బాలకృష్ణుడు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాలకృష్ణుడు
దర్శకత్వంపవన్ మల్లెల
నిర్మాతబి.మహేంద్ర బాబు
ముసునూరి వంశీ
శ్రీ వినోద్ నందమూరి
రచనరాజ కొలుసు
నటులునారా రోహిత్
రెజీనా
రమ్యకృష్ణ
వెన్నెల కిశోర్
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుకొటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
శరస్చంధ్రికా విజనరి మొషన్ పిక్చర్స్
మాయాబజార్ మూవీస్
విడుదల
24 నవంబరు 2017. [1]
నిడివి
130 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

బాలకృష్ణుడు తెలుగు రొమాంటిక్ మరియు యాక్షన్ చిత్రం, నారా రోహిత్, రెజినా కాసాండ్రా మరియు రమ్య కృష్ణన్ ప్రధాన పాత్రలలో నటించారు. [2] [3][4] ఈ సినిమాకి ఆస్ట్రేలియా నుంచి సినిమా రంగంలో గ్రాడ్యుయేట్ అయిన పవన్ మల్లేల దర్శకత్వం వహించాడు.

చిత్రీకరణ[మార్చు]

ఈ స్క్రిప్టును తయారు చేసుకున్న ఒక సంవత్సరం తర్వాత, 2017 మార్చి 31 లో ప్రారంభమైంది. హైదరాబాదులోని వివిధ ప్రదేశాలలో ఈ చిత్రం యొక్క ప్రధాన భాగం చిత్రీకరించబడింది. పాటలు నార్వేలోని బెర్జెన్ మరియు ఓస్లోలో చిత్రీకరించబడ్డాయి. [5] [6] నిర్మాత నందమూరి శ్రీ వినోద్, ముసునూరువంశీ కృష్ణ మరియు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పవన్ మల్లేల చిన్ననాటి స్నేహితులు. వీరు మాయా బజార్ మూవీస్ యొక్క బి. మహేంద్ర బాబు కలిసి శరత్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మించారు. నారా రోహిత్ తొలిసారిగా కమర్షియల్ సినిమాలో నటించాడు.

కథ[మార్చు]

బాల (నారా రోహిత్)కు డబ్బు మీద అమితంగా ఆసక్తి, అతనికి జీవితంలో అత్యధిక ప్రాముఖ్యత కలిగిన డబ్బును సంపాదించాలనే ఉత్సాహం ఉన్న యువ కుర్రాడు. అతను అనాథగా ఉంటాడు, తన తండ్రి రఘునందన్ యాదవ్ (కోట శ్రీనివాసరావు) చేత పెంచబడ్డాడు. కేవలం డబ్బు మీద ఉన్న అతిప్రేమ కోసం బాలు జీవితం ఒక ఇబ్బందుల్లో ముగుస్తుంది. [7]ఆద్యా (రెజినా కాసాండ్రా) తో అతని ప్రేమ జీవితం కూడా దీని కారణంగా వక్రీకృతమైంది. [8] [9] హీరోయిన్‌గా రెజీనా ఆధ్య పాత్రలోను, కీలకమైన భానుమతి పాత్రలో రమ్యకృష్ణ, విలన్‌గా అజయ్ మరియు డిస్కవరీ ఫొటోగ్రాఫర్ మాధవరావు పాత్రలో పృథ్వీ నటించారు.

కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో 2006 సం.లో సినిమా కథ ప్రారంభమవుతుంది. ప్రజల జీవితాలను మార్చాలనుకునే ప్రజల మనిషి రవీందర్ రెడ్డి (ఆదిత్య), ఇతని చెల్లెలు భానుమతి దేవీ (రమ్యకృష్ణ) ఆలోచనల ప్రకారం ఆప్రాంతంలో కాలేజీలు ఫ్యాక్టరీలు కట్టించడం, అందరికీ చదువు, ఉద్యోగం అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటారు. ప్రజలలో రవీందర్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థి బసిరెడ్డి (మహదేవన్) కుమిలి, రగిలిపోతాడు. తరుపరి రవీందర్ రెడ్డి చేతిలో ఓడిపోయి, ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చావును కళ్లారా చూస్తాడు బసిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్). ఇతను దొంగ దెబ్బతీసి రవీందర్ రెడ్డిని చంపేస్తాడు. అన్న రవీందర్ రెడ్డి (ఆదిత్య)కిచ్చిన మాట కోసం ప్రతాపరెడ్డి (అజయ్)తో పోరాటానికి సిద్ధమవుతుంది భానుమతి. రవీందర్ రెడ్డిని చంపిన కేసులో ప్రతాపరెడ్డి జైలుకెళతాడు. తన అన్నకూతురు ఆధ్య (రెజీనా)ను మాత్రం ఈ ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా భానుమతి పెంచుతుంది. పదకొండేళ్ల తరువాత సత్ప్రవర్తన కింద ప్రతాపరెడ్డి జైలు నుంచి విడుదలవుతున్నాడని తెలుసుకున్న భానుమతి, తన ఆధ్యని కాపాడేందుకు బాలు (నారా రోహిత్)ను బాడీ గార్డ్‌గా ఏర్పాటు చేస్తుంది. ప్రతాపరెడ్డి నుంచి ఆధ్యను బాలు ఎలా కాపాడాడు, అలాగే బాలు, ఆధ్యలు ఎలా దగ్గరయ్యారు, అతిప్రేమ కోసం బాలు జీవితం ఎలా మలుపులు తిరుగుంది అన్నదే మిగతా కథ నడుస్తుంది.

తారాగణం[మార్చు]

బాలకృష్ణ లేక బాలూగా నారా రోహిత్

ఆధ్యా పాత్రలో రెజీనా

భానుమతి దేవిగా రమ్యకృష్ణ

మాడీ ఆర్ గా పృధ్వీరాజ్

రవీందర్ రెడ్డిగా ఆదిత్యా మీనన్

రఘునందన్ యాదవ్ గా కోట శ్రీనివాసరావు

ప్రతాప్ రెడ్డిగా అజయ్

రౌడీగా రఘు కారుమంచి

ఆత్మ బల్లా

వెన్నెల కిశోర్

పెద్ద పాలేరుగా రఘు బాబు

చిట్టి బాబు శ్రీనివాస రెడ్డి

మస్తాన్‌గా రవి వర్మ

అదేవిధంగా దీక్షాపంత్, అవంతిక వందనపు (జూనియర్ ఆధ్యా/రెజీనా కాసాండ్రా), తేజస్వి మదివాడ, సత్య కృష్ణన్, మాధవి ఊట్ల, మధులత రెడ్డి మరియు సన ఇతర పాత్రలలో నటించారు. ప్రత్యేక ప్రదర్శనలో (గెస్ట్ రోల్) పియా బాజ్‌పాయ్ మరియు శ్రావ్య రెడ్డి పద్మగా నటించారు.

సౌండ్ ట్రాక్[మార్చు]

ఆడియో మరియు నేపథ్య సంగీతం మణి శర్మ స్వరపరిచాడు. ఈ చిత్రం యొక్క ఆడియో 2017 నవంబరు 10 లో సమంతా రూత్ ప్రభు చేతుల మీదుగా విడుదలైంది.

మూలాలు[మార్చు]

  1. "Balakrishnudu Movie Release Tomorrow (Nov 24th) Posters". moviegalleri.net. Cite web requires |website= (help)
  2. "Nara Rohit as Balakrishnudu". Deccan Chronicle. Retrieved September 24, 2017. Cite web requires |website= (help)
  3. "Nara Rohith in a new avatar". The Hans India. Retrieved September 24, 2017. Cite web requires |website= (help)
  4. "Balakrishnudu's first look unveile". The Times of India. Retrieved 23 September 2017. Cite news requires |newspaper= (help)
  5. "Nara Rohith's Balakrishudu completes shoot". Telugu Cinema. Cite web requires |website= (help)
  6. "Nara Rohith's BALAKRISHNUDU Shooting Finished". Telugu Mirchi. Cite web requires |website= (help)
  7. "Ramya Krishna in Another Powerful Role". Gulte. మూలం నుండి 2018-02-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-04-18. Cite web requires |website= (help)
  8. "Ramya Krishnan as Paritala Sunitha in Nara Rohit's Balakrishnudu". Tollywood.net. మూలం నుండి 2018-01-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-04-18. Cite web requires |website= (help)
  9. "Ramya Krishna as Paritala Sunita". Chitramala. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]