింది. [1] ప్రియా కృష్ణస్వామి, ఆర్ద్ర స్వరూప్ లు తమ బ్యానర్, రెక్లెస్ రోజెస్ కింద నిర్మించిన ఈ సినిమా 2019లో ఉత్తమ తమిళ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2] 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో పురస్కారం గెలుచుకున్న ఏకైక తమిళ చిత్రం ఇది. ఇది 2019లో పాండిచ్చేరి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక జ్యూరీ అవార్డును, 2021లో మాంట్రియల్‌లోని దక్షిణాసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. బారమ్‌ను గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ, వెట్రి మారన్ సమర్పించారు 2020 ఫిబ్రవరి 21 న భారతీయ థియేటర్లలో విడుదలైంది. 2020 మార్చిలో దీన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడం మొదలు పెట్టింది.

కథాంశం

[మార్చు]

వితంతువు అయిన రాత్రి కాపలాదారుడు కరుప్పసామి, తన సోదరి మెన్మోళి, ముగ్గురు మేనల్లుళ్ళు – వీర, మణి, మురుగన్ లతో కలిసి, తమిళనాడులోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నాడు. ఒక రోజు ఉదయం, తన షిఫ్ట్ నుండి తిరిగి వస్తుండగా, అతనికి ప్రమాదం జరిగి తుంటి విరిగిపోతుంది. భయాందోళనకు గురైన అతని మేనల్లుళ్ళు పట్టణంలో అతనికి ఆపరేషన్ చేయించాలని అనుకుంటారు. కానీ అతనికి కాస్త దూరంగా ఉన్న కుమారుడు సెంథిల్, సాంప్రదాయ వైద్యుడి వద్ద చికిత్స కోసం అతని పూర్వీకుల గ్రామానికి తీసుకువెళతాడు. ఎనిమిది రోజుల తర్వాత, కరుప్పసామి మరణిస్తాడు. అతని అంత్యక్రియల సమయంలో, కరుప్పసామి హత్యకు గురయ్యాడని ఒక వృద్ధ మహిళ చెబుతుంది. కరుప్పసామిని ఎవరు చంపారు?

తారాగణం

[మార్చు]
  • కరుప్పసామిగా ఆర్. రాజు [3]
  • మెన్మోళిగా జయలక్ష్మి [3]
  • సెంథిల్‌గా సుపా ముత్తుకుమార్ [3]
  • మురుగన్‌గా పి. సమానరాజా [3]
  • మణిగా ప్రేమ్‌నాథ్ వి [3]
  • స్టెల్లాగా స్టెల్లా గోబీ [3]
  • మురుగన్ భార్యగా ఫరీదా [3]
  • సుగుమార్ షణ్ముగం వీరాగా [3]

నిర్మాణం

[మార్చు]

తన తొలి చలనచిత్రం 'గంగూబాయి'ని నిర్మించిన తర్వాత, ప్రియా కృష్ణస్వామి ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌లలో తలైకూతల్ ఆచారం గురించిన వార్తలను చూసింది. మరింత పరిశోధన తర్వాత, ఆమె ఇంతకు ముందు ఎప్పుడూ వినని తలైకూతల్ అనే దృగ్విషయం వాస్తవానికి, గ్రామీణ తమిళనాడులోని విస్తృత ప్రాంతాలలో సామాజిక ఆమోదం పొందిన కొనసాగుతున్న సాంస్కృతిక ఆచారం అని ఆమె గ్రహించింది. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతున్న సమస్య. వృద్ధుల కోసం సామాజిక, వైద్య మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం గురించి ఆందోళన చెందుతూ, ఆమె 2016 మధ్యలో రెండు వారాల్లో బారం స్క్రిప్టును రాసుకుంది. ఆర్ద్ర స్వరూప్‌తో కలిసి ఏర్పాటు చేసిన తన బ్యానర్ 'రెక్‌లెస్ రోజెస్' కింద ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించాలని నిర్ణయించుకుంది. దీని ప్రకారం, వారు పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలోని పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగాన్ని సంప్రదించారు, అక్కడ ప్రియా నటన వర్క్‌షాప్‌లు నిర్వహించి, ప్రధాన తారాగణాన్ని ఎంచుకుంది.[4] 80 కంటే ఎక్కువ మంది అదనపు పాత్రలను నటులు కాని స్థానికులు పోషించారు. ఈ సినిమాను డాగ్మే స్కూల్ ఆఫ్ సినిమా తరహా వాస్తవిక శైలిలో, లాంగ్ టేక్స్, హ్యాండ్‌హెల్డ్ షాట్స్, సింక్ సౌండ్‌తో చిత్రీకరించారు. డైలాగులను డబ్బింగ్ చేయలేదు.[5] దీనిని 2017 జనవరిలో 18 రోజుల్లో పాండిచ్చేరి, తిరునల్వేలిలలో చిత్రీకరించారు. [6] [7]

