బాస్కెట్ బాల్ యొక్క నియమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాస్కెట్ బాల్ నియమాలు అంటే ఆటకు అనుసరించాల్సిన నియమ నిబందనలు ఆట నిర్వహణ, పరికరాలు, ఆట అడే విధానానికి సంబంధించినవి. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్తో సహా చాలా సంస్థలు తమ స్వంత నియమ నిభందనలు ఏర్పాటు చేసుకుంటాయి. దీనికి తోడు ఇంటర్నేషనల్ బ్యాస్కెట్ బాల్ ఫెడరేషన్ (FIBA) యొక్క టెక్నికల్ కమిషన్ అంతర్జాతియ ఆటకు నియమ నిభందనలు నిర్ణయిస్తుంది.

jhfdehfh[మార్చు]

జేమ్స్ నైస్మిత్ తాను కనుగొన్న బ్యాస్కెట్ బాల్ నియమ నిభందనలు ప్రచురించాడు.[1]

1.) బాల్ ఒకటి లేదా రెండు చేతులతో విసరవచ్చు.

2.) బాల్ ఒకే చేత్తో లేదా రెండు చేతులతో కొట్టవచ్చు.

3.) ఆటగాడు బాల్ తో పరుగెత్తి వెళ్ళకూడదు. ఆటగాడు తాను బంతిని పట్టుకొన్నచొటు నుండే బంతిని విసరాలి. ఇందుకు వేగంగా పరుగేత్తగల వ్యక్తికే అనుమతి ఇవ్వబడును.

4.) బంతిని రెండు చేతులతో పట్టుకోవాలి. ముంజేతులు లేదా శరీరాన్ని ఉపయోగించరాదు.

5.) అవతలి వ్యక్తితో పెనుగులాట, పట్టుకోవడం తోపులాట కొట్టడం తోసివేయడం చేయరాదు. ఈ నిభందన మీరిన ఆటగాడు ఫౌల్ గా భావించబడును. రెండవసారి మీరినచో తర్వాతి బాస్కెట్ వరకు అనర్హునిగా చేస్తారు. అవతలి వ్యక్తిని గాయపరిచినట్లు తేలితే ఆ వ్యక్తిని పూర్తి ఆటకి అనర్హునిగా పరిగణిస్తారు. అతనికి బదులు వెరే వ్యక్తికి అనుమతి లభించదు.

6.) ఫౌల్ అనగా ఆటగాడు బాల్ ను పిడికిలితో గుద్దుట, నిభందనలు మూడు మరియు నాలుగులను మరియు నియమం ఐదులో వివరించిన వాటి అతిక్రమణ.

7.) ఏ వైపు అయినా వరుసగా మూడు సార్లు ఫౌల్స్ చేసినట్లయితే ప్రత్యర్థి జట్టుకు ఒక గోల్ గా భావిస్తారు . (వరుసగా అనగా ఆ సమయంలో ప్రత్యర్థులు లేకుండా ఫౌల్ చేయడమని అర్ధం)

8.) గ్రౌండ్ నుండి బంతిని బాస్కెట్ లోనికి విసురుట లేదా కొట్టిన తర్వాత బంతి కింద పడకుండా అలాగే నిలిచినచో దాన్ని ఒక గోల్ గా పరిగణించబడును కాని అవతలి జట్టు వారు బంతిని గోల్ పడకుండా ప్రతిఘటించుట లేదా తాకుట చేయకుండా ఉండాలి. బంతి అంచులలో నిలిచి, ప్రతిపక్ష జట్టువారు బాస్కెట్ను కదిలించినచో దానిని ఒక గోల్ గా పరిగణిస్తారు.

9.) బంతి బాస్కెట్ అంచులను దాటినచో దానిని ఆట స్థలము లోనికి విసిరి దానిని తాకిన మొదటి వ్యక్తిచే ఆట మొదలుపెట్టబడుతుంది. సమస్య ఉదయించినప్పుడు అంపైర్ స్వయంగా బంతిని క్రిడా స్థలంలోకి విసురుతాడు. బంతిని విసిరెందుకు అయిదు సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. అంతకుమించి బంతిని పట్టుకొని ఉన్నచో, అది ప్రతిపక్ష జట్టుకు చెందుతుంది. ఏ జట్టు అయినా ఆలస్యం చేసినట్లయితే దాని ప్రత్యర్థి జట్టుకు అంపైర్ ఫౌల్ ను అపాదిస్తాడు .

