బికాష్ చౌదరి
| బికాష్ చౌదరి | |||
| పదవీ కాలం 1998-2005 | |||
| ముందు | హరధన్ రాయ్ | ||
|---|---|---|---|
| తరువాత | బన్సా గోపాల్ చౌదరి | ||
| నియోజకవర్గం | అసన్‌సోల్[1] | ||
| పదవీ కాలం 1977-1996 | |||
| ముందు | అమరేంద్ర మండల్ | ||
| తరువాత | పెలాబ్ కబీ | ||
| నియోజకవర్గం | జమురియా[1] | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1932 డిసెంబరు 25 సహర్సా , బీహార్ | ||
| మరణం | 2005 ఆగస్ట్ 1 (వయసు: 72) | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | ||
| నివాసం | బుర్ద్వాన్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
బికాష్ చౌదరి (25 డిసెంబర్ 1932 - 1 ఆగస్టు 2005) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]బికాష్ చౌదరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1977 నుండి 1996 వరకు జమురియా శాసనసభ నియోజకవర్గం నుండి పశ్చిమ బెంగాల్ శాసనసభ సభ్యుడిగా పని చేసి, 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ కుమార్ ఘాటక్ పై 26,149 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 1999 లోక్‌సభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ కుమార్ ఘాటక్ పై 37,864 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
బికాష్ చౌదరి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఘటక్ మోలోయ్‌పై 1,24,318 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Member Profile". Lok Sabha website. Archived from the original on 17 April 2014. Retrieved 31 August 2015.
- ↑ "General Elections, 1998 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 1999 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, 2004 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission of India. Retrieved 2 June 2014.