Jump to content

బాల్టిక్ సముద్రం

అక్షాంశ రేఖాంశాలు: 58°N 20°E / 58°N 20°E / 58; 20
వికీపీడియా నుండి
బాల్టిక్ సముద్రం
Map
బాల్టిక్ సముద్ర ప్రాంతం
ప్రదేశంఐరోపా
అక్షాంశ,రేఖాంశాలు58°N 20°E / 58°N 20°E / 58; 20 (గాట్‌లాండ్ దీవి ఉత్తర కొస నుండి కొద్దిగా తూర్పున)
రకంసముద్రం
సరస్సులోకి ప్రవాహండౌగవా నది, కెమిజోకి, నేమాన్ నది, నేవా, ఓడర్, విస్తులా, లూలె నది, నర్వా నది, టొర్నే
వెలుపలికి ప్రవాహండేనిష్ జలసంధులు
పరీవాహక విస్తీర్ణం1,641,650 కి.మీ2 (633,840 చ. మై.)
ప్రవహించే దేశాలుతీర దేశాలు: డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, జర్మనీ, లాట్వియా, లిథుయేనియా, పోలండ్, రష్యా, స్వీడన్
లోతట్టు దేశాలు: బేలారస్, చెక్ రిపబ్లిక్, నార్వే, స్లొవేకియా, యుక్రెయిన్[1]
గరిష్ట పొడవు1,601 కి.మీ. (995 మై.)
గరిష్ట వెడల్పు193 కి.మీ. (120 మై.)
ఉపరితల వైశాల్యం377,000 కి.మీ2 (146,000 చ. మై.)
సరాసరి లోతు55 మీ. (180 అ.)
గరిష్ట లోతు459 మీ. (1,506 అ.)
21,700 కి.మీ3 (1.76×1010 acre⋅ft)
నిల్వ సమయం25 సంవత్సరాలు
తీరంపొడవు18,000 కి.మీ. (5,000 మై.)
మూలాలు[2]
1 Shore length is not a well-defined measure.

బాల్టిక్ సముద్రం అట్లాంటిక్ మహాసముద్రం లోని భాగం, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, జర్మనీ, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, రష్యా, స్వీడన్, ఉత్తర, మధ్య ఐరోపా మైదానాలచే పరివేష్టితమై ఉంది.

బాల్టిక్ సముద్రం 53°N నుండి 66°N అక్షాంశం వరకు, 10°E రేఖాంశం నుండి 30°E రేఖాంశం వరకూ విస్తరించి ఉంది. ఇదొక షెల్ఫ్ సముద్రం. అట్లాంటిక్‌కు చెందిన ఉపాంత సముద్రం. ఈ రెండింటి మధ్య నీటి మార్పిడి పెద్దగా ఉండదు. అంచేత ఇదొక లోతట్టు సముద్రంగా (ఇన్‌లాండ్ సీ) మారింది. బాల్టిక్ సముద్రం డేనిష్ జలసంధి గుండా ఒరేసుండ్, గ్రేట్ బెల్ట్, లిటిల్ బెల్ట్ ద్వారా కట్టెగాట్‌లోకి ప్రవహిస్తుంది. ఇందులో గల్ఫ్ ఆఫ్ బోత్నియా, బే ఆఫ్ బోత్నియా, గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్, గల్ఫ్ ఆఫ్ రిగా, బే ఆఫ్ గ్డాన్స్క్ ఉన్నాయి.

"బాల్టిక్" కు ఉత్తరాన - 60° ఉత్తర అక్షాంశం వద్ద - ఆలాండ్, గల్ఫ్ ఆఫ్ బోత్నియాలు, ఈశాన్యాన గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్, తూర్పున గల్ఫ్ ఆఫ్ రీగా, పశ్చిమాన దక్షిణ స్కాండినేవియన్ ద్వీపకల్పంలోని స్వీడిష్ భాగాలు సరిహద్దులుగా ఉన్నాయి.