10.) ఆటకు అంపైర్ న్యాయ నిర్ణేత. వరుస ఫౌల్స్ ను ఎంచి రిఫేరీకి తెలియజేస్తాడు. నియమము 5 ప్రకారం ఆటగాళ్ళను అనర్హులుగా నిర్ణయించే అధికారం ఆయనకు ఉంది.

11.) బంతికి సంబంధించినంత వరకు రేఫేరీనే న్యాయ నిర్ణేత. ఇతను బంతి ఎలా ఎగిరింది, అంచులలో ఎలా ఉంది, ఎ జట్టుకు చెందినది మరియు ఎప్పుడు అనేది నిర్ణయిస్తాడు. గోల్ ఎప్పుడు పడింది, ఎన్నిసార్లు బాస్కెట్ లో పడింది, మరియు ఇతర విధులు నిర్వహించే స్కోరు కీపరులా రేఫేరీ వ్యవహరిస్తాడు.

12.) కాల వ్యవధి రెండు పదిహీను నిమిషాలుగా ఉంటూ నడిమధ్య అయిదు నిమిషాల విరామం ఉంటుంది.

13.) నిర్ణీత సమయంలో ఎక్కువ పాయింట్స్ గెలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.

ఈనాటి ఆటలలో కెల్లా ఇది భిన్నమయిన ఆట. ఉదాహరణకు చమటలు పోసేటట్లు మరియు శారీరక అధికశ్రమకు తావు లేదు. దిన్ని గురించిన కొంత పరిణామక్రమం ఈ క్రింద చర్చించబడింది.

ఆటగాళ్ళు, వారికి బదులు ప్రత్యామ్నాయ అభ్యర్ధులు మరియు జట్లు మరియు జట్టు ఆటగాళ్ళు[మార్చు]

నైస్మిత్ గారి ఆట అసలు నియమ నిబందనల్లో ఆట స్థలంలో ఎంత మంది ఆటగాళ్ళు కోర్ట్ లో ఉండాలని పేర్కొనలేదు. 1900 సంవత్సరంలో అయిదు మంది అనేది ప్రామాణికంగా అయింది. ఆటగాళ్లకు బదులు ఆటగాళ్ళను ఆటలో తిరిగి ప్రవేశం అనుమతించలేదు. 1921 సంవత్సరంలో ఆటగాళ్ళ తిరిగి ఒకసారి అనుమతి ఇవ్వడం, 1934లో రెండు సార్లు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1945లో ప్రత్యామ్నాయ ఆటగాళ్ళ సంఖ్య పెరుగడంతో ఈ పద్ధతి పూర్తిగా రద్దు చేయబడింది. వాస్తవంగా శిక్షణ ఆట సమయంలో రద్దు చేయబడింది. కాని 1934 నుండి కాచెస్ ఆటగాళ్ళకు ఉద్దేశించిన ప్రసంగాలకు ఆట ముగిసిన తర్వాత అనుమతి ఇవ్వబడింది.

వాస్తవానికి రెండవ ఫౌల్లో ఆటగాడు అనర్హునిగా చెయ్యబడతాడు. ఈ నిబందన 1911లో నాలుగు ఫౌల్లు గాను మరియు 1945లో అయిదు ఫౌల్లు గాను మారినది. ఏ విదంగా చూసిన గాని బాస్కెట్బాల్ ఆట కాలవ్యవధి (ఓవర్ టైము కాలము ముందు) 40 నిమిషాలే . బాస్కెట్బాల్ ఆట వ్యవధి 48 నిముషాలుగా ఉన్నపుడు (ఈ పరిస్థితి సంయుక్త రాష్ట్రాలలో ఉన్న నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ మరియు ఆస్ట్రేలియాలో ఉన్న నేషనల్ బాస్కెట్బాల్ లిగ్ మరియు ఇతరులలో ఉన్నపుడు) ఆటగాడిని అనర్హునిగా ఆరవ ఫౌల్ లో ప్రకటించబడేది.

షాట్ క్లాక్ మరియు కాల పరిమితులు[మార్చు]

బంతిని కలిగియుండే కాలపరిమితి నిబందన మొదటిసారిగా 1933లో మొదలయినది. ఈ సమయంలోనే జట్లు బంతిని పొందిన 10 సెకనుల కాలంలోనే వేరోకరికి చేరవేయడం అమలులో ఉండేది. ఈ కాల పరిమితిని ఎనిమిది సెకనులుగా FIBA తగ్గించడం, ఆ తర్వాత NBA 2001లో కేసు వేయడంతో ఈ నిభందన 2000 సంవత్సరం వరకు మాత్రమే అమలయింది. NCCA ఈ కాల పరిమితిని 10 సెకనులుగా పురుషుల ఆటకు నిలుపుకోగలిగినది కానీ స్త్రీల ఆటకు ఎప్పుడూ అమలుచేయలేదు. U.S. పాఠశాలలలోని నిబందనలు రచించిన NFHS 10 సెకనుల కాల పరిమితినే స్త్రీ పురుషులకు నిర్దేశించింది.

