బాలరామ భరతము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇది సా.శ. 1758 వ సం. నుండి 1798 వరకు కేరళ దేశమును పాలించిన బాలరామవర్మ చే రచింపబడిన ఒక నాట్య శాస్త్రం గ్రంథము.

బాలరామవర్మ[మార్చు]

ఈతని త్రండ్రి పేరు కేరళవర్మ తంపురాన్. తల్లి పార్వతీభాయి. ఈతడు కేరళ దేశమును పాలించిన రాజశ్రేష్ఠులలో కెల్ల ముఖ్యుడు. కృత్తికా నక్షత్ర జన్ముడగుటచే ఈతని కార్తికతిరునాల్ అని కూడా పిలుస్తారు. పుషపు విప్పారగనే వాసనల విరజిమ్మును. తన తల్లి పార్వతీభాయి సోదరుడగు "బాలమార్తాండవర్మ" అదుపాజ్ఞలలోనే పెరిగి పెద్దవాడై విద్యాబుద్ధులను అభ్యసించాడు. అంధుచే ఈతడు భాషావైదుష్యమందును, యుద్ధ నైపుణ్యమందును అసమాన ప్రతిభాసంపన్నుడయ్యెను. ఈతడు బహుభాషా పాండిత్యుడు. ముఖ్యముగా సంస్కృతము, పర్షియన్, హిందుస్తానీ, మలయాళము మొదలగు భాషలయందు ఆరితేరెను. డచ్చి భాష యందు కూడా కొంత సామర్ధ్యము కలదని "పిట్రో దివేగస్" అను ఆంగ్ల దేశస్థుడి ద్వారా తెలుసుకొనినట్లు తెలియుచున్నది.సాహిత్య రంగమున ఎంత ప్రతిభావంతుడో కదనరంగమున అంత ప్రతిభనే సంపాదించాడు. తన మామయ్యకు అనేక యుద్ధములలో సహాయమొనర్చెను. "అంబలపూజ" అనే ప్రదేశమును జయించినప్పుడు ఆఊరి రాజమహల్లో ఉన్న తాళపత్ర గంధములన్నింటినీ సేకరించి తన మహల్కు చేర్చెను. ఈ తాళపత్ర గ్రంథములు నేటికీ తిరువాంకూర్ గ్రంథాలయములో ఉన్నాయి. సా.శ., 1758లో బాలమార్తాండవర్మ చనిపోయిన తరువాత బాలరామవర్మ సింహాసనాధిష్ఠుడై 1798 వరకు నిర్విఘ్నముగా పాలించెను. నేటి తిరువాంకూర్ సంస్థానమంతయు ఆయన చనిపోయిననాటికి స్థాపింపబడినదే అని చెప్పవచ్చును. ఈతడు కవులకు అనేకులకు కల్పతరువు వంటివాడు. సదాశివ దీక్షిత, కళ్యాణ సుబ్రహ్మణ్య, కుంచన్ నంబియార్ వంటి అనేక కవులకు ఆశ్రయము కల్పించాడు.

బాలరామ భరతము[మార్చు]

బాలరామవర్మ భరతుడు రచించిన నాట్య శాస్త్రం తదితరులు రచించిన అనేక నాట్య శాస్త్ర గంధుములన్నియు సాకల్యముగా పరిశీలించి స్వీయానుభవములను క్రోడీకరించి ఈ భరతము ను రచించాడు. అందువలన ఇతరులు చెప్పినదానికిది వ్యాఖ్యాన విపులీకరణమని చెప్పవచ్చును. ఇందులో కోహలుడు హస్త విశేషణములు విస్తృతముగా తెలియపరిచాడు. ఇందులో తాళజ్ఞానము పక్షత్రయ నిరూపణ, వాద్యస్వరూపము, గాత్రభావము, పంచవాద్యములలో ఖండాఖండ భేదములచే నాదములోని ద్వైవిధ్యము మొదలైనవి చెప్పబడినవి. రాగోత్పత్తి ప్రకారము, శృతి స్వరూప కీర్తనము, భావప్రాధాన్య స్థాపనము, వివ్ధములైన వాద్యవిశేషములు విపులీకరించబడినవి.

భరతోత్పత్తి, భరత శబ్దార్ధము, భరత లక్షణ నిర్వచనము తెలియజేయ బడినవి. భావరాగతాళములందు అంగాంగి విచారము, భావనిరూపణము చెప్పబడెను.

ఏకాదశ శిరోభేధములు, వాని లక్షణము, సంయుతా సంయుత హస్తభేధములు, వాని లక్షణ వినియోగములు, హస్తమూలలో స్త్రీ పుంనపుంసక హస్త ప్రదర్శనము, సప్త వక్షోభేధములు, వివర్తితాదిగయా పార్స్వ భేదములు, వాని లక్షణ వినియోగములు, నవకటే భేదములు-లక్షణ వినియోగములు; పంచదశస్థిర పదభేధములు; షోడశాస్థిర పద భేదములు -లక్షణ వినియోగములు; స్థిరాస్థిర పదమేళనములు మొదలైనవై తరువాత చెప్పబడినవి.

పిమ్మట ఇంద్రియములందు, తద్విషయములందు రసాభివ్యంజక ప్రతిపాదనము, నేత్రాది షడుపాంగనములు, భావదృష్టి లక్షణ వినియోగములు, రసములలో పరస్పర జన్య జనక భావప్రతిపాదనము, కాంతాద్యష్టవిధరసదృష్టులు, వాని లక్షణ వినియోగములు, లలితాది వినియోగములు -సహజాది సప్తభ్రుకుటి భేదములు, మతాంతరమైన నవవిధములు, వాని లక్షణ వినియోగములు-ఆవ్ర్తాది షోడశనాశికా లక్షణములు, స్వాస్థ్యాది నవనాసానిల భేదములు, మతాంతరమైన దశావిధ నాసానిలభేధములు, వాని లక్షణ వినియోగములు-మిలితాది పంచదశ చిబుక భేదములు, వాని లక్షణ వినియోగములు; వివర్తాది ద్వాదశాధర భేదములు, వాని లక్షణ వినియోగములు వీనిని రసప్రదర్శనమందు ప్రయోగించు విధానము తెలుపబడినవి.

మూలాలు[మార్చు]

  • భారతి సంచిక.