బాసర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Gnana Saraswati Temple
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము
Gnana Saraswati Templeశ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము is located in తెలంగాణ
Gnana Saraswati Temple
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము
Location in Telangana
భౌగోళికాంశాలు: 18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639Coordinates: 18°52′40″N 77°57′23″E / 18.87778°N 77.95639°E / 18.87778; 77.95639
పేరు
స్థానిక పేరు: Shri Gnana Saraswati Temple
శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము
స్థానము
దేశము: భారతదేశం
రాష్ట్రము: తెలంగాణ
ప్రదేశము: బాసర
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం: సరస్వతి
నిర్మాణ శైలి: దక్షిణ భారతదేశం
బాసరలో సరస్వతి మూర్తి
బాసర
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్ జిల్లా
మండలం బాసర
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,865
 - పురుషుల సంఖ్య 2,868
 - స్త్రీల సంఖ్య 2,997
 - గృహాల సంఖ్య 1,362
పిన్ కోడ్ 504101
ఎస్.టి.డి కోడ్

బాసర, (Basara) తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని పుణ్యక్షేత్రం. బాసర, నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన దేవత సరస్వతి అమ్మవారు. భారతదేశంలో ఉన్న రెండు ప్రధాన సరస్వతిదేవి ఆలయాలలో ఇది ఒకటి. మరొక ప్రసిద్ధి చెందిన ఆలయం జమ్ము కాశ్మీర్ లో ఉంది. హిందూ మతం ప్రకారం జ్ఞానాన్ని ప్రసాదించు దేవత సరస్వతి. పెద్దలు తమ పిల్లలకు మొదటిసారి అక్షరాలను నేర్పించే కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అక్షరాభ్యాసం అంటారు. అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే దేవత సరస్వతి కాబట్టి కొంతమంది తమ పిల్లలకు బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అక్షరాభ్యాస కార్యక్రమ వేడుకను జరుపుకుంటారు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

కాచిగూడ-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. దీని స్టేషను కోడ్ BSX. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మఱియు భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం.

చూడదగిన స్థలాలు[మార్చు]

ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.

మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సుచేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒకోప్రక్క ఒకో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం, సూర్యతీర్థం, వ్యాసతీర్థం, వాల్మీకి తీర్థం, విష్ణుతీర్థం, గణేషతీర్థం, పుత్రతీర్థం, శివతీర్థం.

ముఖ్యమైన ఉత్సవాలు[మార్చు]

మహా శివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతాయి.

శ్రీ పంచమి[మార్చు]

మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. మహాభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరరించిన కామితార్ధ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలందుకొంటుంది. వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమికి మూడు రోజుల వరకు జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుపుతారు.

మహా శివరాత్రి[మార్చు]

మహా శివరాత్రి పర్వదినం మొదలుకొని మూడు రోజులు పెద్ద జాతర సాగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణాలు ఆచరిస్తారు.

మాధుకరము[మార్చు]

ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి (యాచించుట) ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాలంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.

వసతులు[మార్చు]

ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిథి గృహం, వేములవాడ దేవస్థానం వారిచే నిర్మింపబడిన అతిధిగృహం మాత్రమే ముఖ్య వసతులు. ప్రస్తుతం అనేక లాడ్జీలు నడుపబడుతున్నాయి. ఎపి పర్యాటకం బస్ టిక్కెట్స్ వద్ద టిక్కెట్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఛాయాచిత్రాలను చూడ వచ్చు. వసతి గృహములు :- లగ్జరీ అకామిడేషన్, ఫ్యామిలీ గెస్ట్ హౌస్, బెస్ట్ ఎకనమీ అకామిడేషన్ లాంటి వసతి గృహాలు భక్తులకు ఇక్కడ ఉండడానికి తగిన వసతులు కల్పిస్తున్నాయి.

హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు సౌకర్యం లభిస్తూ ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 35 కి.మీ. దూరం.

చిత్రమాలిక[మార్చు]

వనరులు[మార్చు]

గణాంక వివరాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,865 - పురుషుల సంఖ్య 2,868 - స్త్రీల సంఖ్య 2,997 - గృహాల సంఖ్య 1,362

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=బాసర&oldid=2065946" నుండి వెలికితీశారు