ఉత్సవాలు, అవార్డులు

[మార్చు]

బారం 2018 నవంబరులో గోవాలోని 49వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది.[8] ఇది 2018లో గోవాలోని IFFIలో ICFT UNESCO గాంధీ పతకానికి నామినేట్ చేయబడిన రెండు భారతీయ చిత్రాలలో ఒకటి.[9] [10] ICFT UNESCO గాంధీ పతకం అనేది పారిస్‌లోని జ్యూరీచే మూల్యాంకనం చేయబడిన IFFI యొక్క అంతర్జాతీయ పోటీ విభాగం.[11] తరువాత బారం 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[12][13] ఇది 2020 ఫిబ్రవరి 21 న భారతీయ థియేటర్లలో విడుదలైంది.[14]

విమర్శకుల ఆదరణ

[మార్చు]

49వ IFFIలో సినీస్తాన్ ఈ చిత్రానికి 5కి 4 స్టార్లు ఇచ్చి, "బారం అనేది అందంగా రూపొందించబడిన సామాజిక చిత్రం, ఇది మీరు చేసే పనులను మీరే ప్రశ్నించుకునేలా చేస్తుంది. కరుణ హత్య అనే తీవ్రమైన విషయంపై మీ వైఖరిని పునరాలోచించుకునేలా చేస్తుంది" అని రాసింది.[15] పూడిపెద్ది హరిచరణ్ హిందూస్తాన్ టైమ్స్‌లో ఇలా రాశాడు, 'ఒక వాస్తవ సంఘటన నుండి ప్రేరణ పొందిన హృదయ విదారక కథతో ప్రేక్షకులను వారి సీట్లలో కదిలించేలా చేసినప్పటికీ, బారం ఒక అందమైన, వాస్తవ సంబంధ సామాజిక చిత్రం.' టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎం. సుగంధ్ దీనిని 5 కి 3 రేటింగ్ ఇచ్చారు. 'బిహైండ్‌వుడ్స్' దీనిని 5కి 3 రేటింగ్ ఇచ్చింది, "బారం అనేది చాలా అరుదుగా మాట్లాడే సామాజిక సమస్యపై వచ్చిన చిత్రం. తప్పక చూడండి". [16] ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనిని 5కి 3 స్టార్లు ఇచ్చింది. [17] ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దీనిని 5కి 3.5 స్టార్లు ఇచ్చింది, "బారం అనేది పురాతనమైన హేయమైన సంప్రదాయం, తలైకూతల్‌ను నొక్కి చెప్పే అవసరమైన చిత్రం" అని పేర్కొంది. [18] ఫిల్మ్ కంపానియన్ "దర్శకురాలు తన దూరాన్ని పాటిస్తుంది. శ్రద్ధగల రిపోర్టర్ లాగా, ఆమె (1) తలైకూతల్ ఎలా నిర్వహించబడుతుంది, (2) ఎవరైనా ఈ విధంగా చంపబడ్డారని మీకు తెలిస్తే మీరు ఏమి చేస్తారు" అనే దానిపై ఆమెకు ఆసక్తి ఉంది" అని పేర్కొంది. [19]