1936 సంవత్సరంలో 3 సెకనుల నియమం అమలు ప్రారంభమయింది. ఈ నియమం ప్రకారం కళంకిత ఆటగాళ్ళు ఎదురు ఆటగాళ్ళ బాస్కెట్ వద్ద 3 సెకనుల కన్నా ఎక్కువ సమయం ఉండరాదు (ఈ సంక్షిప్త నిషేదిత ప్రాంతాన్ని లేన్ లేదా కి అని అంటారు). కీలకమయిన ఈ ఆట నియమం కేంచుకి విశ్వవిద్యాలయం మరియు న్యూయార్క్ విశ్వవిద్యాలయం మధ్య ప్రారంబించబడినది . కేంచుకి కోచ్ అడాల్ఫ్ రప్ప్ తన రెఫరీలలో ఒకరిని తనతో తీసుకుని పోలేదు. మిడ్వెస్ట్ మరయు వెస్ట్ విభేదాల గురించి నోత్రే డేం శిక్షకుడు జార్జి కియోగన్ వారించినా ఆట ముఖ్యంగా జటిలమయినది. ఈ ఆట మరియు ఇతరుల వలన 6"5" (1.96 m ) UK అల్ అమెరికన్ సెంటర్ కు చెందిన లేరోయ్ ఎడ్వర్డ్స్ సాధారణంగా 3 సెకనుల నియమానికి బాధ్యుడుగా గుర్తింపు పొందాడు.

బడా బాబుల మధ్య బలాదిక్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ నియమం పెద్ద కళంకిత ఆటగాళ్ళు బాస్కెట్ కు అతి చేరువలో వేచి ఉండే అవకాశాన్ని కలిగిస్తుంది. 2001లో NBA జోన్ డిఫెన్సును అనుమతించడంతో 3 సెకనుల రక్షణా నియమం కూడా పరిచయం చేయబడింది.

ఆట వేగాన్ని పెంచడం కోసం 1954లో షాట్ క్లాక్ మొదటి సారిగా ప్రవేశ పెట్టబడింది. అందుచే జట్లు బంతిని పొందిన 24 సేకనులలోనే కొట్టవలసి వచ్చింది మరియు బంతి బాస్కెట్ రింను లేదా వెనుక ఉన్న బోర్డును తాకినా లేదా అవతలి జట్టు బంతిని పొందినా షాట్ క్లోక్ ను తిరిగి అమర్చవలసి (రీసెట్) వచ్చేది. ఒక షాట్ కొట్టినప్పుడు గడియారాన్ని రీసెట్ చెయ్యటం ద్వారా FIBA రెండు సంవత్సరాల తరువాత 30 సెకనుల షాట్ క్లోక్ ను దత్తతు తీసుకుంది. స్త్రీల బాస్కెట్బాల్ లో 30 సెకనుల క్లోక్ ను 1971లో ప్రవేశపెట్టారు. 1985లో NCAA పురుషుల జట్టులో 45 సెకనుల షాట్ క్లోక్ అమలుతో పాటు స్త్రీల 30 సెకనుల క్లోక్ విధానాన్ని కొనసాగించింది. 1993లో పురుషుల షాట్ క్లోక్ విధానాన్ని 35 సెకనులకు తగ్గించింది. FIBA 2000 సంవత్సరంలో షాట్ క్లోక్ ను 24 సెకనులకు తగ్గించటంతో బాటు బంతి బాస్కెట్ రింను తాకినప్పుడు కూడా క్లోక్ రీసేట్టింగ్ ను మార్చింది. వాస్తవానికి షాట్ క్లోక్ కాలవ్యవధి ముగిసి బంతి గాలిలో ఉంటే అది అతిక్రమణ అవుతుంది. 2003 సంవత్సరంలో ఈ నిబంధన మార్చబడింది. తద్వారా బంతి రింను తాకి ఉన్నంత వరకు అది సజీవంగా ఉండిపోతుంది. బంతి రింను తాకి బాస్కెట్ హోప్ వద్ద కొంత ఎగిరినప్పుడు దానిని లూప్ బంతి అంటారు. NFHS నియమాల ప్రకారం షాట్ క్లోక్ విధానాన్ని ఉపయోగించడం ఇచ్చికం మరియు U.S.లో చాలా మంది ఈ నియమాన్ని పాటించరు.