నిర్వచనాలు

[మార్చు]

పరిపాలన

[మార్చు]

బాల్టిక్ సముద్ర ప్రాంతపు సముద్ర పర్యావరణ పరిరక్షణపై హెల్సింకి కన్వెన్షన్‌లో బాల్టిక్ సముద్రం, కట్టెగాట్ ఉన్నాయి. కట్టెగాట్‌ను బాల్టిక్ సముద్రంలో భాగంగా ఈ ఒప్పందం పరిగణించదు. "ఈ ఒప్పందపు ప్రయోజనాల కోసం 'బాల్టిక్ సముద్ర ప్రాంతం' లో బాల్టిక్‌ సముద్రం, బాల్టిక్ సముద్రానికి ప్రవేశాలు ఉంటాయి. సరిహద్దుగా 57°44.43'N వద్ద స్కాగెరాక్‌లోని స్కావ్ సమాంతరం ఉంటుంది." [3]

ట్రాఫిక్ చరిత్ర

[మార్చు]

చారిత్రికంగా డెన్మార్క్ రాజ్యం, సముద్రానికీ భూపరివేష్ఠిత బాల్టిక్ సముద్రానికీ మధ్య ఉన్న సరిహద్దు వద్ద ఓడల నుండి పన్నులను వసూలు చేసేది. హెల్సింగోర్ సమీపంలోని క్రోన్‌బోర్గ్ కోటలోని ఓరెసుండ్‌లో ; నైబోర్గ్ వద్ద గ్రేట్ బెల్ట్‌లో ; లిటిల్ బెల్ట్‌లో దాని ఇరుకైన భాగంలో ఫ్రెడెరిసియా వద్ద ఈ పన్నులు వసూలు చేసేది. లిటిల్ బెల్ట్‌లోని సన్నటి భాగమే మిడిల్‌ఫార్ట్ సమీపంలోని "మిడిల్‌ఫార్ట్ సుండ్".[4]

ప్రధాన నదులు

[మార్చు]
పేరు. సగటు ప్రవాహం పొడవు. పరీవాహక ప్రాంతం పరీవాహక ప్రాంతాన్ని పంచుకుంటున్న దేశాలు అత్యంత పొడవైన ప్రవాహాలు
m3/s cu ft/s కి. మీ. మై km2 sq mi
నెవా (నామినల్) 2,500 88,000 74 46 281,000 108,000 రష్యా, ఫిన్లాండ్ (లడోగా-సంపన్న వుయోక్సి) సునా (280 కి.మీ.; 170 మై. కిమీ) 170 → ఒనేగా సరస్సు (160 కి.మీ.; 99 మై. కిమీ) 99 → స్విర్ (224 కి.మీ.; 139 మై. కిమీ) 139 → లడోగా సరస్సు (122 కి.మీ.; 76 మై. కిమీ) 76 → నెవా
నెవా (హైడ్రోలాజికల్) 2,500 88,000 860 530 281,000 108,000
విస్తులా 1,080 38,000 1,047 651 194,424 75,068 పోలాండ్, ఉపనదులుః బెలారస్, ఉక్రెయిన్, స్లొవేకియా బగ్ (774 కి.మీ.; 481 మై. km) 481 mi → నరేవ్ (22 కి.మీ.; 14 మై. km) 14 mi → విస్టులా (156 కి.మీ.; 97 మై. km) 97 mi) మొత్తం 1204 కి.మీ.; 127 మై. km * 127 mi
దౌగవా 678 23,900 1,020 630 87,900 33,900 రష్యా (మూలంః బెలారస్, లాట్వియా)
నేమాన్ 678 23,900 937 582 98,200 37,900 బెలారస్ (మూలంః లిథువేనియా, రష్యా)
కెమిజోకి (ప్రధాన నది) 556 19,600 550 340 51,127 19,740 ఫిన్లాండ్, నార్వే (మూలం ఔనాస్జోకి) పొడవైన ఉపనది కిటినెన్కిటీన్
కెమిజోకి (నది వ్యవస్థ) 556 19,600 600 370 51,127 19,740
అంతకంటే ఎక్కువ 540 19,000 866 538 118,861 45,892 చెక్ రిపబ్లిక్ (మూలంః పోలాండ్, జర్మనీ) వార్ట (808 కి.మీ.; 502 మై. km) 502 mi → ఒడెర్ (180 కి.మీ.; 110 మై. km) 110 mi) మొత్తం 928 కి.మీ.; 577 మై. km) 577 mi
లవ్ 506 17,900 461 286 25,240 9,750 స్వీడన్
నార్వా (నామినల్) 415 14,700 77 48 56,200 21,700 రష్యా (మూలం వెలికాయా ఎస్టోనియా) 145 కి.మీ.; 90 మై. (430 కి.మీ.; 270 మై. కిమీ270 → లేక్ పీపుస్ (145 కిమీ2 90 మై2 → నార్వా
నార్వా (హైడ్రోలాజికల్) 415 14,700 652 405 56,200 21,700
టోర్న్ ఆల్వ్ (నామినల్) 388 13,700 520 320 40,131 15,495 నార్వే (మూలంః స్వీడన్, ఫిన్లాండ్) Válfojohka → Kamajåkka → Abiskojaure → Abiskojokk (మొత్తం 40 కి.మీ.; 25 మై. km ′ 25 mi ′ → Torneträsk (70 కి.మీ.; 43 మై. km ′ 43 mi ′ ′ → Torne Ålv
టోర్న్ ఆల్వ్ (హైడ్రోలాజికల్) 388 13,700 630 390 40,131 15,495

