బాహుబలి:ద బిగినింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాహుబలి
దర్శకత్వం ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత శోభు యార్లగడ్డ
దేవినేని ప్రసాద్
కె. రాఘవేంద్రరావు
(సమర్పణ)
రచన విజయేంద్ర ప్రసాద్
నటులు ప్రభాస్
రానా దగ్గుబాటి
అనుష్క
తమన్నా భాటియా
సంగీతం ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం కె. కె. సెంథిల్ కుమార్
నిర్మాణ సంస్థ
పంపిణీదారు ఆర్కా మీడియా వర్క్స్
విడుదల
2015 (2015)
దేశం భారత దేశం
భాష తెలుగు
తమిళం
hindhi
ఖర్చు INR125 కోట్లు collection=650కోట్లు[1]

తెలుగు సినిమాకి టెక్నాలజీ పరంగా కోడి రామకృష్ణ గారి తరువాత కొత్త హంగులు దిద్దిన దర్శక ధీర ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న చిత్రం బాహుబలి. ఈ సినిమాని దర్శకేంద్రులు కె.రాఘవేంద్ర రావు సమర్పించగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా వర్క్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ఏక కాలంలో తెలుగు మరియు తమిళం భాషలలో చిత్రీకరించుచున్నరు. అంతే గాకా ఈ చిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషలలోను ఇంకా హిందీ భాషలోను అనువదించుచున్నారు.ఈ చిత్రానికి సంగీతాన్ని రాజమౌళి ఆస్థాన సంగీత విద్వాంసుడు అయిన ఎం.ఎం.కీరవాణి అందించగా జాతీయ అవార్డు గ్రహీత అయిన సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యహరిస్తున్నారు.

ప్రధాన తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

1. మమతల తల్లి (గానం: సత్య యామిని, రచన: కె.శివ శాంతి దత్త)

2. జీవనది (గానం: గీతా మాధురి, రచన: ఇనగంటి సుందర్)

3.ధీవర (గానం: రమ్య బెహ్రా, దీపు, రచన: కె.శివ శాంతి దత్త)

4.శివుని ఆనా (గానం: యం.యం.కీరవాణి, మౌనిమ, రచన: ఇనగంటి సుందర్)

5.పచ్చ బొట్టేసిన (గానం: కార్తిక్, దామిని, రచన: అనంత శ్రీరాం)

6.మనోహరి (గానం: మొహన్ భోగరాజు, రేవంత్, రచన: చైతన్య ప్రసాద్)

7.నిప్పులే శ్వాసగా (మాహిష్మతి) (గానం: యం.యం.కీరవాణి, రచన: ఇనగంటి సుందర్)

8.ధీవరా (ఆంగ్లం) (గానం: రమ్య బెహ్రా, ఆదిత్య, రచన: నొఎల్ సేన్, ఆదిత్య)

కథ[మార్చు]

ప్రాణాలను తెగించి శివగామి (రమ్యకృష్ణ) కాపాడిన బిడ్డ ఓ గూడెంలో శివుడు (ప్రభాస్) గా ఎదుగుతాడు. తన గూడెంకి దగ్గరున్న కొండపై ఏమున్నదో తెలుసుకోవాలనే కుతూహలంతో చిన్నతనం నుండి అనేకసార్లు ఆ కొండ ఎక్కబోయి విఫలమవుతాడు. కానీ ఓ రోజు అవలీలగా ఎక్కేస్తాడు. అందుకు అతడిని ప్రేరేపించిన అంశం ఏమిటి? ఆ కొండపై శివుడు ఏమి చూశాడు? ఆ తరువాత అతడి జీవితం ఎలా మారిపోయింది? మాహిష్మతి రాజ్యానికి, ఆ రాజ్యపు రాజు భల్లాలదేవుడు (రానా) కి, మరో రాజు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కి, శివుడికి ఏమిటి సంబంధం? అన్నవి ఈ చిత్రపు కథాంశాలు.