ఫౌల్స్(తప్పిదాలు), ఉచిత త్రోలు మరియు అతిక్రమణలు[మార్చు]

1901లో ప్రవేశపెట్టబడిన డ్రిబ్లింగ్ వాస్తవ ఆటలో భాగం కాదు. సమయానుకూలంగా ఆటగాడు బంతిని బౌన్సు ఒకసారి చేయగలడేగాని నిరవధికంగా కొట్టలేదు. 1909లో డ్రిబ్లింగ్ కు నిర్వచనం "నిరవధికంగా బంతిని అందించుకోవడం"గా మారింది. తద్వారా బంతిని డ్రిబ్ల్ చేసిన ఆటగాడు ఒకసారే బౌన్సు చేసే అవకాశం కలుగుతుంది.

1922 నుంచి బంతితో పాటు పరుగెత్తడం ఫౌల్ గా పిలువబడేది. దీనిని అతిక్రమణగా భావించి బంతిని ప్రత్యర్ధి జట్టుకి ఇచ్చేయటాన్ని శిక్షగా వేసేవారు. బంతిని గుద్దడం కూడా అతిక్రమణగా భావించే వారు. 1931లో బంతిని అనుసరిస్తున్న ఆటగాడు బంతిని అయిదు సెకన్ల కన్నా ఎక్కువ సేపు ఉంచుకున్నచో ఆట నిలిపివెయ్యబడేది మరలా తిరిగి జంప్ బాల్ తో ప్రారంభించబడేది. బాల్ పొంది ఉన్న ఆటగాడికి ఈ పరిస్థితి అతిక్రమణగా పిలువబడేది. గోల్ టెన్డింగ్ అనేది 1944లో అతిక్రమణ గాను మరియు 1958లో నేరం గాను పిలుచుకునేవారు

బాస్కెట్ బాల్ కనుగొన్న వెంటనే ఉచిత త్రోలు ప్రవేశపెట్టబడ్డాయి. 1895లో ఉచిత త్రోలు లైన్ వెనుక ఉన్న బోర్డుకు పదిహేను అడుగుల దూరములో అధికారికంగా వెలువరించబడినది, దానికి ముందు వ్యాయామశాలలు బ్యాక్ బోర్డుకు 120 అడుగుల (6.1 m) దూరములో ఉండేవి. 1924 నుండి ఫౌల్ అయిన ఆటగాళ్ళు తమ ఉచిత త్రోస్ ను ఉపయోగించుకోవాలి. ఫీల్డ్ గోల్ ను సాధించే ప్రయత్నంలో ఫౌల్ అయిన ఆటగాడు ఉచిత త్రో పొందగలడు. ఆటగాడి ఫీల్డ్ గోల్ విజయవంతం కాకపోతే, రెండు ఉచిత త్రోలు పొందగలడు (త్రీ-పాయింట్ ఫీల్డ్ గోల్ ను ఆటగాడు ప్రయత్నించినపుడు). కళంకిత ఆటగాడు షూటింగ్ ప్రయత్నంలో లేనప్పుడు ఫౌల్ అయినట్లయితే, లేదా లూజ్ బాల్ పరిస్థితిలో ఆటగాడు ఫౌల్ అయితే, దానికి జరిమానా ఆట ఒరవడి బట్టి మరియు ప్రతిపక్ష జట్టు నిర్నీత సమయంలో ఆపాదించిన ఫౌల్స్ సంఖ్య పై ఆధారపడి ఉంటుంది.

 • NCAA మరియు NFHS ఆటలో:
  • ఒకవేళ మొదటి సగంలో ఆటగాళ్ళ జట్టులో 6 లేక మరికొన్ని ఫౌల్స్ ఉన్నట్లయితే ఫౌల్ అయిన జట్టు బంతిని పొందగలడు.
  • జట్టు 7 నుండి 9 ఫౌల్స్ కలిగియుంటే ఫౌల్ అయిన ఆటగాడు లైన్ కు వెళ్తాడు. దీనిని వన్-అండ్-వన్ లేదా "బోనస్ " అని అంటారు. అంటే ఆటగాడు మొదటి ఉచిత త్రో చేసినచో రెండవ దానికి అతనికి అవకాశం పొందుతాడు. అలా కానిచో బాల్ లైవ్ అవుతుంది.
  • ఆట ప్రథమార్ధంలో జట్టు 10 లేదా ఎక్కువ ఫౌల్స్ కలిగి ఉన్నట్లయితే ఫౌల్ అయిన ఆటగాడు రెండు ఉచిత త్రోలు పొందుతాడు, దీనిని డబల్ బొనస్ అంటారు.
  • ఫౌల్స్ కూడుటకు ఆట ద్వితియార్ధంలో పెంపుదలకు అధిక ఓవర్ టైం కాలాలను లెక్క లోనికి తిసుకుంటారు. పైగా NFHS నియమాలు క్వార్టర్సులో ఆడిన ఆటలకి కూడా సగానికి ఫౌల్స్ ను కూడగడుతుంది.
 • NBA లో
  • పావువంతు ఆటలో ఆడే జట్టుకు 4 లేదా మరికొన్ని ఫౌల్స్ ఉన్నట్లయితే ఫౌల్ అయిన జట్టు బంతిని పొందగలుగుతుంది.
  • పావువంతు ఆటలో జట్టు యొక్క అయిదవ ఫౌల్ నుంచి ఫౌల్ అయిన ఆటగాడు రెండు ఉచిత త్రోలు పొందుతాడు.
  • క్వార్టరు పొడిగింపుకు ఓవర్ టైమును లెక్కకు తిసుకోరు. దానికి బదులుగా రెండు ఉచిత త్రోలు "పెనాల్టిగా" జట్టు యొక్క నాలుగవ ఫౌల్ లో ఈ ఓవర్ టైము కాలంలో చేర్చబడుతుంది (ఐదవ దానికి బదులుగా).
  • ఓవరు టైము సమయం లేదా క్వార్టరు చివరి రెండు నిమిషాలలో ఫౌల్ పరిధులు రీసెట్ చెయ్యబడును. కూడగట్టిన ఫౌల్స్ పరిధిని జట్టు చేరుకోకపోతే చివరి రెండు నిమిషాలలో ఫౌల్ అయిన మొదటి జట్టు బంతిని పొందుతుంది, మరియు ఆ తర్వాతి ఫౌల్స్ అన్నీ కూడా రెండు ఉచిత త్రోలుగా మారతాయి.
 • FIBA ఆటలో
  • క్వార్టరులో ఆడే జట్టుకు 4 లేదా మరికొన్ని ఫౌల్స్ ఉన్నచో ఫౌల్ అయిన జట్టు బంతిని పొందుతుంది.
  • క్వార్టరులోని మొదటి జట్టు అయిదవ ఫౌల్ నుండి ఫౌల్ అయిన ఆటగాడు రెండు ఉచిత త్రోలు పొందుతాడు.
  • ఫౌల్స్ కూడుదలకు గాను నాలుగవ క్వార్టరు పెంపుదల అన్ని ఓవరు టైము పిరియడ్లు లెక్కకు తీసుకోబడును.

ఛార్జ్ అంటే అఫెన్సీవ్ (తప్పు చేసిన) మరియు డిఫెన్సీవ్ (తప్పుచే బాధించబడిన) ఆటగాళ్ళ మధ్య సంబంధం. అఫెన్సీవ్ ఛార్జ్ పొందటానికి డిఫెన్సివ్ ఆటగాడు, అఫెన్సీవ్ ఆటగాడి మార్గంలో న్యాయపరిరక్షణ పంధాను స్థాపించాలి. సంబంధం నిర్ధారణ అయితే అధికారులు అఫెన్సీవ్ చార్జ్ జారీ చేస్తారు. ఏవిధమైన పాయింట్లు ఇవ్వబడవు మరియు బంతి అవతలి పక్కకు ఇవ్వబడుతుంది. డిఫెన్సీవ్ ఆటగాడు 'నిషేధిత జోన్ నందు' అఫెన్సీవ్ చార్జ్ ఆపాదించడు (ఇతర వివరాలు కొరకు ఈ క్రింద చూడండి).[2]

బ్లాకింగ్ అనగా అఫెన్సీవ్ మరియు డిఫెన్సీవ్ ఆటగాళ్ళ భౌతిక సంబంధము. డిఫెన్సీవ్ ఆటగాళ్ళు అఫెన్సీవ్ ఆటగాళ్ళ బంతాట పంధాలో అంతరాయం కలిగించినచో బ్లాకింగ్ ఫౌల్స్ జారీ చేయబడును. "నిషిద్ద ప్రాంతం"లో డిఫెన్సీవ్ ఆటగాళ్ళు నిలుచుని ఉన్నపుడు బ్లాకింగ్ ఫౌల్స్ జారీ చేయవచ్చు.[2]