మూలాలు

[మార్చు]
  1. Chatterjee, Saibal (13 April 2020). "10 Must-Watch South Indies To Put On Your Netflix And Prime List". NDTV. Archived from the original on 13 April 2020. Retrieved 2021-07-02.
  2. "Looking for options other than Holly, Bolly and Tolly to stream this lockdown?". www.telegraphindia.com. Archived from the original on 13 May 2021. Retrieved 2021-07-02.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 Suganth, M. "Baaram Movie Review : The arthouse approach is both a plus and a minus". The Times of India. Retrieved 21 February 2020.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  4. Chatterjee, Saibal (13 April 2020). "10 Must-Watch South Indies To Put On Your Netflix And Prime List". NDTV. Archived from the original on 13 April 2020. Retrieved 2021-07-02.
  5. "Looking for options other than Holly, Bolly and Tolly to stream this lockdown?". www.telegraphindia.com. Archived from the original on 13 May 2021. Retrieved 2021-07-02.
  6. Jesudasan, Dennis S. (2018-10-16). "Highlighting a disgrace called Thalaikoothal". The Hindu. Retrieved 12 August 2019.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  7. "'Baaram Moved People'". The New Indian Express. 2 December 2018. Archived from the original on 10 August 2019. Retrieved 12 August 2019.
  8. Chatterjee, Saibal (13 April 2020). "10 Must-Watch South Indies To Put On Your Netflix And Prime List". NDTV. Archived from the original on 13 April 2020. Retrieved 2021-07-02.
  9. "Looking for options other than Holly, Bolly and Tolly to stream this lockdown?". www.telegraphindia.com. Archived from the original on 13 May 2021. Retrieved 2021-07-02.
  10. Chatterjee, Saibal (13 April 2020). "10 Must-Watch South Indies To Put On Your Netflix And Prime List". NDTV. Archived from the original on 13 April 2020. Retrieved 2021-07-02.
  11. "Looking for options other than Holly, Bolly and Tolly to stream this lockdown?". www.telegraphindia.com. Archived from the original on 13 May 2021. Retrieved 2021-07-02.
  12. Jesudasan, Dennis S. (2018-10-16). "Highlighting a disgrace called Thalaikoothal". The Hindu. Retrieved 12 August 2019.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  13. "'Baaram Moved People'". The New Indian Express. 2 December 2018. Archived from the original on 10 August 2019. Retrieved 12 August 2019.
  14. "Baaram gets a release date". The Times of India. 27 January 2020. Retrieved 12 February 2020.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
  15. Chatterjee, Saibal (13 April 2020). "10 Must-Watch South Indies To Put On Your Netflix And Prime List". NDTV. Archived from the original on 13 April 2020. Retrieved 2021-07-02.
  16. "Looking for options other than Holly, Bolly and Tolly to stream this lockdown?". www.telegraphindia.com. Archived from the original on 13 May 2021. Retrieved 2021-07-02.
  17. Chatterjee, Saibal (13 April 2020). "10 Must-Watch South Indies To Put On Your Netflix And Prime List". NDTV. Archived from the original on 13 April 2020. Retrieved 2021-07-02.
  18. "Looking for options other than Holly, Bolly and Tolly to stream this lockdown?". www.telegraphindia.com. Archived from the original on 13 May 2021. Retrieved 2021-07-02.
  19. Jesudasan, Dennis S. (2018-10-16). "Highlighting a disgrace called Thalaikoothal". The Hindu. Retrieved 12 August 2019.{{cite news}}: CS1 maint: deprecated archival service (link)
"https://te.wikipedia.org/w/index.php?title=బారమ్&oldid=4718232" నుండి వెలికితీశారు