బాహుబలి: ది ఎపిక్
స్వరూపం
| బాహుబలి: ది ఎపిక్ | |
|---|---|
| దర్శకత్వం | ఎస్. ఎస్. రాజమౌళి |
| స్క్రీన్ ప్లే | ఎస్. ఎస్. రాజమౌళి |
| కథ | కె. వి. విజయేంద్ర ప్రసాద్ |
| నిర్మాత | |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | కె.కె.సెంథిల్ కుమార్ |
| కూర్పు |
|
| సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
| పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 31 అక్టోబర్ 2025 |
సినిమా నిడివి | 220 నిమిషాలు[2] |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
బాహుబలి: ది ఎపిక్ 2025లో విడుదలకానున్న తెలుగు భాషా ఎపిక్ యాక్షన్ సినిమా. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి:ద బిగినింగ్ (2015); బాహుబలి 2: ది కన్ క్లూజన్ (2017) రెండు భాగాలను అనేక మార్పులు, చేర్పులు చేసి బాహుబలి:ద బిగినింగ్ విడుదలై పదేళ్లయిన సందర్భంగా అక్టోబర్ 31న బాహుబలి: ది ఎపిక్ పేరుతో విడుదల చేయనున్నారు.[3]
బాహుబలి: ది ఎపిక్ సినిమాను సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేసి డాల్బీ టెక్నాలజీతో పాటు సౌండ్ క్వాలిటీ, విజువల్ క్వాలిటీకి మెరుగులు దిద్ది టీజర్‌ను ఆగస్టు 26న విడుదల చేశారు.[4] ఈ సినిమా IMAX, Dolby Cinema, 4DX, D-Box, EpiQ, ICE & PCX వంటి ప్రీమియం ఫార్మాట్‌లలో విడుదల కానుంది.[5]
నటీనటులు
[మార్చు]- ప్రభాస్ (త్రిపాత్రాభినయం)
- మహేంద్ర బాహుబలి "శివుడు"
- అమరేంద్ర బాహుబలి, శివుడు తండ్రి, మాహిష్మతి యువరాజు
- మహారాజా వీరేంద్ర విక్రమదేవ, శివుడు తాత (ఫోటో మాత్రమే)
- రానా దగ్గుబాటి (భల్లాలదేవ)
- అనుష్క శెట్టి దేవసేనగా, అమరేంద్ర బాహుబలి భార్య & శివుడు తల్లిగా
- తమన్నా భాటియా (అవంతిక)
- రమ్యకృష్ణ (రాజమాత శివగామి) బిజ్జలదేవ భార్య, భల్లాలదేవ తల్లి
- సత్యరాజ్ (కట్టప్ప)
- నాజర్ (బిజ్జలదేవ)
- పెనుమత్స సుబ్బరాజు (కుమారా వర్మ)
మూలాలు
[మార్చు]- ↑ "బాహుబలి ఎపిక్ లో అలాంటివి ఏమీ ఉండవు.. పెట్టుకోకండి.. షాకిచ్చిన నిర్మాత". 10TV Telugu. 7 October 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
- ↑ "రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'.. వామ్మో అంత రన్ టైమ్?". Sakshi. 15 October 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
- ↑ "A decade of 'Baahubali': SS Rajamouli's two-part saga set for re-release" (in ఇంగ్లీష్). The Hindu. 10 July 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
- ↑ "రెండు పార్ట్స్ కలిపి బాహుబలి ది ఎపిక్.. టీజర్ చూశారా". Chitrajyothy. 26 August 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
- ↑ "Baahubali: The Epic to Enthrall Viewers in Multiple Premium Formats" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 15 October 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.