నిషిద్ద ప్రాంతం: బ్యాస్కెట్ చుట్టూ 4 అడుగుల (1.22 మీ) వ్యాసార్ధం గల వంపును ఏర్పాటు చేయటాన్ని 1997లో NBA ప్రవేశపెట్టినది. ఇందువల్ల అఫేన్సివ్ ఫౌల్ చార్జింగు అంచనా వేయడం కుదరదు. ఇది బ్యాస్కెట్ కింద నిలిచిన డిఫెన్సీవ్ ఆటగాళ్ళు ప్రత్యర్ధ ఆటగాళ్ళ మీద ఆఫేన్సివ్ ఫౌల్ దాడిని చేయకుండా నివారించుటకు ఉద్దేశించబడింది. 2010 సంవత్సరంలో FIBA 1.25 మీటర్ల (4 అడుగుల 1/2 ఇంచిల) వ్యాసార్ధంతో ఆర్క్ పద్ధతిని అమలుచేస్తున్నది.[3]

స్కోరింగ్ మరియు కోర్ట్ మార్కింగులు[మార్చు]

వాస్తవంగా గోల్స్ సంఖ్య మాత్రమే లెక్కించబడుతుంది మరియు ఉచిత త్రోలు ప్రవేశ పెట్టబడినప్పుడు అవి ఒక గోల్ గా పరిగణించబడేవి. 1896వ సంవత్సరంలో రెండు పాయింట్లను ఒక ఫీల్డ్ గోల్ గాను మరియు ప్రతి ఉచిత త్రోను ఒక పాయింట్ గాను మార్చారు. అమెరికన్ బాస్కెట్బాల్ అసోసియేషన్ త్రీ పాయింట్ ఫీల్డ్ గోల్ 1967లో ప్రవేశపెట్టినది, ఇది ప్రారంభం అయినప్పుడు త్రీ పాయింట్ ఫీల్డ్ గోల్ ఆర్క్ పరిధి దాటి స్కోరు చేసింది. 1984లో బ్యాస్కెట్ కేంద్రం నుంచి 6.25 మీటర్ల (20 ft. 6 in.) త్రీ పాయింట్ లైన్ ను FIBA ప్రవేశపెట్టినది. 1986లో NCAA 19 మీటర్ల 9 ఇంచీల త్రీ పాయింట్ లైన్ పద్ధతిని అమలుచేసినది. 2008-09 సీజనుకు గాను పురుషుల ఆటకు దూరం 20 అడుగుల 9 ఇంచీలు పెంచబడినది కాని స్త్రీల ఆటకు మాత్రం 19 అడుగుల 9 ఇంఛీలుగా మిగిలిపొయినది.

ఫ్రీ త్రో లేన్ గా పిలువబడే నిషేధిత ప్రాంతం వెడల్పు 6 అడుగుల నుండి 12 అడుగులకు (1.8 నుండి 3 .7 మీటర్లు) 1951లో పెంచబడింది. 1956లో FIBA ట్రపెజోడియల్ లేనును 3.6 మీటర్ల వెడల్పుతో ఫ్రీ త్రో లైన్ మరియు 6 మీటర్ల (19 అడుగుల 6 ఇంచీల) వెడల్పుతో బేస్ లైన్ వద్ద ఆపాదించింది. 1961లో NBA ఈ వెడల్పును 16 అడుగులుగా (4.9 మీటర్లు) గా పెంచింది. ఈ రెండు లేనులు అలాగే మిగిలిపోయినవి.

2006 ఏప్రిల్ 26న FIBA తమ నియమ నిభందనలకు "చారిత్రక మార్పులను" ప్రకటించింది. FIBA కోర్ట్ మార్కింగులు NBA మార్కింగులకు చాలా వరకు సమానంగా ఉండేటట్టు తయారయినవి. ఈ మార్పులు FIBA కు ముఖ్యమైన ఆటల పోటిలకు (ఒలంపిక్ బాస్కెట్బాల్, వరల్డ్ చాంపియన్షిప్ సీనియరు స్థాయి, 19 మరియు 17 సంవత్సరాల వయస్సు క్రింది స్థాయిలు మరియు ప్రాంతీయ/ఖండాంతర చాంపియన్షిప్ లు) 2010 అక్టోబరు 1 నుండి అమలు చెయ్యబడతాయి. 2010 స్త్రీ, పురుషుల ప్రపంచ చాంపియన్షిప్ లు తర్వాత మరియు అక్టోబరు 1వ తేదీ 2012 నుండి ఈ నియమ నిభందనలు తప్పనిసరి అవుతాయి (జాతియ సమాఖ్యలు ఈ తేదీకి ముందు నుంచే అమలు చేయడానికి అనుమతించాయి) ఈ మార్పుల జాబితా ఏమనగా:[3]