ద్వీపాలు, ద్వీపసమూహాలు

[మార్చు]
ఫిన్లాండ్‌లోని ఆలాండ్ ద్వీపసమూహం. బాల్టిక్ సముద్రంలోని అనేక ద్వీపసమూహాలలో స్కెర్రీలు భాగం.
స్టాక్‌హోమ్ ద్వీపసమూహం
డెన్మార్క్‌లోని బోర్న్‌హోమ్ విహంగ దృశ్యం
స్వీడన్‌లోని ఓలాండ్‌లో

తీరప్రాంత దేశాలు

[మార్చు]
బాల్టిక్ సముద్ర పరీవాహక ప్రాంతంలో జనసాంద్రత

బాల్టిక్ సముద్రం సరిహద్దుగా ఉన్న దేశాలు: డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, జర్మనీ, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, రష్యా, స్వీడన్.

బయటి పరీవాహక ప్రాంతంలోని దేశాలు: బేలారస్, చెక్ రిపబ్లిక్, నార్వే, స్లోవేకియా, ఉక్రెయిన్.

బాల్టిక్ సముద్ర పరీవాహక ప్రాంతం, సముద్ర ఉపరితల వైశాల్యం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ఈ ప్రాంతంలో దాదాపు 48% అడవులు ఉన్నాయి. స్వీడన్, ఫిన్లాండ్‌లలో, ముఖ్యంగా బోత్నియా, ఫిన్లాండ్ గల్ఫ్‌ల చుట్టూ, ఎక్కువ అటవీ ప్రాంతాలున్నాయి.

బాల్టిక్ సముద్ర తీరాన దాదాపు 20% భూమిలో వ్యవసాయం, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఇవి ప్రధానంగా పోలాండ్‌లోను, ఆ తరువాత జర్మనీ, డెన్మార్క్, స్వీడన్‌లలోనూ ఉన్నాయి. బేసిన్‌లో దాదాపు 17% ఉపయోగించని బహిరంగ భూమి, మరో 8% చిత్తడి నేలలూ ఉన్నాయి. ఈ చిత్తడి నేలల్లో ఎక్కువ భాగం బోత్నియా, ఫిన్లాండ్ గల్ఫ్‌లలో ఉన్నాయి.

మిగిలిన భూమి అధిక జనాభాతో నిండి ఉంది. బాల్టిక్ డ్రైనేజీ బేసిన్‌లో దాదాపు 8.5 కోట్ల మంది నివసిస్తున్నారు. వీరిలో పోలాండ్‌లో 45% నివసిస్తూండగా, రష్యాలో 12%, స్వీడన్‌లో 10%, ఇతర దేశాల్లో ఒక్కొక్కదానిలో 6% కంటే తక్కువగా ఉన్నారు.

"బాల్టిక్ సీ ఎనామలీ"

[మార్చు]

"బాల్టిక్ సీ అనామలీ" అనేది 2011 జూన్‌లో ఉత్తర బాల్టిక్ సముద్రం అడుగుభాగంలో స్వీడిష్ సాల్వేజ్ డైవర్లు తీసిన అస్పష్టమైన సోనార్ చిత్రంలో కనిపించిన ఒక లక్షణం. ఆ చిత్రంలో అసాధారణ లక్షణాలతో కూడిన వస్తువు కనిపిస్తోందని నిధి వేటగాళ్ళు చెప్పారు. టాబ్లాయిడ్ వార్తాపత్రికలలో ప్రచురించబడిన ఊహాగానాల్లో ఆ వస్తువు మునిగిపోయిన అంతు తెలియని ఎగిరే వస్తువు అని రాసాయి. ఈ చిత్రంలో కనిపించేది సహజ భౌగోళిక నిర్మాణమేనని నిపుణులు, శాస్త్రవేత్తల ఏకాభిప్రాయం.[5][6][7][8]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
జర్మనీలోని సెల్లిన్‌లో పాదచారుల పియర్

డెన్మార్క్‌లోని గ్రేట్ బెల్ట్ బ్రిడ్జి (1997లో పూర్తయింది), డెన్మార్క్‌ను స్వీడన్‌తో కలిపే ఓరెసుండ్ బ్రిడ్జి -సొరంగాల (1999లో పూర్తయింది) నిర్మాణంతో స్వీడన్, డానిష్ ప్రధాన భూభాగాల (జట్లాండ్ ద్వీపకల్పం, ఖచ్చితంగా జిలాండ్ ) మధ్య హైవే, రైలుమార్గ సంబంధాలు ఏర్పడ్డాయి. ఓరెసుండ్ బ్రిడ్జ్-టన్నెల్ సముద్రగర్భ సొరంగం, బాల్టిక్ సముద్రంలోకి పెద్ద నౌకల రాకపోకలకు వీలు కలిగిస్తుంది. రష్యా పెట్రోలియం ఎగుమతికి బాల్టిక్ సముద్రం ప్రధాన వాణిజ్య మార్గం. బాల్టిక్ సముద్రంలో నీటి మార్పిడి చాలా నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి, ఈ ట్యాంకర్లలో పెద్దయెత్తున చమురు లీకైతే, అది బాల్టిక్‌కు వినాశకరమౌతుంది. బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్న పర్యాటక పరిశ్రమ సహజంగానే ఈ చమురు కాలుష్యం పట్ల ఆందోళన చెందుతోంది. 

బాల్టిక్ సముద్రం చుట్టూ ఉన్న నౌకా నిర్మాణకేంద్రాలలో పెద్దయెత్తున నౌకానిర్మాణం జరుగుతుంది. అతిపెద్ద షిప్‌యార్డ్‌లు: పోలండులో గ్డాన్‌స్క్, డైనియా,సెసిన్; జర్మనీలో కీల్; స్వీడన్‌లో కార్ల్స్‌క్రోనా, మాల్మో; ఫిన్లాండ్‌లో రౌమా, తుర్కు, హెల్సింకి; లాట్వియాలో రిగా, వెంట్స్పిల్స్, లిపాజా; లిథువేనియాలో క్లైపేడా; రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్.

బాల్టిక్ సముద్రంలో స్కాండ్‌లైన్స్, సిల్జా లైన్, పోల్‌ఫెర్రీస్, వైకింగ్ లైన్, టాలింక్, సూపర్‌ఫాస్ట్ ఫెర్రీస్ వంటి అనేక కార్గో, ప్యాసింజర్ ఫెర్రీలు నడుస్తున్నాయి.

డెన్మార్క్, జర్మనీల మధ్య ఫెహ్మార్న్ బెల్ట్ ఫిక్స్‌డ్ లింక్ సొరంగ నిర్మాణం 2029 లో పూర్తవుతుంది. ఈ మూడు గొట్టాల సొరంగంలో నాలుగు వరుసల రోడ్లు, రెండు రైలు మార్గాలు ఉంటాయి.

ఆఫ్‌షోర్ పవన విద్యుత్ అభివృద్ధి ద్వారా బాల్టిక్ సముద్రం, ఈ ప్రాంతంలోని దేశాలకు ప్రధాన శక్తి వనరుగా మారుతుందని భావిస్తున్నారు. 2022 లో తయారైన మారియన్‌బోర్గ్ డిక్లరేషన్ ప్రకారం 2030 నాటికి ఐరోపా సమాఖ్య లోని బాల్టిక్ సముద్ర దేశాలన్నీ కలిపి 19.6 గిగావాట్ల ఆఫ్‌షోర్ పవన విద్యుత్తు సామర్థ్యం సాధించాలనే ఉద్దేశాన్ని ప్రకటించాయి.[9]

హెల్సింకీ ఒప్పందం

[మార్చు]

1974 సమావేశం

[మార్చు]

మొట్టమొదటిసారిగా, మొత్తం సముద్రం చుట్టూ ఉన్న కాలుష్య వనరులన్నింటినీ ఒకే ఒప్పందం లోకి చేర్చారు. దీనిపై 1974 లో ఏడు బాల్టిక్ తీరప్రాంత దేశాలు సంతకం చేశాయి. 1974 ఒప్పందం, 1980 మే 3 న అమల్లోకి వచ్చింది.

