బాలెంత జ్వరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Streptococcus pyogenes (red-stained spheres) is responsible for most cases of severe puerperal fever. It is commonly found in the throat and nasopharynx of otherwise healthy carriers, particularly during winter. Details: A pus specimen, viewed using Pappenheim's stain @ 900x magnification
బాలెంత జ్వరం
Classification and external resources
ICD-10 O85
ICD-9 672
MeSH D011645

స్త్రీ శిశువుకు జన్మనిచ్చిన తరువాత 21రోజుల నుంచి 29 రోజుల పాటు కొంత బలహీనంగా ఉంటుంది. ఈ సమయంలో ఆమెను బాలింత లేదా బాలెంతగా వ్యవహరిస్తారు.

బాలెంత జ్వరం[మార్చు]

ప్రసవం (Childbirth) అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ జ్వరం (Fever) ఏ కారణం చేత వచ్చినా దానిని బాలెంత జ్వరం (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా ఇన్ఫెక్షన్ (Infection) మూలంగా వస్తుంది.

ఓషధులు, మూలికలు[మార్చు]

సింధువారంటే వావిలి ఆకు - బాలింత వాతం, ఒంటి నొప్పుల నివారణ.

ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకం గా ఇది వాడుక లో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారం లో ఇంగువ ముఖ్యమైన పదార్థం .

ప్రసవం (Childbirth) అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ జ్వరం (Fever) ఏ కారణం చేత వచ్చినా దానిని బాలెంత జ్వరం (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా ఇన్ఫెక్షన్ (Infection) మూలంగా వస్తుంది.

కారణాలు[మార్చు]

  • జననాంగాల్లో ఇన్ఫెక్షన్
  • మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్
  • రొమ్ములో ఇన్ఫెక్షన్
  • సిజేరియన్ ఆపరేషన్ చేసిన పొట్టమీది కుట్లు చీము పట్టడం.
  • రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం
  • మలేరియా, క్షయ మొదలైన వ్యాధులు
  • ఇతర బాక్టీరియా లేదా వైరస్ వ్యాధులు