Jump to content

బాల్ గోవింద్ వర్మ

వికీపీడియా నుండి
బాల్ గోవింద్ వర్మ

పదవీ కాలం
1980 – 1980
ముందు సూరత్ బహదూర్ షా
తరువాత ఉషా వర్మ
పదవీ కాలం
1962 – 1977
ముందు కుష్వక్త్ రాయ్
తరువాత సూరత్ బహదూర్ షా
నియోజకవర్గం ఖేరీ

వ్యక్తిగత వివరాలు

జననం (1923-08-20) 1923 ఆగస్టు 20 (వయసు: 103)
ఛెటోనియా, లఖింపూర్ ఖేరీ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం.
మరణం 1980
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఉషా వర్మ
సంతానం రవి ప్రకాష్ వర్మ
నివాసం లఖింపూర్, ఖేరీ, ఉత్తర ప్రదేశ్
వృత్తి రాజకీయ నాయకుడు

బాల్ గోవింద్ వర్మ (జననం 1923 ఆగస్టు 20) భారతదేశానికి చెందిన జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు. ఆయన ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బాల్ గోవింద్ వర్మ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1962, 1967 & 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1973 ఫిబ్రవరి 5 నుండి 1973 నవంబర్ 9 వరకు కేంద్ర నీటి పారుదల, విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ లోక్‌దళ్ అభ్యర్థి ఎస్.బి. షా చేతిలో 74304 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

బాల్ గోవింద్ వర్మ 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖేరీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ (సెక్యూలర్) అభ్యర్థి ఎస్.బి. షాపై 81306 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "U.P.: Amid tussle, SP leader set to join Congress". Hindustan Times. 3 November 2023. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
  2. ↑ "Kheri Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 1 July 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
  3. ↑ "Kheri Lok Sabha Election". Hindustan Times. 1 July 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.