Jump to content

బిగాల గ‌ణేష్ గుప్తా

వికీపీడియా నుండి
బిగాల గ‌ణేష్ గుప్తా
బిగాల గ‌ణేష్ గుప్తా


పదవీ కాలం
2014-18,  2018 - ప్రస్తుతం
నియోజకవర్గం నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1969, జూన్ 2
మాక్లూర్, మాక్లూర్ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు కృష్ణమూర్తి, సువర్ణమాల
జీవిత భాగస్వామి లత
సంతానం రిది, రియ
నివాసం నిజామాబాద్

బిగాల గ‌ణేష్ గుప్తా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున నిజామాబాద్ అర్బన్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జననం, విద్య

[మార్చు]

గణేష్ గుప్తా 1969, జూన్ 2న కృష్ణమూర్తి, సువర్ణమాల దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలంలోని మాక్లూర్ గ్రామంలో జన్మించాడు. 1985లో స్వగ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేసిన గణేష్ గుప్తా 1987లో నిజామాబాదులోని సిఎస్ఐ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేశాడు. 1996లో గుల్బర్గా విశ్వవిద్యాలయం, గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బి.ఈ) పూర్తి చేసాడు. ఆ తరువాత కొంతకాలం వ్యాపారం చేశాడు.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గణేష్ గుప్తాకు లతతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు రిది, రియ ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

గణేష్ గుప్తా టీఆర్ఎస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2009లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీర్ మాజాజ్ ఆలీ షేక్ పై 10,308 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[4][5] గణేష్ గుప్తా 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాహెర్ బిన్ హమ్దాన్ పై 25,841 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[6]

ఇతర వివరాలు

[మార్చు]

చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, హాంకాంగ్, హంగరీ, నార్వే, రష్యా, స్వీడన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలు సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. admin (2019-01-10). "Nizamabad Urban MLA Bigala Ganesh Gupta". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
  2. Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  3. Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  4. Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  5. Sakshi (6 November 2018). "గులాబీ గుబాళింపు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  6. Mohan, P. Ram (2018-12-12). "It's 8 out of 9 for TRS in old Nizamabad dist". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-08-23.