బార్మర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Barmer district జిల్లా

बाडमेर जिला
దేశంభారతదేశం
రాష్ట్రంRajasthan
పరిపాలన విభాగముJodhpur Division
ముఖ్య పట్టణంBarmer, Rajasthan
విస్తీర్ణం
 • మొత్తం28,387 కి.మీ2 (10,960 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం26,03,751
 • సాంద్రత92/కి.మీ2 (240/చ. మై.)
 • పట్టణ
6.98
జనగణాంకాలు
 • అక్షరాస్యత56.53
 • లింగ నిష్పత్తి902
ప్రధాన రహదార్లుNH 15, NH 112
అక్షాంశరేఖాంశాలు70°50′N 72°52′E / 70.83°N 72.87°E / 70.83; 72.87-24°58′N 26°32′E / 24.97°N 26.53°E / 24.97; 26.53
జాలస్థలిఅధికారిక జాలస్థలి
Barmer District in Rajasthan

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో బార్మర్ జిల్లా ఒకటి.[1] రాజస్థాన్ రాష్ట్రంలో వైశాల్యపరంగా బార్మర్ 2వ స్థానంలో ఉంది. బార్మర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలో బలోత్రా, గుడమాలని, బేటూ, సివన, జాసో, చొహతన్ మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి. సమీపకాలంలో బార్మర్ జిల్లాలో చమురు నిల్వలు వెలువడ్డాయి.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

13వ శతాబ్దంలో బార్మర్ నగరాన్ని బహద రావు పర్మర్ (పంవర్) లేక బార్ రావు పార్మర్ స్థాపించాడని అనుదువలన నగరం ముందుగా బహదామర్ అని పిలువబడిందని క్రమంగా అదే బార్మర్‌గా మారిందని భావిస్తున్నారు.

భౌగోళికం[మార్చు]

బార్మర్ రాజస్థాన్ పశ్చిమ భూభాగంలో ఉంది. ఇది థార్ ఎడారిలో ఒక భాగంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో జైసల్మేర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో జలోర్ జిల్లా, తూర్పు సరిహద్దులో పాలి జిల్లా, జోధ్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్ ఉన్నాయి. జిల్లా వైశాల్యం 28387. .[1] జిల్లా 24,58' నుండి 26, 32' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 70, 05' నుండి 72, 52' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది..[1]

జిల్లాలో ప్రవహిస్తున్న ల్యూని నది పొడవు 480 కి.మీ. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో సంగమిస్తుంది. ఇది జలోర్ జిల్లా గుండా ప్రవహిస్తుంది. వేసవిలో ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుకుంటుంది. శీకాలంలో ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడుకు చేరుకుంటుంది. వార్షిక సరాసరి వర్షపాతం 277 మి.మీ ఉంటుంది.

వరద[మార్చు]

2006లో జిల్లాలో ఆగస్టు 16-25 మధ్య 549 మి.మీ వర్షపాతం కురిసింది. వరద కారణంగా కవాస్ పట్టణం నీట మునిగింది. పలువురు ప్రాణాలను కోల్పోయారు. పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. కొత్తగా 22 సరసులు ఏర్పడ్డాయి. వీటిలో 6 సరసుల వైశాల్యం 10 చ.కి.మీ. బార్మర్ ప్రాంతంలో నగరీకరణ బలహీనంగానూ, వేగవంతంగానూ జరగడం కారణంగా ఎదురుచూడని వరద వలన నష్టం భారీ స్థాయికి చేరుకుంది. ప్రాంతీయ పర్యావరణం, మట్టి తీరు అదనపు వచ్చి చేరిన నీటిని ఎదుకోవడానికి అనుకూలంగా లేదు. వరద ఈ ప్రాంతానికి స్వల్పకాల, దీర్ఘకాల నష్టాన్ని కలిగించింది. మిగిలిన ప్రాంతాలలో కనిపించని నష్టాన్ని కలిగించింది. వరద ప్రజాల జీవితాలను, జీవనోపాధిని తీవ్రంగా బాధించింది. [2]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బార్మర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

సంస్కృతి[మార్చు]

Sand dunes near barmer

బార్మర్ జిల్లా భారతదేశ అతి పెద్ద ఏడారి అయిన థార్ ఎడారిలో భాగంగా ఉంది. ఎడారి ప్రాంతంలోని మిగిలిన జిల్లాల మాదిరిగా బార్మర్ జిల్లా జానపద సంగీతం, జానపద నృత్యానికి ప్రత్యేకత కలిగి ఉంది. బార్మర్‌లో భోప (ప్రీస్ట్ గాయకులు) ఉన్నారు. వీదు ఈ ప్రాంతానికి చెందిన ప్రాంతీయ దైవసమానమైన కథానాయకుల గురించిన గీతాలను రూపకల్పన చేస్తుంటారు. మిగిలిన సంగీత కళాకారులలో ముస్లిం ధోలీలు (డ్రమ్మర్లు) ఉన్నారు. వీరంతా జివనోపాధికి పనిచేస్తుంటారు. కళాకారుల కుటుంబాలు లంగాలు, మంగనియర్లు ముఖులు.