1992 సమావేశం

[మార్చు]

అంతర్జాతీయ పర్యావరణ, సముద్ర చట్టంలో వచ్చిన రాజకీయ మార్పులు పరిణామాల దృష్ట్యా, బాల్టిక్ సముద్రం సరిహద్దులో ఉన్న ఐరోపా సమాఖ్య దేశాలన్నీ 1992లో ఒక కొత్త ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం 2000 జనవరి 17 న అమల్లోకి వచ్చింది. బాల్టిక్ సముద్ర ప్రాంతం మొత్తం, లోతట్టు జలాలు, సముద్రపు నీరు, అలాగే సముద్రగర్భం ఈ ఒప్పందంలో భాగం. బాల్టిక్ సముద్రపు మొత్తం పరీవాహక ప్రాంతంలో భూ ఆధారిత కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా చర్యలు తీసుకున్నారు. బాల్టిక్ సముద్ర ప్రాంత సముద్ర పర్యావరణ పరిరక్షణపై కుదిరిన ఈ 1992 ఒప్పందం, 2000 జనవరి 17 న అమల్లోకి వచ్చింది.

ఈ ఒప్పందపు పాలక మండలిని హెల్సింకి కమిషన్ అంటారు.[10] దీనిని హెల్కామ్ లేదా బాల్టిక్ మెరైన్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ అని కూడా అంటారు. ఈ ఒప్పందం లోని పక్షాలు డెన్మార్క్, ఎస్టోనియా, యూరోపియన్ కమ్యూనిటీ, ఫిన్లాండ్, జర్మనీ, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, రష్యా, స్వీడన్.

ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమ్యూనిటీ, జర్మనీ, లాట్వియా, స్వీడన్ 1994 లో ధ్రువీకరించగా, ఎస్టోనియా, ఫిన్లాండ్‌లు 1995 లో, డెన్మార్క్ 1996 లో, లిథువేనియా 1997 లో, పోలాండ్, రష్యాలు 1999 నవంబరులో ధ్రువీకరించాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Coalition Clean Baltic". Archived from the original on 2 June 2013. Retrieved 5 July 2013.
  2. Gunderson, Lance H.; Pritchard, Lowell (1 October 2002). Resilience and the Behavior of Large-Scale Systems. Island Press. ISBN 9781559639712 – via Google Books.
  3. "Text of Helsinki Convention". Archived from the original on 2 May 2014. Retrieved 26 April 2014.
  4. "Sundzoll". Academic dictionaries and encyclopedias. Archived from the original on 2 October 2022. Retrieved 16 June 2022.
  5. Mikkelson, David (9 January 2015). "UFO at the Bottom of the Baltic Sea? Rumor: Photograph shows a UFO discovered at the bottom of the Baltic Sea". Urban Legends Reference Pages© 1995-2017 by Snopes.com. Snopes.com. Archived from the original on 30 May 2020. Retrieved 1 August 2017.
  6. Kershner, Kate (7 April 2015). "What is the Baltic Sea anomaly?". How Stuff Works. HowStuffWorks, a division of InfoSpace Holdings LLC. Archived from the original on 12 October 2017. Retrieved 1 August 2017.
  7. Wolchover, Natalie (30 August 2012). "Mysterious' Baltic Sea Object Is a Glacial Deposit". Live Science. Live Science, Purch. Archived from the original on 2 August 2017. Retrieved 1 August 2017.
  8. Interview of Finnish planetary geomorphologist Jarmo Korteniemi (at 1:10:45) on Mars Moon Space Tv (30 January 2017), Baltic Sea Anomaly. The Unsolved Mystery. Part 1-2, archived from the original on 17 ఆగస్టు 2021, retrieved 14 March 2018{{citation}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. Trakimavicius, Lukas. "A Sea of Change: Energy Security in the Baltic region". EurActiv (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 26 July 2023. Retrieved 26 July 2023.
  10. Helcom : Welcome Archived 6 మే 2007 at the Wayback Machine.