 • NBA అమలు చేసే కొలతల ప్రకారమే FIBA దీర్ఘ చతురస్రాకార నిషిద్ద ప్రాంతాలను అమలు చేస్తుంది.
 • బ్యాస్కెట్ మధ్య నుండి త్రీ పాయింట్ లైన్ 6.75 మీటర్ల (22 అడుగుల 1.7 ఇంచీలు) కి వెళుతుంది.
 • NBA ప్రస్తుతం అమలుచేస్తున్న "నో చార్జ్ సెమి సర్కిల్స్"ను FIBA దత్తతు తీసుకుంటుంది. డిఫెండర్ బ్యాస్కెట్ వద్ద గల సేమిసర్కిలు లోపు డిఫెన్సివ్ ఆటగాడు ఉన్నట్లయితే అఫెన్సివ్ ఆటగాడు డిఫెన్సివ్ ఆటగాడిని చార్జింగుకు పిలవలేడు. NBA సెమిసర్కిలు 4 అడుగులు (1.22మీటర్లు) అయితే FIBA సెమిసర్కిలు 1.25 మీటర్లు (4 అడుగుల 1.2 ఇంచీలు), ఈ రెండు కొలతలు కూడా బ్యాస్కెట్ మధ్య నుండి కొలవబడుతాయి.

హై స్కూల్ బాస్కెట్ బాల్ నందు డిఫెండర్ ఆటగానికి 6 అడుగుల లోపు దూరంలో ఉంటే ఐదు సెకన్ల లెక్కింపు ఖచ్చితంగా మొదలవాలి. డిఫెండర్ 6 అడుగుల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నా లేదా ఆటగాడు బంతిని నెల పైకి వీసిరినా కౌంట్ రీసెట్ చేయాలి.

పరికరాలు[మార్చు]

కోర్టుకు 10 అడుగుల (3.05m) కన్నా ఎత్తులో గోల్ ఉంచాలి. వాస్తవానికి ఒక బాస్కెట్ ను ఉపయోగిస్తారు (అందుకే బాస్కెట్ బాల్ అయింది) కాబట్టి ప్రతి షాట్ కు బంతిని పునరుద్దరించాలి. ఇందుకు బదులుగా ఓపన్-బాటం హుప్ ఉపయోగించబడుతున్నది

నిర్వహణ మరియు పద్దతులు[మార్చు]

వాస్తవంగా ఫౌల్స్ ను నిర్ధారించడానికి ఒక నిర్వాహకుడు మరియు బంతిని నిర్దేశించడానికి ఒక రెఫరీ ఉంటారు. అధికారికంగా వీరిని "రెఫరీ" అని మరియు మరొకరు లేదా ఇద్దరినీ "నిర్వాహకుడు" (అంపైర్) గా పిలుస్తున్నారు. (కాని NBA వీరిని వేరే విధమైన పేర్లతో "క్రూ చీఫ్" మరియు ఇతరులను "రెఫరీ"గా పిలుచుకుంటారు). ఇప్పుడు ఇలా పిలువబడే రెండువిధాల అధికారులకు అన్ని విధాల ఆట నిర్వహణకు సమానమైన అధికారాలు ఉన్నాయి. 1988లో NBA మూడవ అధికారిని చేర్చినది మరియు FIBA ఆ తర్వాత అదే పనిచేసింది. ఈ ఏర్పాటు 2006లోని అంతర్జాతీయ పోటిలలో మొట్టమొదటి సారిగా అమలయినది. విడియో పరమైన ఆధారాలతో రెఫరీ నిర్ణయాన్ని తెలియజేయడం పూర్తిగా నిషేధించటం అయింది. కాకపొతే కాలవ్యవధి లోపే చివరి షాట్ వేసారా లేదా అనేది తెలుసుకోవాల్సినప్పుడు మినహాయింపు ఉంది. ఈ మినహాయింపు 2002లో NBA ప్రారంబించినది మరియు FIBA 2006లో నుండి అమలుచేసింది. NCAA మాత్రం సమయం కొరకు తక్షణ రీప్లేను అనుమతించింది. ఫీల్డ్ గోల్ విలువ, (రెండు లేక మూడు పాయింట్లు ) షాట్ క్లాక్ అతిక్రమణ మరియు ఆటగాళ్ళు నిర్లక్ష్య వైఖరి, క్రమశిక్షణ రాహిత్యం వలన ఆటగాళ్లను అనర్హులుగా చేయడానికి ఇది ఉద్దేశించబడింది. NBA 2007లో తమ నియమాలను మార్పిడి చేసింది NCAA పంధాలోనే అధికారులు ఫ్లగ్రంట్ ఫౌల్స్ పాత్రను తక్షణ రీప్లే చూడడానికి దీని ద్వారా వీలవుతుంది. ఇటలీ యొక్క లేగా A, ఒక అమెరికన్ ఫుట్బాల్ శిక్షకుడి యొక్క సవాలు (తదుపరి డేడ్ బాల్ వద్ద ) NCAA మాదిరిగా ఎలాంటి సందర్భంలో అయినా ఒక అధికారిక కాల్ ను సవాలు చేసేందుకు అనుమతిస్తుంది.

ప్రతి విజయవంతమైన ఫీల్డ్ గోల్ తర్వాత ఆటను మొదలుపెట్టేందుకు ఉపయోగించే సెంటర్ జుంప్ బాల్ ను 1938లో తొలగించారు, స్కోరందుకొని లైన్లో వెనకబడ్డ జట్టుకు బాల్ అందిచుటకు, గోల్ స్కోరు చేయుటకు మరియు ఆటను సజావుగా నడిపించుటకు ఇది అనుకూలిస్తుంది. ఆటను ప్రారంభించుటకు మరియు ఏ సమయంలో అయినా బంతి స్తంభించినప్పుడు కూడా ఈ జుంప్ బాల్ ఉపయోగించబడుతుంది. కాని NBA నాల్గవ క్వార్టర్ ద్వారా రెండవ దానిని ప్రారంభించటానికి జుంప్ బాల్ ను ఉపయోగించడం 1975లో నిలిపివేసింది. క్వార్టరు కలిగి ఉండే విధానమునకు బదులుగా జుంప్ బాల్ ను పోగొట్టుకున్న ఆటగాడు రెండవ మరియు మూడవ సమయాల నుండి ఆవలి వైపు బంతి తిసుకుంటాడు. కాని జుంప్ బాల్ విజేత కోర్టు అవతలి చివరి నుండి బంతిని తీసుకుని ఆట ప్రారంభిస్తాడు.

1981లో NCAA అన్ని జుంప్ బాల్ పరిస్థితులలో ప్రత్యామ్నాయాలను కలిగి ఉండే వ్యవస్థను తీసుకుంది మరియు దీనిని ఆట ప్రారంభం మినహా అన్ని వేళలా అమలుచేసింది. 2003లో FIBA మూడవ కాలం మరియు ఓవర్ టైం పరిస్థితులను మినహాయించి అదే విధమైన నియమాన్ని అమలులోకి తెచ్చింది. ఓపెనింగ్ ట్యాప్ తర్వాత యారో అన్ని పరిస్థితులకు వర్తిస్తుందని 2004లో FIBA ఈ నియమాన్ని మార్పు చేసింది.

ఆట చివరి రెండు నిమిషాల వ్యవధిలో ఏదయినా న్యాయపరమైన టైం ఆవుట్ పరిస్థితిలో మధ్య లైన్ కు బంతిని జట్లు తెచ్చుకునే విధంగా 1976లో NBA ఒక నియమాన్ని ప్రవేశపెట్టినది. FIBA 2006లో ఈ విషయం పై కేసు వేసింది.

బ్యాస్కెట్ బాల్ అంతర్జాతీయ నియమాలు .[మార్చు]

ఇటివలి అంతర్జాతీయ బ్యాస్కెట్ బాల్ నియమాలు 2008 ఏప్రిల్ 26 FIBA ఆమోదం పొంది అదే సంవత్సరం అక్టోబరు 1 నుండి అమలులోకి వచ్చాయి.[4]

పరికరాలు మరియు వసతులు, జట్ల గురించిన నిభందనలు, ఆటగాళ్ళు, జట్టు నాయకులు మరియు శిక్షకులు, ఆడే నిభందనలు, అతిక్రమణలు, ఫౌల్స్ మరియు జరిమానాలు, ప్రత్యేక పరిస్థితులు మరియు అధికారులు టేబుల్ అధికారుల సంబంధించిన 8 నియమాల పై 50 వ్యాసాలు ఉన్నాయి. ఈ నియమాలు అధికారుల సంకేతాలు, స్కోర్ పత్రం, ధిక్కారపు విధానాలు, జట్ల వర్గీకరణ మరియు టెలివిజను టైం అవుట్స్ కు సంబంధించినవి.

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]