బార్మర్ ఉడన్ ఫర్నీచర్, బ్లాక్ ప్రింటింగ్ ఇండస్ట్రీకి కూడా ఈ జిల్లాకు ప్రాముఖ్యత ఉంది. గ్రామీణ ప్రజలు వారి ఏడారి జీవితానికి సంబంధించిన ప్రత్యేక అలకరణ సామాగ్రిని తయారు చేసుకునే నైపుణ్యం కలిగి ఉన్నారు. గ్రామస్థులు కొందరు వారి గృహాలను గ్రామీణ సస్కృతి ప్రతిబింబించేలా అలకరించుకుని ఉన్నారు.

జసోల్, జునా బర్మర్, ఖెడ్, కిరడు, మల్లొనాథ్ సంత (జంతువుల సంత), మేవా నగర్ (నకొడా), భీంగొడా, అషోతరా, ఇంద్రోలి, బిరత మాతా ఆలయం, టెంపుల్ కనబ (శీతలా ఫెయిర్) చౌతాన్ ఫెయిర్ కూడా ప్రత్యేకత కలిగినవే.తివారా పశువుల సంతకు ప్రతి సంవత్సరం వేలాది పర్యాటకులు హాజరౌతూ ఉంటారు.

భాషలు[మార్చు]

జిల్లాలో ప్రధానంగా రాజస్థానీ భాష వాడుకలో ఉంది. జిల్లాలో హిందీ భాష అధికారభాషగా ఉంది. పర్యాటక అభివృద్ధికి, విద్యాబోధనకు ఆంగ్లభాషకు కూడా ప్రాధాన్యత అధికంగా ఉంది.

పర్యాటక ఆకర్ష్ణలు[మార్చు]

శివన తాలూకాలో ఉన్న పురాతనమైన శివన కోట (గద్ శివానా). ఇది 1000 సంవత్సరాల క్రితం నాటిదని భావిస్తున్నారు.

విభాగాలు[మార్చు]

2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో 2 విభాగాలు ఉన్నాయి : బార్మర్, బల్మొరా[1]

 • జిల్లాలో 11 ఉప విభాగాలు ఉన్నాయి : బార్మర్ (రాజస్థాన్), బలోత్ర, గుదమలని, షెయొ, శివాన,ఛొహ్తన్, బయ్తూ, రంసర్, రాజస్థాన్, రింధరి, సెద్వ,
 • పద్నాలుగు తాలూకా లు: బార్మర్ తాలూకా, బయ్తూ, ఛొహ్తన్,గుధ మలని, పచ్పద్రా, రంసర్ (రాజస్థాన్), షెయొ, శివాన, సందరి, ఢొరిమన్న, గైడ్, రాజస్థాన్, సింధరి, సెద్వ,గద్ర రోడ్, ఢొరిమన.
 • జిల్లాలో 8 గ్రామ పంచాయితీలలో 1,941గ్రామాలు ఉన్నాయి.

థార్ ఎడారిలో ఆయిల్[మార్చు]

2009లో బార్మర్ జిల్లా ఉన్న చమురు నిల్వలు వెలువడ్డాయి. జిల్లాలో ప్రధాన చమురు నిల్వలు మంగళ, భాగ్యం, ఐశ్వర్య ప్రాంతాలలో వెలువడ్డాయి. 22 సంవత్సరాలలో ఇది అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న ప్రాంతంగా ప్రత్యేకత కలిగి ఉంది.[4] ఇందులో కెయిం సస్థకు 70%, ఒ.ఎన్.జి.సి సంస్థకు 30% భాగస్వామ్యం ఉంది. 2010 మార్చి ఈ ఫీల్డ్ నుండి ఉత్పత్తి 4 నుండి 6.5 బిలియన్ బ్యారెల్స్‌కు అభివృద్ధి చేయబడింది. .[5]

అండర్‌గ్రౌండ్ ఎయిర్ బేస్[మార్చు]

బార్మర్ జిల్లాలో " ఉత్తర్‌లై మిలటరీ ఎయిర్ బేస్ " ఉంది. ఇది భారతదేశంలోని మొదటి అండర్‌గ్రౌండ్ ఎయిర్ బేస్‌గా గుర్తించబడుతుంది.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 "District Profile: Barmer". Government of Rajasthan. మూలం నుండి 8 నవంబర్ 2009 న ఆర్కైవు చేసారు. Retrieved 13 నవంబర్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
 2. Local approaches to harmonising climate adaptation and disaster risk reduction: Lessons from India, Anshu Sharma, Sahba Chauhan and Sunny Kumar, SEEDS India, 2014
 3. 3.0 3.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. మూలం (PDF) నుండి 5 ఏప్రిల్ 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 27 September 2011. Cite web requires |website= (help)
 4. "PM to unveil Cairn India's Barmer oilfield soon". 13 Aug 2009. Economic Times. Retrieved 4 May 2010. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
 5. "Cairn revises Barmer oil field upwards to 6.5 bn barrels". 23 March 2010. మూలం నుండి 8 అక్టోబర్ 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 13 నవంబర్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite news requires |newspaper= (help)

వెలుపలి లింకులు[మార్చు]

 • "Official Website". Jodhpur District. మూలం నుండి 2014-12-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-13. Cite web requires |website= (help)
 • "District Barmer: Gram Panchayat, Samiti and Ward Map". Excise Department, Government of Rajasthan. మూలం నుండి 2013-05-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-13. Cite web requires |website= (help)
 • Sethi, Supreet (27 June 2008). "Place to see: Barmer, Jodhpur, India". Everywhere (travel magazine). మూలం నుండి 30 జూన్ 2008 న ఆర్కైవు చేసారు. Retrieved 13 నవంబర్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)

వెలుపలి లింకులు[మార్చు]