సినిమా ప్రచారం[మార్చు]

దర్శకుడు రాజమౌళి తెరకెకిస్తున్న ఈ చిత్రరాజాన్ని మొదులు పెట్టిన నాటి నుంచి ఈ సినిమాని నిత్యం ప్రచార మాద్యమాలలో ఎల్లప్పుడు కానవస్తూనే ఉంది. ఎన్ని విధాలుగా ప్రచారం చేయాలో అన్ని విధాలని అచరణలో ఉంచారు ఈ చిత్ర నిర్మాతలు. మొదట ప్రభాస్ జన్మదినం సందర్భంగా సినిమా యొక్క నిర్మాణ వీడియోని విడుదల చేసారు అది మొదలుకొని నిత్యం ఏదో ఒక సందర్భన్ని పురస్కరించుకొని సినిమాని జనాన్ని అనుసందానిస్తూనే వున్నారు చిత్ర నిర్మాతలు. ఆ తరువాత అనుష్క జన్మదినం సందర్భంగా ఒక వీడియో, రానా జన్మదినం సందర్భంగా ఒక వీడియో [2][3][4][5][6][7], తమన్నా జన్మదినం సందర్భంగా ఫస్ట్ లుక్, ఇంకా దేశ రాజధానిలో జరిగిన ప్రఖ్యాత "కామిక్ కాన్" సమ్మేళనంలో బాహుబలి మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది[8][9].

తారాగణం[మార్చు]

 • కథ: విజయేంద్రప్రసాద్
 • కళ: సాబు సిరిల్
 • కెమెరా: సెంథిల్ కుమార్
 • గ్రాఫిక్స్ : శ్రీనివాస్ మోహన్
 • సంగీతం: ఎంఎం కీరవాణి
 • ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
 • పోరాటాలు: పీటర్ హెయిన్స్
 • సమర్పణ: కె రాఘవేంద్రరావు
 • నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
 • కథనం, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2015 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ సినిమా నిర్మాత: శోభు యార్లగడ్డ మరియు అర్క మీడియా వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్.
దర్శకుడు: ఎస్. ఎస్. రాజమౌళి
విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ చిత్రం శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ సహాయనటి రమ్యకృష్ణ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ విలన్ రానా దగ్గుబాటి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం కె.కె.సెంథిల్ కుమార్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ సంగీతదర్శకుడు ఎం. ఎం. కీరవాణి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ నేపథ్య గాయకుడు ఎం. ఎం. కీరవాణి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ కళా దర్శకుడు సాబు సిరిల్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ నృత్య దర్శకుడు ప్రేమ్‌ రక్షిత్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ శబ్ద గ్రాహకుడు పి.ఎం.సతీష్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ రమా రాజమౌళి, ప్రశాంతి విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ స్టంట్ మాస్టర్ పీటర్ హేన్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ వి.శ్రీనివాస మోహన్ విజేత
2015 నంది పురస్కారాలు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు పి.రవిశంకర్ విజేత

మూలాలు[మార్చు]

 1. Baahubali budget to go beyond 175 cr. - The Times of India Retrieved 8 September 2014
 2. "Watch: The making of SS Rajamouli's 'Baahubali'". CNN-IBN. 23 October 2013. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 3. Karthik, Pasupulate (14 December 2013). "Rana Baahubali making video goes viral". The Times of India. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 4. Shekhar (6 February 2014). "Baahubali New Video: Rajamouli Teaches How To Climb Elephant". entertainment.oneindia.in. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 5. Karthik, Pasupulate (23 October 2013). "Prabhas Bahubali first look goes viral". The Times of India. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 6. Sangeetha, Seshagiri (19 March 2014). "'Baahubali' Team's Video on Exam Tips Goes Viral". 
 7. Sangeetha Seshagiri (7 November 2013). "Anushka Shetty Gets 'Baahubali' Making Trailer, 'Rudhramadevi' First Look as Birthday Gifts [VIDEO+POSTER]". International Business Times. Retrieved 16 ఆప్రిల్ 2014.  Check date values in: |accessdate= (help)
 8. "Baahubali Motion Print". reveye.in. 7 February 2014. Retrieved 21 March 2014. 
 9. "IF ONLY YOU WERE A 'BAAHUBALI'". wowsomeapp.com. 
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం